అమరావతి
రెండేళ్ల పాలనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రొగ్రెస్ రిపోర్ట్
HCM Final ppt Fin 04.08.2026
ఆర్థిక పరిస్థితిపై ప్రొగ్రెస్ రిపోర్ట్‌ను మీడియాకు ప్రజెంట్ చేసిన సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ…
• 2019-24 మధ్య కాలంలో నాటి ప్రభుత్వం ప్రజలను వేధించింది. ఆ ప్రభుత్వం ప్రజలను అణగదొక్కింది.. దీంతో నిశ్శబ్ధ విప్లవం వచ్చింది.
• 57 శాతం ఓట్లు మాకు వచ్చాయి.. 94 శాతం స్ట్రైక్ రేటుతో సీట్లు సాధించాం.
• ఎన్డీఏ కూటమిగా ప్రజల్లోకి వెళ్లాం.. మాసివ్ విక్టరీ సాధించాం.
• ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏడు శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేశాం.
• ఇప్పుడు రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నాం… ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ ప్రొగ్రెస్ రిపోర్ట్ ఇస్తున్నాం.
• ఇరిగేషన్, స్టీల్, ఏఐ, ఐటీ, ఫార్మా వంటి రంగాలను ఉత్తరాంధ్రలో అభివృద్ధి చేస్తున్నాం.
• 2014లో విభజన జరిగింది… ఏపీ వ్యవసాయాధారిత రెవెన్యూ రాష్ట్రంగా ఏర్పడింది.
• రాజధానిని కోల్పోయాం… ఎక్కడ ఉండాలో కూడా తెలియని పరిస్థితి.. బస్సులో బస చేసి పాలన చేపట్టాం.
• విభజన సందర్భంగా వచ్చిన నష్టాన్ని భరించాం… కానీ 2019-24 మధ్యలో విధ్వంసం జరిగింది.
• వ్యవస్థలను నిర్వీర్యం చేశారు… ప్రజలు, అధికారులు, పోలీసులు అంతా భయపడిపోయే పరిస్థితి.
• అన్ని వ్యవస్థలపై దాడి చేశారు.. ఏపీ బ్రాండ్‌ను కూడా దారుణంగా దెబ్బతీశారు.
• ఇతర ప్రాంతాల్లో ఏపీ వాసులంటే చిన్న చూపు చూసే పరిస్థితి వచ్చింది.
• ఏపీలో తమ కంపెనీలను పెట్టమని పారిశ్రామిక వేత్తలు పారిపోయిన పరిస్థితి.
• ఆదాయం రావాలన్నా అభివృద్ధి జరగాలన్నా పెట్టుబడులు రావాలి.
• ఉమ్మడి రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.95,231గా ఉంది.
• విభజన తర్వాత తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,104గా ఉంది… ఏపీ రూ.93,903కు పడిపోయింది.
• రెండు రాష్ట్రాల మధ్య తలసరి ఆదాయంలో రూ.30,201 గ్యాప్ ఏర్పడింది.
• రాజధానిని కోల్పోవడం వల్ల, ఎక్కువ జనాభా, తక్కువ ఆదాయ వనరులతో రాష్ట్రం ఏర్పడడంతో ప్రజల తలసరి ఆదాయం తగ్గిపోయింది.
• ఈ పరిస్థితి నుంచి అభివృద్ధి చేసేందుకు కష్టపడ్డాం.
• ఇలాంటి పరిస్థితులు ఉండగానే 30.5 శాతం మేర సీఏజీఆర్ వృద్ధి జరిగింది… ఇది చారిత్రాత్మకం.
• జీఎస్డీపీ 13.5 శాతంగా ఉంది. అప్పుల జీఎస్డీపీ రేషియో 28.38 శాతంగా ఉంది.
• అభివృద్ధి చేస్తూ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగాం కాబట్టి.. ఏపీ, తెలంగాణల మధ్య ఉన్న రిసోర్స్ గ్యాప్ 10 శాతం నుంచి 8 శాతానికి తీసుకురాగలి 2 శాతం మేర గ్యాప్ తగ్గించాం.
• 2024 ఎన్నికల్లో రాష్ట్రాన్ని పునర్ నిర్మిస్తామని చెప్పాం… బ్రాండ్ ఏపీని తిరిగి వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చాం.
• ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నించాం… వాటిని నెరవేరుస్తున్నాం… ఎవ్వరూ ఊహించని విధంగా చెప్పిన విధంగా.. చెప్పిన తేదీల్లో సంక్షేమాన్ని అమలు చేస్తున్నాం.
• ఆదాయం రావాలంటే అభివృద్ధి రావాలి.. దానికి ప్రాధాన్యత ఇస్తున్నాం.
• సుస్థిరత కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నాం… కొత్త పాలసీలను ప్రవేశపెట్టాం.
• 2014-19 మధ్య కాలంలో జీఎస్డీపీ గ్రోత్ ఏపీ 13.50 శాతంగా ఉంటే.. తెలంగాణలో 13.70 శాతంగా ఉంది.
• 2019-24 మధ్య కాలంలో ఇదే జీఎస్డీపీ గ్రోత్ ఏపీ 10.30 శాతానికి పడిపోయింది… తెలంగాణ 11.40 శాతంగా ఉంది.
• 2024-26 విషయానికొచ్చేసరికి ఏపీ జీఎస్డీపీ గ్రోత్ 11.30 శాతంగా ఉంటే… తెలంగాణ 10.70 శాతంగా ఉంది.
• 2019–24 మధ్య రాష్ట్ర ఆర్థిక వృద్ధి మందగించింది.
• 2014–19లో ఉన్న వృద్ధిరేటును కొనసాగించి ఉంటే ఏపీకి అదనంగా రూ.6.94 లక్షల కోట్ల జీఎస్డీపీ వచ్చేది.
• 13.5 శాతం వృద్ధిరేటు కొనసాగి ఉంటే అదనంగా రూ.76,195 కోట్ల ఆదాయం సమకూరేది.
• రెవెన్యూ పెరిగేది.. అప్పులు చేసే పరిస్థితి తప్పేది.
• తెలంగాణతో తలసరి ఆదాయ అంతరం 2018–19లో రూ.55,817 ఉండగా.. 2023–24 నాటికి రూ.1,06,854కు పెరిగింది.
• 2025–26లో తలసరి ఆదాయం రూ.2,94,507గా ఉంది.
• 2014–19 సగటు వృద్ధిరేటు 13.21 శాతమే కొనసాగి ఉంటే 2025–26లో ఏపీ తలసరి ఆదాయం రూ.3,67,115 ఉండేది.
• ప్రభుత్వం మారినందు వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టమిది.
• ప్రభుత్వం సరిగా ఉంటే ప్రజల జీవితాలు మారుతాయి. సరైన నాయకత్వం ఉంటే అందరి జీవితాలు బాగుంటాయి.
• 2014-19 మధ్య కాలంలో అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా నిర్మాణానికి శ్రీకారం చుట్టాం… పట్టిసీమ ఎత్తిపోతల పథకం పూర్తి చేశాం.
• పోలవరం పనులు 72 శాతం వరకు పూర్తయ్యాయి… నాలుగు విమానాశ్రయాల విస్తరణ.. మరో రెండు కొత్త విమానాశ్రయాల పనులు ప్రారంభించాం.
• మూడు పోర్టు పనులకు శ్రీకారం చుట్టాం… రహదారి నెట్‌వర్క్‌లో 4,387 కి.మీ. విస్తరణ… కియా, ఏషియన్ పెయింట్స్, ఇసుజు, ఫాక్స్‌కాన్ వంటి భారీ పెట్టుబడులను ఆకర్షించాం.
• విశాఖ–చెన్నై, చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్ల పనులు ప్రారంభించాం.
• 2019–24 మధ్యన అమరావతి పనులు నిలిచిపోయాయి.. పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతింది.
• విద్యుత్ రంగంలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల రద్దుతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు.. రూ.32 వేల కోట్లు భారం వేశారు. రూ.1.30 లక్షల కోట్లకు అప్పును పెంచారు.
• విద్యుత్‌ను వినియోగించుకోకుండా రూ.9 వేల కోట్లు చెల్లింపులు జరిపారు.
• ఆదాయం రావాలన్నా అభివృద్ధి జరగాలన్నా పెట్టుబడులు రావాలి.
• ఉమ్మడి రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.95,231గా ఉంది.
• విభజన తర్వాత తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,104గా ఉంది… ఏపీ రూ.93,903కు పడిపోయింది.
• రెండు రాష్ట్రాల మధ్య తలసరి ఆదాయంలో రూ.30,201 గ్యాప్ ఏర్పడింది.
• రాజధానిని కోల్పోవడం వల్ల, ఎక్కువ జనాభా, తక్కువ ఆదాయ వనరులతో రాష్ట్రం ఏర్పడడంతో ప్రజల తలసరి ఆదాయం తగ్గిపోయింది.
• ఈ పరిస్థితి నుంచి అభివృద్ధి చేసేందుకు కష్టపడ్డాం.
• జీఎస్డీపీ 13.5 శాతంగా ఉంది. అప్పుల జీఎస్డీపీ రేషియో 28.38 శాతంగా ఉంది.
• అభివృద్ధి చేస్తూ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగాం కాబట్టి.. ఏపీ, తెలంగాణల మధ్య ఉన్న రిసోర్స్ గ్యాప్ 10 శాతం నుంచి 8 శాతానికి తీసుకురాగలి 2 శాతం మేర గ్యాప్ తగ్గించాం.
• 2024 ఎన్నికల్లో రాష్ట్రాన్ని పునర్ నిర్మిస్తామని చెప్పాం… బ్రాండ్ ఏపీని తిరిగి వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చాం.
• ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నించాం… వాటిని నెరవేరుస్తున్నాం… ఎవ్వరూ ఊహించని విధంగా చెప్పిన విధంగా.. చెప్పిన తేదీల్లో సంక్షేమాన్ని అమలు చేస్తున్నాం.
• ఆదాయం రావాలంటే అభివృద్ధి రావాలి.. దానికి ప్రాధాన్యత ఇస్తున్నాం.
• సుస్థిరత కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నాం… కొత్త పాలసీలను ప్రవేశపెట్టాం.
• చెప్పినవన్నీ ఇచ్చాం.. కొన్నింటి విషయాల్లో చెప్పిన వాటికంటే ఎక్కువే చేశాం.
• పేద-ధనికుల మధ్య ఆర్థిక అసమానతలు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నాం.
• ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సాధికారత కోసం ప్రయత్నిస్తున్నాం… వారికి చక్కటి విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
• బడుగుల పిల్లల కోసం ఐఐటీ, నీట్, యూపీపీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ చేస్తున్నాం.
• గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భారీ SHG నెట్‌వర్క్ ఏర్పాటు చేశాం.
• 2026–27లో 5 లక్షల మహిళా పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దే లక్ష్యంగా పని చేస్తున్నాం… దీని కోసం రూ.2,246 కోట్ల మేర క్రెడిట్ సపోర్ట్ అందిస్తున్నాం.
• బ్యాంకుల ద్వారా డ్వాక్రా మహిళలు రూ.43,219 కోట్ల రుణాలను పొందగలుగుతున్నారు.
• డ్వాక్రా ఉత్పత్తుల కోసం స్వయం బ్రాండ్ ఏర్పాటు చేశాం.
• పీపీపీ ద్వారా చాలా అభివృద్ధి జరుగుతుంది.. ప్రజలకు చాలా మేలు జరిగింది.
• పీపీపీ ద్వారా జరిగిన అభివృద్ధిని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
• మూలధన వ్యయానికి ఎక్కువగా ఖర్చు పెడుతున్నాం.
• 2019-24 మధ్యనున్న ప్రభుత్వంతో పోల్చుకుంటే.. ఒకటిన్నర రెట్లు ఎక్కువగా మూలధన వ్యయం కింద ఖర్చు పెడుతున్నాం.
• రాష్ట్రాన్ని విషవలయం నుంచి డెవలప్మెంట్ సైకిల్ వైపు తీసుకెళ్తున్నాం.
• దీని కోసం ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీలు తెచ్చాం.
• గత రెండేళ్ల కాలంలో అమరావతి కోసం రూ.10 వేల కోట్లు, పోలవరానికి రూ.8,300 కోట్లు, పోర్టులకు రూ.5437 కోట్లు, జల్ జీవన్ మిషన్‌కు రూ.1,142 కోట్లు, ఎయిర్ పోర్టులకు రూ.2,302 కోట్లు, రోడ్ నెట్ వర్క్ కోసం రూ.3,439 కోట్లు ఖర్చు పెట్టాం.
• ఇవి కాకుండా జాతీయ రహదారుల కోసం ఇప్పటి వరకు రూ.38,800 కోట్లు, రైల్వేల కోసం రూ.64,417 కోట్లను కేంద్రం రాష్ట్రంలో ఖర్చు పెట్టింది