జూన్ 2024 నుండి ఇప్పటి వరకు సాధించిన విజయాలు… Attachments below
గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టరేట్
జూన్ 2024 నుండి ఇప్పటి వరకు సాధించిన విజయాలు
- విద్యా రంగం: 371 ఆశ్రమ పాఠశాలలు, 17 ప్రీ-మాట్రిక్ హాస్టళ్లు, 170 పోస్ట్-మాట్రిక్ హాస్టళ్లు మరియు 1,958 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ద్వారా 1,61,082 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు.
- మొత్తం రూ. 61 కోట్ల బడ్జెట్‌లో రూ. 1368.06 కోట్లు (29.28%) గిరిజన విద్యకు కేటాయించబడింది.
- విద్యార్థులకు అందించిన సౌకర్యాలు
- స్టీల్ ప్లేట్లు&గ్లాసులు – రూ. 20 కోట్లు
- స్టేషనరీ – రూ. 89 కోట్లు
- పడక సామగ్రి – రూ. 21 కోట్లు
- 1,12,868 నోట్‌బుక్స్ – రూ. 42 కోట్లు
- మల్టీ లింగ్వల్ విద్య (MTB-MLE): సవారా, కూవి, కొండ, ఆదివాసీ ఓరియా, కోయ, సుగాలి భాషల్లో 1127 పాఠశాలల్లో బోధన (రూ. 83 కోట్లు).
- స్టేట్ అకడమిక్ మానిటరింగ్ యూనిట్ స్థాపన: పాఠశాల విద్య, సమగ్ర శిక్ష మరియు ఐటిడిఏల పరిధిలోని PMRCల మధ్య సమన్వయ లోపాలను తగ్గించి, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యా ప్రతిభను అభివృద్ధి చేయుటకు.
- కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లు : మంజూరైన ఖాళీ పోస్టులకు వ్యతిరేకంగా (1260) మంది సేవలను ప్రభుత్వం పునరుద్ధరించింది.
- మెగా DSC-2024:ప్రకటన చేసిన (881) ఉపాధ్యాయ పోస్టులలో, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో (850) పోస్టులు భర్తీ చేయబడ్డాయి.
- ప్రమోషన్లు: (63) మంది బోధనా మరియు బోధనేతర సిబ్బందికి వివిధ కేడర్లలో పదోన్నతులు కల్పించబడినవి.
- క్లీనింగ్&శానిటేషన్ సేవల అవుట్‌సోర్సింగ్: ప్రభుత్వం G.O.Rt.No.12 ద్వారా గిరిజన సంక్షేమ విద్యాసంస్థల్లో 1789 క్లీనింగ్&శానిటేషన్ సేవలను మరియు వంట సేవలను అవుట్‌సోర్సింగ్ ద్వారా నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది.
- బెస్ట్ అవైలబుల్ స్కూల్ (BAS):ఈ పథకం 2021-22లో నిలిపివేయబడింది మరియు 2019-2023 సంవత్సరాలకు సంబంధించిన పాఠశాలలకు బకాయిలుగా ఉన్న రూ. 95 కోట్లు చెల్లించబడినవి.
- ST స్టడీ సర్కిల్:ప్రభుత్వం విశాఖపట్నం, వేపగుంటలోని YTC వద్ద మరియు విజయవాడ/గుంటూరు, తిరుపతి ప్రాంతీయ కేంద్రాలతో కలిపి, 300 మంది విద్యార్థుల కోసం రూ. 4.22 కోట్లతో అనుమతి ఇచ్చింది.
- పోస్ట్-మాట్రిక్ స్కాలర్‌షిప్స్: రూ. 32 కోట్లతో 1,15,909 మంది విద్యార్థులు లబ్ధి పొందారు.
- “ముస్తాబు”:వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన పెంపొందించి, ఆరోగ్య మరియు పరిశుభ్రత ప్రమాణాలను మెరుగుపరచేందుకు ఒక కొత్త కార్యక్రమం ప్రారంభించబడింది.
- బర్త్ వెయిటింగ్ హోమ్స్: 35 (BWHs) కేంద్రాల్లో రూ. 29 కోట్లు వినియోగించబడినవి.
- సికిల్ సెల్ అనీమియా నిర్మూలన:2047 నాటికి సికిల్ సెల్ అనీమియా నిర్మూలన లక్ష్యంగా ప్రారంభించబడిన ఈ కార్యక్రమంలో, 19,90,277 గిరిజన జనాభా లక్ష్యానికి వ్యతిరేకంగా 14,95,185 మందికి స్క్రీనింగ్ నిర్వహించబడింది.
కేంద్ర పథకాలు:
- రాష్ట్ర ఆర్థిక శాఖ 2025-26 సంవత్సరంలో, 2018-19 నుండి 2023-24 వరకు సంబంధించిన పెండింగ్ కేంద్ర నిధులలో రూ. 93 కోట్లు విడుదల చేసింది.
- ఆర్టికల్ 275(1) గ్రాంట్ కింద 53 పనులకు రూ.21 కోట్లు రీవ్యాలిడేట్ చేయబడగా, పనులు పూర్తయ్యాయి. చెల్లింపుల ప్రక్రియ కొనసాగుతోంది.
- రహదారి అనుసంధాన కార్యక్రమంలో భాగంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో 98 గిరిజన హాబిటేషన్లకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు రూ.71 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలనా అనుమతులు మంజూరు చేయబడగా, పనులు పురోగతిలో ఉన్నాయి.
ట్రైకార్ – ఉన్నతి (ఆర్థిక సహాయ పథకాలు):
- SERP-AP తో సమన్వయంగా SCA to TSS నిధుల ద్వారా గిరిజన స్వయం సహాయక సంఘాల (SHGs) సభ్యులకు 56 జీవనోపాధి కార్యక్రమాలు అమలు చేయబడుతున్నాయి.
- మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.30 కోట్లు.
- ఇందులో గిరిజన సంక్షేమ శాఖ (TWD) వాటా రూ.15 కోట్లు.
- మొత్తం లబ్ధిదారులు – 4,030 గిరిజన మహిళలు.
PM JANMAN
- ఈ మిషన్ PVTG కుటుంబాలు మరియు నివాస ప్రాంతాలకు మౌలిక సౌకర్యాలు పూర్తిగా అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
- (11) విషయాలు అమలుకు (9) మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేయబడుతోంది.
-
- పక్కా గృహాల నిర్మాణం (8250)
- అనుసంధాన రహదారులు (76.06 కి.మీ)
- పైప్ ద్వారా త్రాగునీటి సరఫరా (2146)
- మొబైల్ మెడికల్ యూనిట్లు (156 MMUs ద్వారా 4152 నివాస ప్రాంతాలకు సేవలు)
- హాస్టళ్ల నిర్మాణం మరియు నిర్వహణ (55)
- అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం మరియు నిర్వహణ (41)
-
- విద్యుత్ లేని గృహాలకు విద్యుత్ సరఫరా (25,168)
- మొబైల్ టవర్స్ స్థాపన (1,353)
- 0.3 కిలోవాట్ సోలార్ ఆఫ్-గ్రిడ్ వ్యవస్థ ఏర్పాటు (798)
- మల్టీపర్పస్ సెంటర్ల (MPC) నిర్మాణం (102)
- వన ధన్ వికాస్ కేంద్రాల (VDVKs) స్థాపన (73)
- మల్టీపర్పస్ సెంటర్ల (MPC): ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం మరియు సబ్ సెంటర్ లేని ప్రాంతాలలో ఉన్న PVTG జనాభాకు, ప్రతి ఒక్కటి రూ. 00 లక్షల చొప్పున మొత్తం రూ. 75 కోట్ల వ్యయంతో 125 MPCలు మంజూరు చేయబడ్డాయి.
- వన ధన్ వికాస్ కేంద్రాలు (VDVK): స్వయం సహాయక సంఘాల్లో పారిశ్రామిక నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు శిక్షణ, పరికరాలు, ముడి సరుకులు మరియు మార్కెటింగ్ సహాయం అందిస్తూ, రూ. 57 కోట్ల వ్యయంతో 73 VDVKల ద్వారా 6162 మహిళలను కవరేజ్ చేయబడింది.
ధర్తి ఆబా జనజాతియా గ్రామ ఉత్త్కర్ష్ అభియాన్ (DA-JGUA):
- గౌరవనీయ ప్రధాన మంత్రి గారు “ధర్తి ఆబా జనజాతియా గ్రామ ఉత్త్కర్ష్ అభియాన్ (DA-JGUA)”ను 10.2024న ప్రారంభించారు. 17 మంత్రిత్వ శాఖల పథకాల సమన్వయంతో (25) కీలక విషయాల ద్వారా అధిక గిరిజన జనాభా కలిగిన గ్రామాలలో మౌలిక సేవల మౌలిక వసతులను పూర్తిస్థాయిలో అందించడం ఈ పథకం లక్ష్యం. ఆంధ్రప్రదేశ్‌లోని 18 జిల్లాలలో 878 గ్రామాలు ఈ పథకం పరిధిలోకి వస్తాయి.
- పక్కా గృహాలు – (PMAY) – గ్రామీణ (62,835)
- అనుసంధాన రహదారులు – (PMGSY) (48 Proposals for 23 Hab.)
- నీటి సరఫరా – జల్ జీవన్ మిషన్ (JJM) – FHTC (1894)
- సమూహ నీటి ట్యాప్‌లు
- గృహ విద్యుదీకరణ – (Revamped Distribution Sector Scheme – RDSS) (5302)
- కొత్త సోలార్ విద్యుత్ పథకం (ఆఫ్-గ్రిడ్ సోలార్)
- మొబైల్ మెడికల్ యూనిట్లు – (జాతీయ ఆరోగ్య మిషన్) (129)
- ఆయుష్మాన్ కార్డు – ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన (PMJAY) – NHA
- ఎల్పీజీ కనెక్షన్లు – (PM ఉజ్వల యోజన) (19,165)
- అంగన్‌వాడీ కేంద్రాల స్థాపన – పోషణ అభియాన్
- హాస్టళ్ల నిర్మాణం – సమగ్ర శిక్ష అభియాన్ (SSA)
- EMRSల్లో పోషణ వాటికలు – నేషనల్ ఆయుష్ మిషన్
- యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ / భారత్ నెట్ (DoT-MoC)
- స్కిల్ ఇండియా మిషన్ (ప్రస్తుత పథకాలు) / ప్రతిపాదనలు (80)
- డిజిటల్ కార్యక్రమాలు
- స్థిరమైన వ్యవసాయ ప్రోత్సాహం – DoAFWపథకాల ద్వారా
- చేపల పెంపకం సహాయం – ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) (210 units)
- పశుసంవర్ధక అభివృద్ధి – జాతీయ పశుసంవర్ధక మిషన్
- సామర్థ్య అభివృద్ధి – రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (RGSA)
- గిరిజన హోమ్ స్టేలు – స్వదేశ దర్శన్ (44)
- గిరిజన మల్టీపర్పస్ మార్కెటింగ్ కేంద్రాలు (TMMCs) (Rs.6.00 Crs)
- ఆశ్రమ పాఠశాలలు / హాస్టళ్లు / ప్రభుత్వ పాఠశాలల అప్‌గ్రేడేషన్(Rs.155.97 Crs)
- FRA సెల్‌ల స్థాపన(Rs.3.36 Crs)
- సికిల్ సెల్ వ్యాధి (SCD) కోసం సెంటర్ ఆఫ్ కంపిటెన్స్ (CoC) ఏర్పాటు(Rs.7.70Crs)
- SCD కౌన్సెలింగ్ / అవగాహన (ToTమరియు ASHA గౌరవ వేతనం)(Rs.0.37 Crs)
- 2024-25 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన రూ. 47 కోట్లకు వ్యతిరేకంగా, సమయానికి ప్రతిపాదనలు సమర్పించడం మరియు భారత ప్రభుత్వంతో నిరంతర అనుసరణ ద్వారా శాఖ ఇప్పటివరకు రూ. 169.48 కోట్ల మంజూరును పొందగలిగింది.
- విద్యా మౌలిక వసతులు: ఆశ్రమ పాఠశాలలు మరియు గురుకులాలలో టాయిలెట్లు మరియు మరమ్మతుల కోసం రూ. 60 కోట్లు మంజూరు చేయబడినవి.
షెడ్యూల్డ్ ట్రైబ్ కంపోనెంట్ (STC):
- 2025-26 సంవత్సరంలో రూ. 8,159.68 కోట్లు కేటాయించబడగా, 28.02.2026 నాటికి రూ. 5,318.76 కోట్లు (66%) వ్యయం చేయబడింది.
- 2026-27 సంవత్సరానికి STC కోసం రూ. 9,189.64 కోట్లు కేటాయించబడినవి.
అడవి హక్కుల చట్టం (RoFR) గుర్తింపు:
- RoFRభూ రికార్డుల డిజిటలైజేషన్ చేయబడింది.
- PM-KISAN – అన్నదాత సుఖీభవ పథకం కింద 14 లక్షల RoFRరైతులు లబ్ధి పొందారు.
- గిరిజన సంక్షేమ శాఖ (TWD) మరియు SERP కలిసి ISB-BIPPతో త్రైపాక్షిక అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకున్నాయి. ఈ సహకారం ద్వారా గిరిజన మహిళల ఆధ్వర్యంలో MFP/SFPలపై ఆధారపడి సమృద్ధిగా మరియు స్థిరమైన అటవీ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడం, అలాగే CFR/CFRR క్లెయిమ్ ప్రక్రియలకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రస్తుత భూవినియోగ విశ్లేషణ:
- IFR భూముల ప్రస్తుత వినియోగ విధానాన్ని విశ్లేషించబడింది.
- 1,20,782 ఎకరాలలో వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
- కాఫీ మరియు మిరియాల తోటలు సహా 2,86,155 ఎకరాలలో హార్టికల్చర్ సాగు జరుగుతోంది.
- ఇతర తోటల సాగు కింద 40,000 ఎకరాలు ఉన్నాయి.
- సాగుకు అనుకూలం కాని 2,043 ఎకరాలలో గ్రీన్ కవర్ అభివృద్ధి ప్రతిపాదించబడింది.
రాజ్యాంగ పరిరక్షణల అమలు:
పేసా గ్రామ సభల ఎన్నికలు:
- సెప్టెంబర్ 2019 నుండి పెండింగ్‌లో ఉన్న షెడ్యూల్డ్ ప్రాంతాలలోని 2,038 పేసా గ్రామ సభల ఎన్నికలను నిర్వహించేందుకు చర్యలు ప్రారంభించబడినవి.అందులో 1,954 గ్రామ సభల ఎన్నికలు పూర్తయ్యాయి; మిగిలిన 84 గ్రామ సభల ఎన్నికలు కొనసాగుతున్నాయి.
గిరిజన భూ హక్కుల రక్షణ:
- ప్రస్తుత ప్రభుత్వ కాలంలో 288 ఎకరాలకు సంబంధించిన 108 LTR కేసులు గుర్తించబడగా, 229 ఎకరాలకు సంబంధించిన 83 కేసులు పరిష్కరించబడినవి. ASR జిల్లాలో గిరిజనులు మరియు ప్రభుత్వానికి అనుకూలంగా 2,623 ఎకరాలకు సంబంధించిన 307 LTR ఆదేశాలు అమలు చేయబడినవి.
- మొత్తం 30,556 LTR కేసులలో 17,222 కేసులకు సంబంధించిన సమాచారాన్ని LTR వెబ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయబడింది.
ఆంధ్రప్రదేశ్ ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ (APTAC):
- ప్రభుత్వం O.Ms.No.9, గిరిజన సంక్షేమ (LTR) శాఖ, తేది 21.05.2025 ద్వారా ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ (APTAC)ను పునర్‌వ్యవస్థీకరించింది.
- TAC సభ్యులతో సమావేశం 02.2026న నిర్వహించబడింది.
ఆది కర్మయోగి అభియాన్
- ఆది కర్మయోగి అభియాన్ కింద, 4 జిల్లాలలోని 6 ITDAల పరిధిలో వివిధ స్థాయిలలో (338) మంది అధికారులకు మరియు 20,000కు పైగా గ్రామ స్థాయి సిబ్బందికి శిక్షణ ఇవ్వబడింది. 2,314 గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించబడగా, సమగ్ర గ్రామ అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేసి, రూ. 11,480 కోట్ల వ్యయంతో భారత ప్రభుత్వంలోని MoTAకు పంపించబడినవి.
- ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ “ఉత్తమ ప్రదర్శన చేసిన రాష్ట్రం మరియు జిల్లా”గా పురస్కారాలను అందుకుంది. ఈ పురస్కారాలను భారత రాష్ట్రపతి శ్రీమతి Droupadi Murmu గారి చేతుల మీదుగా, ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి మరియు ASR జిల్లా కలెక్టర్ స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ విజయాలు 2024-26
కీలక పనితీరు సూచికలు (KPIలు):· 98.54% గర్భిణీలు & పాలిచ్చే తల్లులు మరియు 95.62% పిల్లలు అనుబంధ పోషకాహార కార్యక్రమం (Supplementary Nutrition program) కింద లబ్దిపొంది ఉన్నారు. · జూన్ 2024 నుండి జూన్ 2026 వరకు 5 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలలో stunting 20.68% నుండి 8.95% కు, under weight 9.75 % నుండి 4.48% కు, wasting 5.61% నుండి 3.04% కు తగ్గించడం జరిగింది.విజయాలు:I) సాక్షం అంగన్వాడి మరియు poshan 2.0:
- కృత్రిమ మేధస్సు(AI) ద్వార బాల్య ప్రారంభ దశ అభివృద్ధి: కుప్పం నియోజకవర్గంలో ప్రామాణిక పరీక్షా సాధనాలు ద్వారా కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత బాలల అభివృద్ధి స్క్రీనింగ్ కార్యక్రమాన్ని పైలట్ ప్రాతిపదికన అమలు చేసింది. ఈ కార్యక్రమం కింద 17,827 మంది చిన్నారులను పరీక్షించగా, వారిలో సుమారు 25% మందిలో అభివృద్ధి జాప్యాలు గుర్తించబడ్డాయి. వారికి సమగ్ర ఎదుగుదల మరియు అభివృద్ధి కోసం ప్రారంభ దశలోనే అవసరమైన సహాయక చర్యలు (Early Intervention Support) అందించబడ్డాయి. RTIH-ECD ఇన్నోవేషన్ ఛాలెంజ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే చర్యలు చేపట్టబడుతున్నాము.
· పరిపూర్ణ అంగన్‌వాడీ కేంద్రాలు (Upgradation of Anganwadi centers): పరిపూర్ణ అంగన్‌వాడీలో భాగంగా రూ.99.58 కోట్ల రూపాయలతో 9,958 అంగన్‌వాడీ కేంద్రాలలో పోషణ్ వాటికలు, వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు, LED టీవీ, ROలు మరియు ఇతర మౌలిక సదుపాయాలు (ఉదా. పెయింటింగ్‌లు, చిన్న మరమ్మతులు, ఆట పరికరాలు) ఏర్పాటు చేయడమైనది. 2025-26న కు 7,377 అంగన్వాడి కేంద్రాలకు ప్రతిపాదనలు పంపిఉన్నాము.· ఇండక్షన్ స్టవ్‌లు: ఇండక్షన్ స్టవ్‌తో పాటు ఇండక్షన్ ఆధారిత పాత్రలు (ప్రెషర్ కుక్కర్, మూతతో కూడిన బాణలి మరియు మూతతో కూడిన పాత్ర) 11,400 అంగన్వాడి కేంద్రాలకు మొదటి దశలో సరఫరా చేయబడ్డాయి. దీని కోసం రూ.8.54 కోట్లు చెల్లిoచి ఉన్నాము. రెండవ దశలో రూ.32.35 కోట్ల తో 44346 అంగన్వాడి కేంద్రాలకు పంపిణి జరుగుతున్నది.· స్మార్ట్ ఫోన్లు: Real Time Governance లో భాగంగా రూ.72 కోట్లు రూపాయలతో 58,204 స్మార్ట్ ఫోన్లు అంగన్వాడి కార్యకర్తలకు, సూపర్‌వైజర్లులకు మరియు బ్లాక్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లకు సరఫరా చేయడమైనది.· మినీ అంగన్వాడి కేంద్రాలను మెయిన్ అంగన్వాడి కేంద్రాలగా అప్‌గ్రేడ్ చేయడం: 4,687 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వo రూ.64.67 కోట్లు అదనంగా ఖర్చు చేయడం జరుగుతుంది.· PMJANMAN: మారుమూల గిరిజన ప్రాంతాలలోని మహిళల మరియు పిల్లల పోషకాహారం, పిల్లలకు పూర్వా ప్రాధమిక విద్యను అందించాలనే లక్ష్యంతో 192 కొత్త అంగన్వాడి కేద్రాలు మంజూరు చేయబడ్డాయి. 170 భవనాలకు ఒక్కొక్కదానికి రూ.12.00 లక్షలు చొప్పున రూ.20.40 కోట్లు విడుదల చేయబడినవి మరియు మొదటి దశలో 156 అంగన్వాడి కేంద్రాలలో భవన నిర్మాణ పనులు జరుగుచున్నవి. · మౌలిక సదుపాయాలు: 13916 మరుగుదొడ్లు మరియు 15521 తాగునీటి కనెక్షన్లు/సౌకర్యాల నిర్మాణం కోసం రూ.64.34 కోట్లు విడుదల చేయబడ్డాయి. నేటి వరకు 9209 మరుగుదొడ్లు మరియు 12131 తాగునీటి కనెక్షన్లు/ సౌకర్యాల నిర్మాణం పనులు పూర్తి అయనవి. మిగతా పనులు జరుగుచున్నవి.· పోషన్ భీ పడాయి భీ: అంగన్‌వాడీ కార్యకర్తల సామర్థ్యాలను మెరుగుపరచడానికి 54,408 మందికి పోషన్ భీ మరియు పడాయి భీ కార్యక్రమం కింద శిక్షణలు అందించి ఉన్నాము. దీని కోసం రూ.8.50 కోట్లు వినియోగిoచి ఉన్నాము. రూ.4.76 కోట్ల విలువైన వర్క్ పుస్తకాలు, యాక్టివిటీ పుస్తకాలు, ఆధార్‌శిల మరియు నవచేతన పుస్తకాలు 55,746 అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేయడమైనది. దీని ద్వారా అంగన్వాడి ప్రీ స్కూల్ హాజరు 76.98% నుండి 88% పెరిగింది.· రిమోట్ లెర్నింగ్ సందేశాలు (RLMలు): ప్రీస్కూల్ కార్యకలాపాలను సమర్థవంతంగా అమలు చేయడానికి మద్దతుగా అంగన్‌వాడీ కార్యకర్తలు మరియు తల్లుల సమూహాలతో రోజువారీ ప్రీస్కూల్ సందేశాలను watsup group ద్వారా పంచుకుంటున్నారు.· ECCE దినోత్సవం: ప్రీ-స్కూల్ పిల్లల తల్లిదండ్రులతో పిల్లల అభివృద్ధి పురోగతిని చర్చించడానికి ప్రతి నెల 4వ శనివారం ECCE దినోత్సవం నిర్వహించపడుచున్నది.· 8వ రాష్ట్రీయ పోషణ్ మాసo: సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 16, 2025 వరకు నెల రోజుల పాటు జరిగిన ఈ ప్రచారంలో మొత్తం 55,746 కేంద్రాలలో 15,10,911 కార్యకలాపాలు మరియు 71,13,794 మంది లబ్ధిదారులకు అవగాహన కార్యకలాపాలు నిర్వహించబడ్డాయి. · పొషణ్ పక్వాడ: ఏప్రిల్ 9 నుండి ఏప్రిల్ 23, 2026 వరకు 15 రోజుల పాటు జరిగిన ఈ ప్రచారంలో మొత్తం 55,746 కేంద్రాలలో 38,30,770 కార్యకలాపాలు మరియు 9,01,23,778 మంది లబ్ధిదారులకు అవగాహన కార్యకలాపాలు నిర్వహించబడ్డాయి. · కమ్యూనిటీ ఆధారిత కార్యక్రమాలు: సమాజంలో తల్లులు మరియు కుటుంబ సభ్యుల ఆరోగ్యం మరియు పోషకాహారంపై 32,92,749 అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఇందులో 1,83,25,856 మంది పాల్గొన్నారు.అంగన్వాడీ కార్యకర్తలు మరియు సహాయకుల సంక్షేమం· గ్రాట్యుటీ: అంగన్వాడీ కార్యకర్తలు (ప్రధాన & మినీ) & అంగన్వాడీ సహాయకులకు గ్రాట్యుటీ చెల్లింపు కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని కోసం రూ.19.70 కోట్లు నగదు ను జిల్లాలకు విడుదల చేయడమైనది.· అంత్యక్రియలు/దహన సంస్కార ఛార్జీలు: అంగన్‌వాడీ వర్కర్లు (AWWలు) / అంగన్‌వాడీ సహాయకులు (AWHలు) కు అంత్యక్రియలు/దహన సంస్కార ఛార్జీల కింద ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.15,000/- మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని కోసం రూ.0.45కోట్లు నగదు ను జిల్లాలకు విడుదల చేయడమైనది. II) మిషన్ వాత్సల్య – ప్రతి బిడ్డకు ఆరోగ్యకరమైన & సంతోషకరమైన బాల్యాన్ని అందించడానికి మిషన్ వాత్సల్య అమలు చేయబడుచున్నది.• చైల్డ్ కేర్ సంస్థలు: 0 నుండి 18 సంవత్సరాల వయస్సు గల 2,988 మంది బాలురు మరియు బాలికలకు సంరక్షణ, భద్రత, విద్య మరియు భావోద్వేగ మద్దతును అందించేదుకు 90 చైల్డ్ కేర్ సంస్థల ద్వారా పునరావాసం కల్పిస్తున్నారు.• బాలల గృహాల పునరుద్ధరణ: బాలల గృహాల పునరుద్ధరణ కొరకు రూ.1.58 కోట్లు విడుదల చేయడమైనది.• స్పాన్సర్‌షిప్ కార్యక్రమం: నాన్-ఇన్స్టిట్యూషనల్ కేర్ లో భాగంగా 28,374 మంది పిల్లలకు ఒక్కొక్కరికి రూ.4000 చొప్పున (స్పాన్సర్‌షిప్) రూ.89.41కోట్లు ఆర్ధిక సహాయం చేయడం జరిగింది. • దత్తత: 183 మంది పిల్లలను ప్రేమగల కుటుంబాలకు దత్తత ఇవ్వడమైనది.• ప్రత్యేక రెస్క్యూ డ్రైవ్‌లు: 704 ప్రత్యేక రెస్క్యూ డ్రైవ్‌ల ద్వారా 1289 మంది పిల్లలను బాల కార్మికులు, భిక్షాటన మరియు వీధి పరిస్థితుల నుండి రక్షించి సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చడమైనది.•బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్: డిసెంబర్ 5, 2025న బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం రాష్ట్రవ్యాప్త ప్రచారం నిర్వహించబడింది. దీనిలో 4.24 లక్షలకు పైగా ప్రజలు ప్రతిజ్ఞలో పాల్గొన్నారు. 14767 కార్యక్రమాల ద్వారా 26 లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్థానిక సంస్థ సభ్యులు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు, నేటి వరకు 3373 బాల్యవివాహాలను విజయవంతంగా నిరోధించారు.•కిషోరి వికాసం: 11 నుండి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో సాధికారత కల్పించడానికి, 5,21,961 బాలికల కొరకు ప్రత్యక వేసవి సెలవల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించ బడ్డాయి. పాఠశాల మరియు జూనియర్ కళాశాలలోని 28,83,297 కిశోరి బాల బాలికలు యువ(బాలురు) మరియు సఖి (బాలికలు) 7,725 సమూహాలు గా ఏర్పడినవి.III) మిషన్ శక్తి– రాష్ట్రంలో మహిళలు మరియు కౌమారదశ బాలికల శ్రేయస్సు, పోషణ, భద్రత మరియు రక్షణ కోసం వివిధ ప్రధాన కార్యక్రమాలను అమలు చేయబడుచున్నవి. రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ప్రదేశాలలో 1,044 తల్లిపాల అందించే మరియు శిశు సంరక్షణ గదులు ఏర్పాటు చేయబడ్డాయి.•PMMVY: తల్లి మరియు పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకొని గర్భిణీ మరియు పాలిచ్చే మహిళలకు కోసం ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకం ద్వారా మొదటి ప్రసవానికి రూ.5000 మరియు రెండవ ప్రసవానికి (ఆడ శిశువు)కి రూ.6000 ఇవ్వడం జరుగుతుంది, ఇప్పటివరకు 1,05,393 మంది లబ్ధిదారులకు ఆర్దిక సహాయం అందించడం జరిగింది.•వన్ స్టాప్ సెంటర్ (OSC): భారత ప్రభుత్వం 10 అదనపు OSC లను మంజూరు చేసింది. ఆ ప్రతిపాదనలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి కోసo పంపడమైనది. మునుపటి 13 కొత్త జిల్లాల OSC భవనాలకు (ఒక్కొక్కదానికి రూ.60.00 లక్షలు) రూ. 3.77 కోట్లు మొదటి దశలో విడుదల చేయబడినవి. భవన నిర్మాణ పనులు జరుగుచున్నవి. ●బాధితుల పరిహారం: 2118 మంది బాధిత మహిళలకు రూ.15.14 కోట్లు రూపాయలతో పరిహారం కోసం, సహాయ మరియు పునరావాస నిధి నుండి పంపిణీ చేయబడింది. •POSH చట్టం: మొత్తం 28 జిల్లాల్లో 26 స్థానిక కమిటీలు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో 10,231 అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయబడ్డాయి. 84 ఫిర్యాదులలో, 82 కేసులు పరిష్కరించబడ్డాయి మరియు 2 కేసులు ప్రక్రియలో ఉన్నాయి.●సఖి నివాస్ (వర్కింగ్ విమెన్ హాస్టల్): భారత ప్రభుత్వం 30 అదనపు వర్కింగ్ విమెన్ హాస్టల్స్ ను మంజూరు చేసింది, పని చేసే మహిళలు సేవలను సులభంగా పొందేందుకు వీలుగా వెబ్‌సైట్ మరియు యాప్ ప్రారంభించబడింది. రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం పథకం (SASCI) కింద విశాఖపట్నంలో మూడు వర్కింగ్ ఉమెన్ హాస్టళ్ల నిర్మాణానికి గాను రూ.113.52 కోట్లు విడుదల చేయబడ్డాయి.నిర్మాణ పనులు జరుగుచున్నవి.
గురుకులం
ఏ.పి. గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సంఘం (APTWREI Society), అమరావతి
APREI సొసైటీ నుండి విడిపోయి, 1999లో ఏర్పాటైన స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థే APTWREI సొసైటీ (గురుకులం). తగిన స్వయంప్రతిపత్తి మరియు నిర్వహణ సౌలభ్యంతో, గిరిజన (ST) పిల్లలకు గురుకుల విద్యా విధానం ద్వారా నాణ్యమైన విద్యను అందించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. అవసరమైన విద్యా వాతావరణాన్ని కల్పించేందుకు, ప్రభుత్వం (199) గురుకుల విద్యా సంస్థల ద్వారా (73,730) మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ, విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. అలాగే, ప్రతిభావంతులైన గిరిజన విద్యార్థులు IIT, NIT మరియు వైద్య విద్య వంటి ఉన్నత విద్యను అభ్యసించేలా వారికి ప్రత్యేక శిక్షణను కూడా అందిస్తోంది. మారుమూల ప్రాంతాల్లోని గిరిజన విద్యార్థులకు నాణ్యమైన మాధ్యమిక మరియు ఉన్నత స్థాయి విద్యను అందించడంతో పాటు, క్రీడలు మరియు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వడం, స్థానిక కళలు మరియు సంస్కృతిని పరిరక్షించడానికి ప్రత్యేక సదుపాయాలను కల్పించడం వంటి చర్యలను ఈ సంస్థ చేపడుతోంది.
జూన్ 2024 నుండి గురుకులం (APTWREIS) సాధించిన ప్రగతి:
- విద్యా సంస్థల రకాలు:
| క్ర. సం | పాఠశాల రకం | తరగతులు | సంఖ్య |
| 1 | గురుకుల పాఠశాలలు | 5వ నుండి 10వ తరగతి వరకు | 27 |
| 2 | PVTG పాఠశాలలు | 3వ నుండి 10వ తరగతి వరకు | 10 |
| 3 | క్రీడా పాఠశాల | 5వ నుండి 10వ తరగతి వరకు | 01 |
| 4 | అప్‌గ్రేడ్ చేసిన గురుకుల జూనియర్ కళాశాలలు | 5వ నుండి 12వ తరగతి వరకు | 04 |
| 5 | గురుకుల జూనియర్ కళాశాలలు | 11 & 12 తరగతులు | 29 |
| 6 | స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ | 8వ నుండి 12వ తరగతి వరకు | 04 |
| 7 | కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ | 11 & 12 తరగతులు | 03 |
| 8 | హాస్టల్ నుండి గురుకుల పాఠశాలలుగా మార్చబడినవి | 3వ నుండి 10వ తరగతి వరకు | 81 |
| 9 | మినీ గురుకులం | 1వ నుండి 7వ తరగతి వరకు | 12 |
| 10 | ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలలు (EMRS) | 6వ నుండి 12వ తరగతి వరకు (సహ-విద్య) | 28 |
| మొత్తం | 199 |
- విద్యాపరమైన విజయాలు:
| తరగతి | విద్యా సంవత్సరం | పరీక్షలకు హాజరైన వారు | ఉత్తీర్ణులైన వారు | ఉత్తీర్ణత శాతం | గురుకులం సగటు | రాష్ట్ర సగటు |
| ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం | 2024-25 | 4,555 | 3,676 | 80.70% | 80.70% | 70.00% |
| 2025-26 | 4,237 | 3,826 | 90.30% | 90.30% | 77.00% | |
| ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం | 2024-25 | 4,317 | 3,958 | 91.68% | 91.68% | 83.00% |
| 2025-26 | 4,381 | 4,111 | 93.84% | 93.84% | 81.00% | |
| ఎస్‌ఎస్‌సీ (10వ తరగతి) | 2024-25 | 5,065 | 3,766 | 74.33% | 74.33% | 70.00% |
| 2025-26 | 4,833 | 3,851 | 79.68% | 79.68% | 85.25% |
- IIT/JEE, NEET లలో ప్రవేశాలు:
| సంవత్సరం | IIT | NIT | మొత్తం |
| 2024-25 | 1 | 11 | 12 |
| 2025-26 | 29 | 06 | 35 |
| Total | 30 | 17 | 47 |
- IIT-JEE/ NEET శిక్షణా కేంద్రాలు:
- IIT-JEE, NEET, APEAPCET, CLAT మరియు LAWCET పరీక్షలలో మెరుగైన ఫలితాలను సాధించేందుకు, ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర విద్యార్థులకు వేసవి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.
- పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు IIT/NEET కోసం I-WIN మరియు Physicswallahద్వారా, అలాగే CUET కోసం Sarat Chandra Academy ద్వారా ఆన్‌లైన్ శిక్షణ అందించబడుతోంది.
- హైదరాబాద్‌కు చెందిన Jagans JS Academy, GL Puram, Maredumilliమరియు N Kandrigaప్రాంతాల్లోని EMRS విద్యార్థులకు ఆన్‌లైన్ శిక్షణను అందించనుంది.
- IITలు/NITలు మరియు NEETలో ఎక్కువ ప్రవేశాలు పొందేందుకు వీలుగా, 7 SOEలు/COEలు మరియు 19 EMRSలకు ప్రత్యేకంగా రూపొందించిన 350 Physicswallahట్యాబ్‌లు (tabs) అందించబడ్డాయి.
- విద్యార్థులకు ప్రోత్సాహకాలు, అవార్డులు మరియు విద్యార్థులు, సిబ్బందికి సన్మానం:
- ప్రతిష్టాత్మక విద్యాసంస్థలలో ప్రవేశం పొందిన ప్రతి విద్యార్థికి Gurukulam ₹40,000 ప్రోత్సాహకాన్ని అందిస్తుంది.
- విభాగం పేరును ప్రతిష్టాత్మకం చేసిన ప్రతిభావంతులైన విద్యార్థులు మరియు సిబ్బందిని నగదు బహుమతి, జ్ఞాపిక మరియు ప్రశంసాపత్రంతో ప్రతి ఏటా గురుకులంసన్మానిస్తుంది.
- Net Zero Healthy Campus (NZHC):
- Gurukulamపరిధిలోని అన్ని విద్యాసంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ‘Net Zero Healthy Campus’ కార్యక్రమంలో భాగం చేయబడ్డాయి. ఇందుకోసం 126 సంస్థలు ఎంపిక చేయబడ్డాయి మరియు ఇప్పటికే ‘Net Zero’ ఆడిట్ సర్వేను సమర్పించాయి. అన్ని Gurukulamసంస్థలు సోలార్ రూఫ్‌టాప్ ప్యానెల్స్ ఏర్పాటు, అత్యధిక సాంద్రతతో కూడిన మొక్కల పెంపకం, కూరగాయల వ్యర్థాల విచ్ఛిన్నం చేసే వ్యవస్థ (vegetable decomposing structure) మరియు వర్షపు నీటి సంరక్షణ (RWH) పద్ధతులను చేపట్టడం ద్వారా ప్రస్తుత పర్యావరణ వ్యవస్థలో మార్పులు తీసుకువస్తాయి; అలాగే క్యాంపస్‌లలో ఉత్పన్నమయ్యే గ్రే-వాటర్‌ను (greywater) సమర్థవంతంగా నిర్వహించబడుతుంది.
- IVRS సర్వే:
- IVRS సర్వే యొక్క మొత్తం స్కోరులో గణనీయమైన పెరుగుదల నమోదైంది; మార్చి 2026లో స్కోరు 6% ఉండగా, ఏప్రిల్ 2026లో మొత్తం స్కోరు 73.9%కి చేరింది. మొత్తం పనితీరును మెరుగుపరచడానికి సంబంధిత ప్రయత్నాలు జరుగుతున్నాయి.
- ఆరోగ్య పర్యవేక్షణ:
- అనారోగ్యంతో ఉన్న విధ్యార్ధులరోజువారీ ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తున్నారు మరియు ఆ డేటాను ప్రతిరోజూ JNB నివాస్ పోర్టల్ @ హెల్త్ మాడ్యూల్‌లో నమోదు చేస్తున్నారు.
- ప్రతి గురువారం విద్యార్థులందరికీ IFA టాబ్లెట్లను అందిస్తున్నారు.
- భారత ప్రభుత్వ షెడ్యూళ్ల ప్రకారం NDD కార్యక్రమాలను అనుసరిస్తున్నారు.
- స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర (SASA) కార్యకలాపాలు
- SASA కార్యక్రమం కింద, గురుకుల సంస్థలు పరిశుభ్రత, పర్యావరణ అవగాహన మరియు పౌర బాధ్యతను ప్రోత్సహించడానికి నెలవారీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.
- 2025 సంవత్సరంలో, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా గురుకుల సంస్థలలో (717) CSCలు మంజూరు చేయబడ్డాయి. వాటిలో, (1074) మరుగుదొడ్లు, (170) మూత్రశాల బ్లాక్‌లు, (567) స్నానాల గదుల నిర్మాణం చేపట్టడంజరిగింది.
- భద్రత &అవాంఛనీయ సంఘటనల నివారణ
- అన్ని సంస్థలలో నిఘా కెమెరాలు ఏర్పాటు చేయబడ్డాయి.
- కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రధాన కార్యాలయం నుండి కార్యకలాపాలుపరివేక్షించబడుతున్నాయి.
- 24/7 పర్యవేక్షణ కోసం ప్రిన్సిపాల్స్‌కు మొబైల్ యాక్సెస్ ఉంది.
- విధ్యార్ధులయొక్క నిరంతర భద్రత మరియు రక్షణ కోసం, ప్రతి సంస్థకు ముగ్గురు సెక్యూరిటీ గార్డులను సర్వీస్ అవుట్‌సోర్సింగ్ ద్వారా నియమించారు.
- ముస్తాబు కార్యక్రమం-2026.
- విద్యార్థుల శారీరక దృఢత్వం, క్రమశిక్షణ మరియు సంపూర్ణ పరివర్తనను ప్రోత్సహించడానికి APTWREIS ఆధ్వర్యంలోని 199 గిరిజన సంక్షేమ గురుకుల సంస్థలలో ముస్తాబు కార్యక్రమం అమలు చేయబడుతోంది.
- ఈ కార్యక్రమం విద్యార్థులలో వ్యక్తిగత పరిశుభ్రత, క్రమశిక్షణ మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని కూడా ప్రోత్సహిస్తుంది. ఈ కార్యక్రమం విద్యార్థుల సంపూర్ణ వికాసానికి దోహదపడేలా, దీనిని సమర్థవంతంగా అమలు చేయాలని మరియు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని ప్రధానోపాధ్యాయులు మరియు సిబ్బంది అందరికీ సూచించడమైనది.
- మౌలిక సదుపాయాలు:
- మొత్తం 199 సంస్థలలో, 169 సంస్థలకు శాశ్వత భవనాలు ఉన్నాయి, 18 సంస్థలు అద్దె రహిత భవనాలలో మరియు 12 సంస్థలు అద్దె భవనాలలో కొనసాగుతున్నాయి. 6 భవనాల నిర్మాణం జరుగుతోంది.
- అన్ని 199 సంస్థలలో RO ప్లాంట్లు ఏర్పాటు చేయబడ్డాయి.
- 28 EMRS మరియు 46 APTWR సంస్థలలో సోలార్ వాటర్ హీటర్లు ఏర్పాటు చేయబడ్డాయి.
- బాలికల సంస్థలలో బాత్రూమ్‌ల ఏర్పాటు (546 కొత్త బాత్రూమ్‌లు), డార్మిటరీలకు కిటికీ మెష్‌లు (జాలీలు) అమర్చడం మరియు మరమ్మతులు వంటి పనుల కోసం, గురుకులం సంస్థలలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.30.00 కోట్లు కేటాయించింది (O.Rt.No.152, TW (Bud) Dept., తేదీ: 28.10.2025).
- 2024-25 ఆర్థిక సంవత్సరంలో, 18 APTWR సంస్థలలో చిన్నపాటి మరమ్మతులు చేపట్టడానికి DA-JGUA పథకం కింద రూ. 70.44 కోట్లు మంజూరు చేయబడ్డాయి. ఈ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.
- 2025-26, 2026-27 మరియు 2027-28 సంవత్సరాలకు గాను 63 గురుకుల సంస్థలకు, DA-JGUA కింద రూ.24708.00 లక్షల మొత్తాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు, ప్రతిపాదనలు సమర్పించబడ్డాయి.
- 2024-25 మరియు 2025-26 సంవత్సరాలలో విద్యార్థులకు కల్పించిన సదుపాయాలు:
- స్టీల్ ప్లేట్లు &గ్లాసులు
- స్టేషనరీ వస్తువులు
- నోట్ బుక్స్
- ట్రంక్ పెట్టెలు
- క్రీడా పరికరాలు
- పడక సామాగ్రి (Bedding material)
- ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు
- విద్యార్థి కిట్లు (3 జతల యూనిఫాం వస్త్రం, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ సెట్, 1 జత బూట్లు, 2 జతల సాక్సులు, 1 స్కూల్ బ్యాగ్, 1 బెల్ట్)
- 2025-26 విద్యా సంవత్సరం నుండి, కాస్మెటిక్ ఛార్జీలకు సంబంధించిన వస్తువులు గిరిజన సహకార సంస్థ (Girijan Cooperative Corporation) ద్వారా నేరుగా (వస్తు రూపంలో) అందించబడుతున్నాయి.
- స్పోర్ట్స్ స్కూల్‌కు ఆహార రుసుముల పెంపు వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి:
| క్ర.సం. | తరగతులు | రోజుకు ఆహార రుసుము |
| 1 | 8వ తరగతి వరకు | రూ.200/- |
| 2 | 9వ తరగతి మరియు ఆపైన | రూ.250/- |
- విద్యార్థులకు ప్రతిరోజూ మల్టీ మిల్లెట్పీనట్ బార్స్ మరియు గుడ్లు జారీ చేయడం.
- గురుకులం విద్యార్థులందరికీ వారానికి రెండుసార్లు చికెన్ జారీ చేయడం.
- గురుకుల ఉద్యోగుల కోసం తీసుకున్న చర్యలు:
- గురుకుల సంస్థలలో మంజూరైన ఖాళీ పోస్టులకు గాను పనిచేస్తున్న 1,658 మంది అవుట్‌సోర్సింగ్ ఉపాధ్యాయుల సేవలను ప్రభుత్వం పునరుద్ధరించింది. గిరిజన సంక్షేమ (విద్యా) శాఖ, జి.ఓ.ఆర్.టి.నెం.98, తేది 01.07.2025 ద్వారా వారి వేతనంలో 35% పెంపును కూడా ప్రకటించింది.
- గిరిజన విద్యార్థులకు బోధనా వనరులను బలోపేతం చేయడానికి మరియు విద్యా నాణ్యతను మెరుగుపరచడానికి, మెగా డి.ఎస్.సి-2024 ద్వారా గురుకులంలో1,091 ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం నియమించింది.
- గురుకుల పాఠశాలలు మరియు కళాశాలలను బలోపేతం చేయడానికి టి.జి.టి నుండి పి.జి.టి &పి.జి.టి నుండి ప్రిన్సిపాల్ మరియుజూనియర్లెక్చరర్పదోన్నతులు జారీ చేయబడ్డాయి.
- 81 హాస్టల్ కన్వర్టెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (HCRS)లో వంట మరియు హౌస్ కీపింగ్ సేవలను అందించడానికి, సర్వీస్ అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో 324 మంది సిబ్బందిని నియమించుకోవడానికి, సుమారు రూ. 6.67 కోట్ల వ్యయంతో వర్క్ ఆర్డర్ జారీ చేయబడింది.
- NESTS నిధులతో నడుస్తున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్.
- ప్రస్తుతం APTWREI సొసైటీ పర్యవేక్షణలో (28) ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు (EMR Schools) పనిచేస్తున్నాయి; వీటికి న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వానికి చెందిన MoTAపరిధిలోని NESTS ద్వారా 100% నిధులు సమకూర్చబడుతున్నాయి.
- ఈ పాఠశాలలు CBSE సిలబస్‌తో, 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు సహ-విద్య (Co-education) విధానంలో నడుస్తున్నాయి.
- ప్రతి పాఠశాలలో మంజూరైన విద్యార్థుల సంఖ్య 480 (అంటే 240 మంది బాలురు మరియు 240 మంది బాలికలు).
- ఒక్కో విద్యార్థికి (బోర్డర్‌కు) వార్షిక నిర్వహణ వ్యయం రూ.1,47,062/-గా ఉంది.
- 2024 సంవత్సరంలో, NESTS క్రమబద్ధమైన నియామక ప్రక్రియను చేపట్టి, (465) మంది సిబ్బందిని రెగ్యులర్ ప్రాతిపదికన నియమించింది.
- 2025-26 నాటికి, (28) EMR పాఠశాలల్లో (19) పాఠశాలలు 12వ తరగతి స్థాయికి మరియు (9) పాఠశాలలు 10వ తరగతి స్థాయికి చేరుకున్నాయి.
- (19) EMR పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆన్‌లైన్ వెబ్ పోర్టల్ ద్వారా కోచింగ్ మరియు ముద్రిత స్టడీ మెటీరియల్ అందించడం ద్వారా IIT/JEE మరియు NEET పరీక్షలలో ఎక్కువ సీట్లు సాధించేలా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నారు.
- (28) EMR పాఠశాలల్లో, (18) పాఠశాలలకు శాశ్వత భవనాలు ఉన్నాయి మరియు (10) పాఠశాలల భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఒక్కో EMR పాఠశాల భవనానికి రూ.24.00 కోట్ల వ్యయాన్ని NESTS పరిగణనలోకి తీసుకుంది.
- బడ్జెట్:
- 2026-27 ఆర్థిక సంవత్సరంలో గురుకులం కోసం రూ.365.37 కోట్లు కేటాయించబడ్డాయి.
- 2025-26 ఆర్థిక సంవత్సరంలో గురుకులం కోసం రూ.340.00 కోట్లు కేటాయించబడ్డాయి.












































