జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ …
అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ జూలై 31న రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు డిమాండ్స్ డే పాటించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్ర ప్రదేశ్ బ్రాడ్ కాస్ట్
జర్నలిస్టు అసోసియేషన్లు సంయుక్తంగా పిలుపునిచ్చాయి.
మార్చి 4న విజయవాడలో జరిగిన జర్నలిస్టు ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఇచ్చిన హామీల నేపథ్యంలో కొన్ని సమస్యలు పరిష్కారమైనప్పటికీ ప్రధానమైన సమస్యలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి.
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య, సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్, జర్నలిస్టులకు కార్మిక భీమా సదుపాయం, వర్కింగ్ జర్నలిస్ట్ సంక్షేమ నిధి ఏర్పాటు, జర్నలిస్టుల సంక్షేమ నిధి కమిటీ, జర్నలిస్టులపై దాడుల నివారణకు హైపవర్ కమిటీతోపాటు జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటు, సి ఆర్ మీడియా అకాడమీ గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు, కొత్త జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో తదనుగుణంగా జిల్లాల్లో సమాచార శాఖను బలోపేతం చేసి జర్నలిస్టులకు ప్రచురణార్థం ప్రసార నిమిత్తం , అవసరమైన సదుపాయాల కల్పన, జర్నలిస్టుల స్థితిగతుల అధ్యయనం కోసం మీడియా కమిషన్ ఏర్పాటు, ప్రభుత్వ సారధ్యంలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక పునరుద్ధరణ, వృద్ధాప్యంలోని జర్నలిస్టులకు వృద్ధాశ్రమ నిర్మాణం తదితర సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలలో, జిల్లా కేంద్రాలలో జర్నలిస్టుల డిమాండ్స్ డే నిర్వహించేందుకు సంసిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా శాఖలకు పిలుపు ఇచ్చింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్రంలోని ప్రింట్, బ్రాడ్ కాస్ట్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులందరూ కలిసి రావాలని కోరుతున్నాం.
ఎస్ వెంకట్రావు, జి ఆంజనేయులు ఏపీడబ్ల్యూజేఎఫ్
అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి

















































