రంపచోడవరం
రంపచోడవరం చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
• రంపచోడవరం చేరుకున్న సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు.
• రంపచోడవరంలోని ప్రభుత్వ హైస్కూల్ – జూనియర్ కాలేజీ ప్రాంగణానికి చేరుకున్న సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్, తల్లికి వందనం పథకం లబ్దిదారులు.
• సరస్వతి దేవి, అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు పూలమాలవేసిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్.
• తల్లికి వందనం లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహిస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్.
• తల్లికి వందనం నిధులు జమ అయ్యాయా అంటూ లబ్దిదారులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి.
• తమకు పథకం నిధులు జమ అయ్యాయంటూ తమ ఫోన్లకు వచ్చిన మెసేజీలను సీఎం చంద్రబాబుకు చూపిన తల్లులు.
• తల్లికి వందనం పథకం నిధులతో తమ పిల్లలకు చక్కటి విద్యను అందించగలుగుతున్నామని తెలిపిన లబ్దిదారులు.
• ఎంత మంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం నిధులను జమ చేయడం ఎంతో సంతోషాన్నిస్తోందన్న తల్లులు.
• వరుసగా రెండో ఏడాది నిధులు జమ చేశారంటూ తమ ఆనందాన్ని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌తో పంచుకున్న లబ్దిదారులు.
• తల్లికి వందనం నిధులను సద్వినియోగం చేసుకోవాలని లబ్దిదారులకు సూచించిన ముఖ్యమంత్రి.
• ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందిస్తున్నామని… ఇందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించిన మంత్రి నారా లోకేష్.






















































M