అమరావతి ప్రస్ధానంలో శ్రామిక శక్తికి సెల్యూట్
- ప్రజారాజధాని అమరావతి ప్రగతి ప్రస్థానంలో కార్మికులదే కీలక పాత్ర.
- అమరావతి నిర్మాణంలో అలుపెరగక శ్రమిస్తున్న ప్రతి కార్మికుడికి సెల్యూట్
అమరావతి:
అమరావతిలో 27వేల మంది కార్మికులతోను 5140 యంత్రాలతో పనులు హై స్పీడ్ లో పరుగులు. పెడుతున్నాయి. అమరావతి నిర్మాణం ఊపందుకుంది. అక్కడ మూడు షిప్టుల్లో కార్మికులు పనిచేస్తున్నారు. మొత్తం 27వేల మంది అమరావతి నిర్మాణ పనులు కార్మికుల శ్రమ,వారి దీక్ష, వారి ఏకాగ్రతతో శరవేగంగా సాగుతున్నాయి. .
ప్రస్తుతం రూ. 57,821 కోట్ల విలువైన భారీ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో రూ. 50,943 కోట్ల విలువైన పనులు ఇప్పటికే గ్రౌండ్ అయ్యాయి. ఇవన్నీ ప్రభుత్వ పనులే
ప్రభుత్వ నిర్మాణాలతోపాటు ప్రైవేటు కంపెనీలు కూడా వాటికి కేటాయించిన స్థలాల్లో ప్రారంభిస్తున్నాయి. .. రెండు, మూడేళ్లలో విజుబుల్ డెవలప్‌మెంట్ ను అమరావతిలో ప్రజల ముందు ఉంచాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పించారు. ఆ దిశగా శ్రామికులు రేయింబవళ్ళు అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆలోచనలకనుగుణంగా కార్మికులు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్మిస్తున్నారు. వజ్రం లాంటి ఐకానిక్ టవర్ల నిర్మాణంలో కార్మికశక్తి తమ అనుభవాన్ని రంగరిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపు ఐదు దశాబ్దాల రాజకీయ అనుభవంతో దేశంలోనే అత్యంత అనుభవజ్ఞులైన నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. పాలనలో తీసుకునే నిర్ణయాలు, దీర్ఘకాలిక ప్రణాళికలు, సంక్షోభాలను అవకాశాలుగా మలచే తీరుతో ఆయన ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేకుండా మిగిలిన ఆంధ్రప్రదేశ్‌కు ఒక ఆధునిక నగరాన్ని నిర్మించాలనే లక్ష్యంతో అమరావతి (Amaravati) ప్రాజెక్టును ప్రారంభించారు.
2014 నుంచి 2019 మధ్య కాలంలో రాజధాని నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలు, డిజైన్లు, అనుమతుల ప్రక్రియలకు ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చింది. అదే సమయంలో రాజకీయ పరిణామాలు కూడా వేగంగా మారడంతో ప్రభుత్వం అనుకున్న వేగంతో పనులు ముందుకు తీసుకెళ్లలేకపోయింది. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితులను సమీక్షించిన చంద్రబాబు, ఎక్కడ లోపాలు జరిగాయో గుర్తించి కొత్త వ్యూహంతో ముందుకు సాగారు.
2024లో తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే పాలనతో పాటు రాజధాని నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజుల నుంచే అమరావతి పనులను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
. వివిధ సంస్థల ద్వారా నిధులు సమీకరించి తొలి దశ నిర్మాణానికి భారీ మొత్తాన్ని అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వానికి పెద్ద విజయంగా చెప్పాలి. ఈ నిధులతో ప్రధాన ప్రభుత్వ భవనాలు, రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగంగా జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పూర్వ వైభవం కనిపిస్తోంది. ఐదేళ్లుగా నిర్మాణ ప్రాంతాల్లో నెలకొన్న నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ.. ఇప్పుడు ఎక్కడ చూసినా కార్మికుల సందడి, యంత్రాల హోరు వినిపిస్తోంది. కార్మికులతో అమరావతి ప్రాంతం సందడిగా కనిపిస్తున్నది.కార్మికుల కష్టంతోనే అమరావతి పనులు అత్యంత వేగంగా కొనసాగుతున్నాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పనులకు మళ్లీ మోక్షం లభించింది. ప్రస్తుతం వివిధ నిర్మాణాల్లో 27వేల మంది కార్మికులు నిమగ్నమై ఉండి అహరం శ్రమిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు కార్యరూపం తీసుకువస్తున్నారు.
అమరావతి రాజధాని నిర్మాణకార్మికులకు భద్రత
అమరావతి రాజధాని నిర్మాణ పనుల్లో ఉన్నకార్మికులకు తగిన భద్రత ఇవ్వడంతోపాటు, ఆరోగ్యం వారి సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్ధతోపాటు అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి.ఈ సంస్ధలతోపాటు రాష్ట్ర కార్మిక శాఖ కూడ వారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నది.లేబర్ క్యాంపుల పరిసర ప్రాంతాలలో క్రమం తప్పకుండా ఫాగింగ్, స్ప్రేయింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
తాగునీరు, విద్యుత్ సౌకర్యం, మెరుగైన భోజనం అందించాలని కాంట్రాక్టు సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు.
కార్మికుల వైద్య అవసరాల కోసం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను (PHC) ఆసుపత్రులుగా అప్‌గ్రేడ్ చేసి వైద్యులు, అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచారు.
వేసవి కాలంలో అగ్నిప్రమాదాల నివారణకు క్యాంపు సైట్లలో హై-కెపాసిటీ వాటర్ మోటార్లు, నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేశారు.
నిర్మాణ రంగంలో ‘లాస్ట్ టైమ్ ఇంజరీ (LTI)’ లేని సురక్షితమైన పనిగంటలను నమోదు చేసేలా కార్మికులకు ముందస్తు భద్రతా శిక్షణ ఇచ్చారు. లేబర్ క్యాంపుల వద్ద సీసీటీవీ (CCTV) నిఘా ఏర్పాటు చేయడంతో పాటు, కార్మికులకు రక్షణ కల్పించడానికి పోలీసు శాఖతో సమన్వయం చేస్తున్నారు.
రాజధాని పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందితే పెట్టుబడులు పెరగడంతో పాటు భూముల విలువ కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉందా. భవిష్యత్తులో ప్రభుత్వానికి అదనపు ఆదాయ వనరులు ఏర్పడటంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా విస్తరించే అవకాశం ఉంది. రాజధాని అమరావతికి తలమానికమైన ఐకానిక్ టవర్ల నిర్మాణాలు చకచక సాగుతున్నాయి.దేశంలోనే తొలిసారిగా డయాగ్రిడ్ టెక్నాలజీతో ఈభవనాల నిర్మాణంలో కార్మికులు శక్తి వంచన లేకుండా పని చేస్తున్నారు.వారందరికి కార్మికశాఖ పక్షాన సెల్యూట్ . అమరావతిని రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ప్రధాన కేంద్రంగా మార్చాలన్న లక్ష్యంతో చంద్రబాబు ముందుకు సాగుతుండగా, ఈ ప్రాజెక్టు విజయమే ఆయన రాజకీయ జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది.
- వాసంశెట్టి సుభాష్ కార్మికశాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

















































