*దేవుడి సొమ్ము దేవుడికే.. సనాతన ధర్మ రక్షణే లక్ష్యం*
*మేనిఫెస్టోలోని 11 హామీల్లో కేవలం రెండేళ్లలోనే 10 అమలు చేసి చూపించాం*
*వేద పండితుల వేతనం ₹15 వేలకు పెంపు.. చిన్న ఆలయాల ధూపదీప నైవేద్యాలకు 10 వేలు*
*ఆలయాల భద్రత, ఆస్తుల రక్షణకు డీజీపీ, కలెక్టర్లతో కూడిన హైపవర్ కమిటీలు*
*గత ప్రభుత్వ ‘22-A’ భూ అక్రమాలపై ప్రక్షాళన.. బాధితులైన రైతులకు విచారణ అనంతరం ఎన్ఓసీ ల జారీ*
*2027 జూన్ 26 నుండి గోదావరి పుష్కరాలు*
*మార్చి నాటికే 71.60 కోట్లతో 162 ఆలయాల పునర్నిర్మాణ పనులు పూర్తి*
*మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి*
AP – సచివాలయం*:
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే దేవాదాయ ధర్మాదాయ శాఖను సంపూర్ణంగా ప్రక్షాళన చేసి, ఏపీని నూతన ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. గత వైసిపి ప్రభుత్వ ఐదేళ్ల అస్తవ్యస్త పాలనలో ఒక్క విభాగానికి కూడా అధిపతి లేకుండా దేవాదాయ శాఖను నిర్వీర్యం చేశారని, లడ్డూ ప్రసాదం కల్తీ, రామతీర్థం, అంతర్వేది రథం దహనం వంటి అపచారాల చీకటి రోజుల నుంచి ఆలయాలను విముక్తం చేసి, భక్తులలో నమ్మకాన్ని, విశ్వాసాన్ని నూటికి నూరు శాతం పెంపొందించామని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి మీడియా సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి… శాఖాపరమైన రెండేళ్ల సుపరిపాలన ప్రగతి, కోట్ల విలువైన ఆలయ భూముల సంరక్షణ, ఉద్యోగాల భర్తీ, మరియు 2027 ప్రతిష్టాత్మక గోదావరి పుష్కరాల రోడ్ మ్యాప్‌తో కూడిన సమగ్ర నివేదికను విడుదల చేశారు.
తన నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో దేవాలయాల సంక్షేమానికి ఏ రాజకీయ పార్టీ కూడా ప్రత్యేకంగా ఎన్నికల ప్రణాళికను రూపొందించిన దాఖలాలు తాను చూడలేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గుర్తుచేశారు. కానీ నేటి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలోనే దేవాదాయ శాఖకు ప్రత్యేక స్థానం కల్పించి, 11 ధార్మిక హామీలను ఇచ్చిందని, అందులో 10 హామీలను జీవోలతో సహా వంద శాతం అమలు చేసి చెప్పిన మాట నెరవేర్చుకున్నామని ఆయన ప్రకటించారు.
*చిన్న ఆలయాలకు.. వేద పండితులకు పెద్దపీట*
రూ. 50 వేల కంటే తక్కువ ఆదాయం ఉన్న చిన్న ఆలయాల ధూపదీప నైవేద్యాల నిధులు రూ. 10,000 కు పెంచుతామన్న హామీ మేరకు.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 6,137 ఆలయాల అర్చకుల బ్యాంక్ ఖాతాల్లో ప్రతి నెలా నేరుగా నగదు జమ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే, ఎంతో నియమ నిష్ఠలతో వేద, సంస్కృత విద్యను అభ్యసించిన పండితుల గౌరవ వేతనాన్ని రూ. 10,000 నుండి ఏకంగా రూ. 15,000 కు పెంచామని, దీనివల్ల ప్రస్తుతం 188 మంది వేద పండితులకు తక్షణ లబ్ధి చేకూరుతోందని స్పష్టం చేశారు. వేద చదివిన యువతకు ఆలయాల్లో ఉపాధి కల్పించి, సనాతన సంప్రదాయాలను రెగ్యులరైజ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.
*ఆలయాల రక్షణకు డీజీపీ, ఎస్పీలతో హైపవర్ కమిటీలు*
దేవాలయాల భద్రతకు ఆస్తుల రక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి ఆనం తెలిపారు. రాష్ట్ర స్థాయిలో డీజీపీ, ల్యాండ్ అండ్ ఆర్డర్ ఐజీ, ఎండోమెంట్ కమిషనర్ నేతృత్వంలో.. అలాగే జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన, జిల్లా ఎస్పీ, ఎండోమెంట్ అధికారులతో కూడిన ప్రత్యేక సమన్వయ కమిటీలను నియమించామన్నారు. ఆలయాల రక్షణలో పోలీసు శాఖ నిరంతర పర్యవేక్షణ, రక్షణ ఉండేలా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ఆలయ ఉత్సవాలు, పూజా కైంకర్యాలు, వైదిక ఆగమ క్రతువుల నిర్ణయంలో అధికారుల ప్రమేయాన్ని రద్దు చేస్తూ, కేవలం వైదిక సిబ్బందికే సర్వాధికారాలు కల్పించామని తెలిపారు.
*గత ప్రభుత్వ ’22-ఏ’ భూ అక్రమాలపై ప్రక్షాళన*
రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలో 21,672 ఆలయాలు నోటిఫై అయి ఉన్నాయని, వీటికి సంబంధించి 4.48 లక్షల ఎకరాల భూములు ఆస్తులుగా ఉన్నాయని మంత్రి తెలిపారు. గత వైసిపి ప్రభుత్వం రాజకీయ కక్షలతో సామాన్య రైతులను భయభ్రాంతులకు గురిచేస్తూ… వారి వంశపారంపర్య సొంత పట్టా భూములను సైతం అక్రమంగా 22-ఏ కింద దేవాదాయ రికార్డుల్లో చేర్చిందని మండిపడ్డారు. ఇవాళ రైతులు తమ పట్టాలు పట్టుకుని వస్తున్నారని, మావి కాని భూములను పరిశీలించి, జిల్లా రెన్యూ అధికారుల నివేదిక ఆధారంగా కమిషనర్ స్థాయిలో విచారణ జరిపి, బాధితులకు ఎన్ఓసీలు ఇచ్చి రికార్డుల్లో పేర్లు మార్చేందుకు ఈ ప్రభుత్వం చట్టబద్ధమైన ఏర్పాట్లు చేసిందని రైతులకు మంత్రి భరోసా ఇచ్చారు.
*2027 జూన్ 26 నుండి గోదావరి పుష్కరాలు*
రాబోయే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా, పవిత్రంగా నిర్వహించడానికి దేవాదాయ శాఖ సర్వం సిద్ధం చేస్తోందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. ఆగమ పండితులు, టీటీడీ వేద పండితులు దేవాదాయ శాఖ పెద్దలందరూ కలిసి 2027 జూన్ 26వ తారీఖున ప్రారంభమై జూలై 7 వరకు 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు నిర్వహించడానికి సుముహూర్తాన్ని నిర్ణయించారని, దీనికి సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేసిందని తెలిపారు. పుష్కరాల పర్యవేక్షణకు 12 మంది మంత్రులతో కూడిన హైపవర్ సబ్ కమిటీని, స్పెషల్ ఆఫీసర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి వీరపాండ్యన్ ని నియమించామన్నారు.
*మార్చి నాటికే 162 ఆలయాల నిర్మాణం పూర్తి*
గోదావరి పరివాహక ప్రాంతాల్లోని 162 ఆలయాల పునర్నిర్మాణానికి రూ. 71.60 కోట్ల రూపాయలతో ఇప్పటికే టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించామని మంత్రి తెలిపారు. ఏ పరిస్థితుల్లోనైనా 2027 మార్చి నాటికే ఈ ఆలయాల పునర్నిర్మాణ పనులన్నీ వంద శాతం పూర్తి కావాలని అధికారులకు డెడ్‌లైన్ విధించామన్నారు. జూలై మొదటి వారం నుంచి తానే స్వయంగా 6 జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు శానిటేషన్ గ్రాఫిక్ మేనేజ్‌మెంట్‌తో, ‘గ్రీన్ పుష్కరాలు’ కాన్సెప్ట్‌తో ఘాట్ల నిర్మాణం జరగనుందని, పీఠాధిపతులందరినీ స్వయంగా ఆహ్వానించి, వారి ఆశీస్సులతో ఈ పుష్కరాలను దిగ్విజయం చేస్తామని వివరించారు.
*బ్రాహ్మణ కార్పొరేషన్ విలీనం – 342 పోస్టుల భర్తీ*
గత వైసిపి పాలనలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ను దేవాదాయ శాఖ నుంచి విడదీసి, బీసీ ఎకనామిక్ కార్పొరేషన్‌లో కలపడం అనే ఘోర తప్పిదాన్ని కూటమి ప్రభుత్వం సరిదిద్దిందని మంత్రి ఆనం తెలిపారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ను తిరిగి దేవాదాయ శాఖలోనే విలీనం చేస్తూ జీవో ఎంఎస్ 63 ను జారీ చేశామన్నారు. చైర్మన్‌గా బుచ్చి రామప్రసాద్ ఆధ్వర్యంలో బ్రాహ్మణ సంక్షేమ కార్యక్రమాలు వేగవంతం చేశామన్నారు. దేవాదాయ శాఖలో సుదీర్ఘకాలంగా ఉన్న ప్రమోషన్ల ప్రక్రియను పూర్తి చేసి, ఖాళీగా ఉన్న 342 పోస్టుల భర్తీకి పారదర్శక నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు.
*తిరుమలలో ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ విప్లవం*
దేవాదాయ శాఖ పరిధిలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రవేశపెట్టిన వినూత్న సంస్కరణలను మంత్రి ఆనం వివరించారు. క్యూ లైన్ల మేనేజ్మెంట్, భక్తుల రద్దీ, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, పారిశుధ్య పర్యవేక్షణ కోసం టీటీడీలో ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టంను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ మెరుగైన నిర్వహణ వల్ల గడిచిన మే 2026 మాసంలో రికార్డు స్థాయిలో ఏకంగా 25 లక్షల 46 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని, ఇది టీటీడీ చరిత్రలోనే ఆల్ టైం రికార్డు అని పేర్కొన్నారు. టీటీడీ అర్చకులు, పరిచారకులు, పోటు వర్కర్లు మరియు ప్రసాద పంపిణీ సిబ్బంది వేతనాలను గణనీయంగా పెంచామని, నిరుద్యోగ వేద పారాయణదారులకు నెలవారీ రూ. 3,000 గౌరవ సంభావన అందిస్తున్నామని తెలిపారు.
*ఆదాయం – భక్తుల రద్దీ భారీ వృద్ధి*
కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రక్షాళన చర్యల వల్ల నేడు రాష్ట్రంలోని ప్రధాన 22 ఆలయాల వార్షిక ఆదాయం రూ. 182 కోట్ల రూపాయల నుండి ఏకంగా రూ. 239 కోట్ల రూపాయలకు పెరిగిందని మంత్రి వెల్లడించారు. ఈ ఆలయాలను ప్రస్తుతం సంవత్సరానికి 2 కోట్ల 70 లక్షల మంది భక్తులు దర్శించుకుంటున్నారు. విజయవాడ దసరా భక్తుల సంఖ్య 15.90 లక్షలకు, శ్రీశైలం శివరాత్రి భక్తుల సంఖ్య రికార్డు స్థాయిలో 6 లక్షల 50 వేల మందికి చేరిందన్నారు. 13 ప్రముఖ ఆలయాల ఉత్సవాలను అధికారికంగా ‘రాష్ట్ర పండుగలు’ గా గుర్తిస్తూ, దేవాదాయ శాఖ నుండి ఒక్కో ఆలయానికి గరిష్టంగా రూ. 50 లక్షల రూపాయల వరకు ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు మంత్రి ఆనం తెలిపారు.
*సామాజిక, సాంస్కృతిక కేంద్రాలుగా ఆలయాలు*
ఉగాది 2026 నాడు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో దళిత, గిరిజన, పేద, బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు చెందిన దాదాపు 50 వేల మంది బిడ్డలకు ఉచితంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని మంత్రి తెలిపారు. గుండలకమ్మ ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాల్లో రెండు అంచెల్లో పూర్తిస్థాయిలో మొక్కలు నాటి, పర్యావరణహిత హరితహారాన్ని ఏర్పాటు చేశామన్నారు. రాబోయే జూలై, ఆగస్టు మాసాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఏరువాక పౌర్ణమి, యోగా, ధ్యాన కార్యక్రమాలను ఆలయాల్లో ఘనంగా నిర్వహించేందుకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని, ఆలయాలను సామాజిక చైతన్య కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి హరి జవహర్ లాల్, కమిషనర్ రామచంద్ర మోహన్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రామప్రసాద్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అమరావతి
తేది :22-06-2026
➖ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర సచివాలయంలోని ఐదవ బ్లాకులో దేవాదాయ శాఖ గత రెండేళ్లలో సాధించిన విజయాలు,చేపట్టిన సంస్కరణలు, భవిష్యత్ కార్యాచరణ పై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, దేవాదాయ శాఖ శాఖ సలహాదారుడు , హిందూ ధర్మ ప్రచార ట్రస్ట్ చైర్మన్, దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, దేవాదాయ శాఖ కమిషనర్, సీతా డైరెక్టర్ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ల తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ మీడియా సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ :
➖ గతంలో దెబ్బతిన్న హిందూ భక్తుల విశ్వాసాన్ని పునరుద్ధరించి, దేవాదాయ శాఖలో ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి కూటమి ప్రభుత్వం నాంది పలికింది: మంత్రి ఆనం
➖ రాష్ట్రంలోని 6,137 దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకాన్ని రెట్టింపు చేసి, వార్షిక వ్యయాన్ని రూ.35 కోట్ల నుంచి రూ.73 కోట్లకు పెంచాం : మంత్రి ఆనం
➖ నిర్లక్ష్యానికి గురైన 692 పురాతన ఆలయాల అభివృద్ధికి రూ.813 కోట్ల సర్వశ్రేయోనిధి నిధులు మంజూరు చేసి చరిత్ర సృష్టించాం : మంత్రి ఆనం
➖ టీటీడీ సహకారంతో రూ.750 కోట్ల వ్యయంతో 5,000 శ్రీవాణి భజన మందిరాల లక్ష్యం – ఇప్పటికే 1,270 భజన మందిరాలకు అనుమతులు, రూ.267 కోట్ల కేటాయింపు : మంత్రి ఆనం
➖ దేవాలయాలను కేవలం పూజా స్థలాలుగా కాకుండా హిందూ సమాజ ఆత్మగౌరవ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నాం : మంత్రి ఆనం
➖ Temple Management System (TMS), “మన మిత్ర” వాట్సాప్ సేవలతో దేవాలయ పరిపాలనలో డిజిటల్ విప్లవం తీసుకొచ్చాం : మంత్రి ఆనం
➖ జనవరి 2026లో 840 లావాదేవీలతో ప్రారంభమైన “మన మిత్ర” సేవలు మే 2026 నాటికి 1.93 లక్షల లావాదేవీలు నమోదు చేసి కొత్త రికార్డు సృష్టించాయి: మంత్రి ఆనం
➖ రాష్ట్రంలోని 22,672 దేవాలయాలకు చెందిన 4.48 లక్షల ఎకరాల ఆస్తుల రక్షణకు బ్లాక్‌చెయిన్ ఆధారిత డిజిటలైజేషన్ ప్రారంభించాం : మంత్రి ఆనం
➖ 970 దేవాలయాలకు ట్రస్ట్ బోర్డులు ఏర్పాటు చేసి, పారదర్శకత జవాబుదారితనాన్ని పెంచాము… అలాగే ప్రతి బోర్డులో బ్రాహ్మణుడు – నాయీబ్రాహ్మణుడికి ప్రాతినిధ్యం కల్పించాం : మంత్రి ఆనం
➖ 111 దేవాలయాల్లో అన్నప్రసాద వితరణ చేస్తూ ఏటా 3 కోట్ల మంది భక్తులకు ఉచిత అన్నదానం అందిస్తున్నాం : మంత్రి ఆనం
➖ గత రెండేళ్లలో రాష్ట్ర ప్రధాన ఆలయాల భక్తుల సందర్శన 70 శాతం పెరిగి, దేవాలయాలపై ప్రజల విశ్వాసం మరింత బలపడింది: మంత్రి ఆనం
➖ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో 22 ప్రధాన దేవాలయాలకు మాస్టర్ ప్లాన్లు రూపొందిస్తూ ఆధ్యాత్మిక మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నాం: మంత్రి ఆనం
➖ బ్రాహ్మణ కార్పొరేషన్‌ను దేవాదాయ శాఖలో విలీనం చేసి వేద పరిరక్షణ, అర్చక సంక్షేమం, బ్రాహ్మణ సంక్షేమ కార్యక్రమాలకు కొత్త దిశ చూపాం: మంత్రి ఆనం
➖ 2027 గోదావరి పుష్కరాలను మహాకుంభమేళా స్థాయిలో నిర్వహించేందుకు రూ.71.60 కోట్లతో తొలి దశలో 162 పనులు ప్రారంభించాం: మంత్రి ఆనం
➖ టీటీడీలో రెండేళ్లలో పారదర్శక పాలన, ఏఐ ఆధారిత కమాండ్ కంట్రోల్ సెంటర్, రికార్డు స్థాయి భక్తుల దర్శనాలు, సనాతన ధర్మ ప్రచారంతో తిరుమల వైభవాన్ని మరింత పెంచాం : మంత్రి ఆనం
➖ విధ్వంసం నుంచి వికాసం వైపు… విశ్వాస పునరుద్ధరణ నుంచి ధర్మ పరిరక్షణ వరకు… ఆంధ్రప్రదేశ్‌ను దేశానికి ఆధ్యాత్మిక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నాం : మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.
============================================
22-06-2026
తిరుమల సమాచారం
టీటీడీలో రెండేళ్ల ఆధ్యాత్మిక పునరుజ్జీవనం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తిరుమలలో ప్రక్షాళన – భక్తుల విశ్వాసానికి కొత్త బలం చేకూరింది
- కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో సమగ్ర ప్రక్షాళన కార్యక్రమం ప్రారంభమైంది. సనాతన ధర్మ పరిరక్షణ, భక్తులకు మెరుగైన సేవలు, పారదర్శక పరిపాలన, సాంకేతిక ఆధునికీకరణ లక్ష్యాలతో టీటీడీ అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది.
- గత రెండేళ్లలో సనాతన ధర్మ ప్రచారాన్ని మరింత విస్తృతం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా 5 వేల ఆలయాల నిర్మాణ కార్యక్రమాన్ని టీటీడీ చేపట్టింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార ప్రాంతాల్లో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది. “సనాతన ధర్మం ప్రతి ఇంటికి – ప్రతి గ్రామానికి” అనే లక్ష్యంతో భక్తి, సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలను గ్రామీణ స్థాయికి తీసుకెళ్తోంది.
- టీటీడీ అనుబంధ ఆలయాలలో పనిచేస్తున్న అర్చకులు, పరిచారకులు, పోటు వర్కర్లు, ప్రసాద పంపిణీ సిబ్బందికి గణనీయంగా వేతనాలు పెంచి వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చింది. వేద పరిరక్షణలో భాగంగా నిరుద్యోగ వేద పారాయణదారులకు భృతిని అందించేందుకు ప్రత్యేక నిధులు మంజూరు చేసింది.
- పురాతన ఆలయ నిర్మాణాలు, వారసత్వ సంపద పరిరక్షణ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి తిరుమలలోని చారిత్రక కట్టడాల సంరక్షణకు చర్యలు చేపట్టింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా చిన్న దేవాలయాల పునరుద్ధరణకు ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
- దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం చేపట్టాలనే మహత్తర సంకల్పంతో టీటీడీ ముందుకు సాగుతోంది. ఇందుకోసం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం కొనసాగుతోంది.
- భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ 2025 సెప్టెంబర్‌లో ఏఐ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించింది. భక్తుల రద్దీ, క్యూలైన్లు, ట్రాఫిక్, భద్రత, పరిశుభ్రత, వైద్య సేవలపై ఒకే వేదిక నుంచి పర్యవేక్షణ జరుగుతోంది.
- భక్తుల విశ్వాసానికి ప్రతీకగా 2026 మే నెలలో రికార్డు స్థాయిలో 46 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. గత రెండు సంవత్సరాలతో పోలిస్తే ఇది అత్యధిక సంఖ్య. అలాగే మే-2026లో 1.21 కోట్ల శ్రీవారి లడ్డూలు విక్రయమై కొత్త రికార్డు నమోదైంది.
- “నల్ల బంగారం”గా పేరుగాంచిన తలనీలాల సమర్పణలో కూడా టీటీడీ కొత్త రికార్డులు సృష్టించింది. 2026 మే నెలలోనే 43 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించడం శ్రీవారిపై భక్తుల అచంచల విశ్వాసానికి నిదర్శనం. మే 18 నుంచి 23 వరకు వరుసగా ఆరు రోజులపాటు రోజుకు 50 వేలకుపైగా భక్తులు తలనీలాలు సమర్పించడం విశేషం.
- భక్తులకు ఉచిత అన్నప్రసాద సేవలను మరింత విస్తృతం చేస్తూ రోజుకు సుమారు 3 లక్షల సర్వింగ్స్ అందిస్తోంది. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు నాణ్యమైన భోజనం, తాగునీరు అందించేందుకు అత్యాధునిక ఫుడ్ అనాలసిస్ ల్యాబ్‌ను కూడా ఏర్పాటు చేసింది.
- హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో అక్షర గోవిందం, హరికథా వైభవం, భగవద్గీత బోధన, సద్గమయ, భజే శ్రీనివాసం, వననిధి, గిరి జనార్దనం, సన్మార్గం వంటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ సనాతన ధర్మాన్ని భావితరాలకు చేరవేస్తోంది.
- టీటీడీ విద్యా సంస్థల అభివృద్ధికి రూ.40 కోట్ల నిధులు కేటాయించగా, ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం హెల్త్ ఇన్సూరెన్స్ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది.
- గత రెండేళ్లలో టీటీడీ చేపట్టిన ఈ సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు, సనాతన ధర్మ పరిరక్షణ చర్యలు తిరుమలను ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా మరింత బలోపేతం చేశాయి. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, టీటీడీ పాలకమండలి, అధికారులు, సిబ్బంది సమిష్టి కృషితో భక్తుల విశ్వాసం మరింత బలపడింది.
“శ్రీవారి సేవ – భక్తుల విశ్వాసం –
సనాతన ధర్మ పరిరక్షణ” అనే త్రిసూత్రంతో టీటీడీ ముందుకు సాగుతోం