అమరావతి-శాసనసభ.
జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.
యల్లసిరి కెనాల్ పనులు, ఏలేరు జలాశయం పరిధిలోని ఆయకట్టుకు నీటి సరఫరాపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన మంత్రి నిమ్మల రామానాయుడు.
ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు సమస్యలను పరిష్కరించడానికి సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ల సూచనల మేరకు అధికారులు, స్దానిక ఎమ్మెల్యేలతో కలసి క్షేత్రస్దాయిలో పరిశీలించాను.
పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోపు ఏలేరు ఆయకట్టుకు నీరివ్వాలనే లక్ష్యంతో నాడు చంద్రబాబు పురుషోత్తమపట్నం లిఫ్ట్ స్కీం ను నిర్మించారు.
సూపర్ ఎల్ నినో వంటి క్లిష్టపరిస్దితుల్లో కూడా 53 వేల ఎకరాల పుష్కర ఆయకట్టు, 1.48 లక్షల ఎకరాల పుష్కర ఆయకట్టుకు సాగు, తాగు నీరందిస్తున్నామంటే చంద్రబాబు ముందు చూపు వల్లే సాధ్యమైంది.
గత ప్రభుత్వం ఉత్తరాంధ్రకు సాగు, తాగు నీరందించే పోలవరం ఎడమ కాలువ పనుల్లో తట్టమట్టి పని కూడా చేయలేదు.
కూటమి ప్రభుత్వం 2ఏళ్ళలోనే 1800 కోట్లు ఖర్చు చేసి, అత్యంత క్లిష్టమైన పంపా,తాండవ,ఏలేరు నదులతో పాటు,11 హైవే క్రాసింగ్ వంతెనల పనులు పూర్తి చేశాం.
పురుషోత్తమపట్నం లిఫ్ట్ తో పాటు, పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేయడం వల్లనే ఏలేరు ఆయకట్టుకుకు సాగు, తాగు నీరిస్తున్నాం.
ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు సాగునీటి అవసరాల కోసం 950 క్యూసెక్కులను పంపిణీ చేస్తున్నాం.
ఏలేరు ఆయకట్టుకు ఇప్పటి వరకు 2.6 టిఎంసిల నీటిని పంపిణీ చేశాం.
5ఏళ్ళ వైసిపి పార్టీ పాలనలో ఏలేరు నదీ గర్బంలో అక్రమ ఇసుక తవ్వకాల వల్ల, బెడ్ లెవల్ పడిపోవడంతో గ్రావిటీ ద్వారా నీరివ్వలేని పరిస్దితి.
గత ప్రభుత్వంలో ఏలేరు ఆయకట్టుకు ఓఅండ్ఎం పనులకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు.
నేడు కూటమి ప్రభుత్వం రెండేళ్ళలోనే ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో 548 పనులకు గానూ, 25 కోట్లు ఇచ్చాం.
ఎల్‌నినో వంటి క్లిష్ట పరిస్దితుల్లో సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ల సూచనల మేరకు ఓఅండ్‌ఎం పనులకు మరో 15.84 కోట్లతో ప్రతిపాదనలు పంపాం.






















































