భారత్ లో గోడీ మీడియా ?
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలవాల్సిన పత్రికలు క్రెడిబిలిటీ కోల్పోయాయి. జర్నలిస్టుల పై దాడులు, కేంద్రీకృతమైన మీడియా యాజమాన్యం, వారి రాజకీయ అమరికలతో ప్రపంచంలోనే అతిపెద్దదైన భారతదేశం ప్రజాస్వామ్యాన్ని సంక్షోభంలో పడవేస్తు్న్నాయి. ‘రిపోర్టర్స్ విత్ అవుట్ బోర్డర్స్’ RSF 2024లో విడుదల చేసిన నివేదికలో 176 దేశాలలో భారత దేశ ర్యాంకు 159. గతేడాది ర్యాంకు 161. ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభం అయిన ప్రెస్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
ప్రెస్ ఫ్రీడంలో 159 వ ర్యాంక్
ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత్ ను మెజార్టీ ప్రజలను సంతృప్తి పరచాలన్న ప్రయత్నాలతో ప్రెస్ ఫ్రీడం లేకుండా పోతుందని ఆ సంస్థ తెలిపింది. కౄరమైన చట్టాలతో దేశం మరింత సంక్షోభంలోకి వెళుతోందన్నారు. రిలయన్స్ ఇండస్ట్రియల్ గ్రూపు అధినేత ముఖేష్ అంబానీ ప్రధాని మోడీకి అత్యంత స్నేహితుడు కావడంతో 70 కి పైగా మీడియా సంస్థలు ఉన్నాయని దీంతో 800 కోట్ల మంది వాటి ప్రసారాలనే నిజమని నమ్ముతున్నారని నివేదిక తెలిపింది. NDTV channel ను ప్రధాని మోడీ మరో స్నేహితుడు గౌతం ఆదాని అక్రమంగా 2022లో స్వాధీనం చేసుకున్నారని, దీంతో జర్నలిజం విలువలు నశించిపోతున్నాయని RSF తెలిపింది.
బీజేపీని ఆకాశానికి ఎత్తుతూ జనరంజక వాదాన్ని గోడీ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఇది వరలోని భిన్నాభిప్రాయాల మీడియా వేదికలు కనుమరుగయ్యాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహిగాను.. రాజకీయ నాయకులను ప్రశ్నిస్తే.. ప్రభుత్వ వ్యతిరేకిగా చిత్రీకరిస్తున్నారని RSF తెలిపింది. ప్రభుత్వాన్ని విమర్శించినా.. లేదా ప్రశ్నించినా విపరీతమైన ట్రోలింగ్ కు గురవుతున్నారని నివేదిక వెల్లడించింది.
ప్రపంచ వ్యాప్తంగా రాజకీయపార్టీలు, ప్రభుత్వాలు వారి బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం లేదని అదే సమయంలో జర్నలిజానికి అనువైన వాతావరణం కాని ప్రజలకు నమ్మకమైన స్వతంత్ర , విభిన్న వార్తలను లేదా సమాచారాన్ని అందించడంలో ఫెయిల్ అవుతున్నారని RSF వెల్లడించింది. భారత్ పొరుగు దేశాలైన పాకిస్తాన్ 152, శ్రీలంక 15, నేపాల్ 74, మాల్థీవులు 106 ర్యాంకుల్లో ఉన్నాయి. ఆఫ్ఘనీస్తాన్ 178, బంగ్లాదేవ్ 165, మయన్మార్ 171 ర్యాంకుల్లో నిలిచాయి.