తేది:20.07.2026
రాజస్థాన్(జైపూర్)/అమరావతి
జైపూర్‌లో రెండవ రోజు కొనసాగుతున్న పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ పర్యటన
- టూరిజం గైడ్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ నరేంద్ర సింగ్ రాథోర్ తో మంత్రి దుర్గేష్ కీలక భేటీ
- టూరిజం గైడ్స్ ఫెడరేషన్ సహకారంతో ఏపీ యువతకు టూర్ గైడ్స్ గా ట్రైనింగ్
- కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో పర్యాటక రంగంలోని 20 కీలక విభాగాలలో 10వేల మంది యువతకు శిక్షణ అందించాలన్న అంశంపై మంత్రి దుర్గేష్ ప్రత్యేక దృష్టి
- ఏపీకి రావాల్సిందిగా టూరిజం గైడ్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్‌కు మంత్రి కందుల దుర్గేష్ అధికారిక ఆహ్వానం
- స్థానిక యువతను శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి కల్పించేందుకు త్వరలోనే ఏపీకి రానున్న టూరిజం గైడ్స్ ఫెడరేషన్ ప్రతినిధులు
- త్వరలోనే ఏపీలోని పర్యాటక ప్రాంతాల్లో ఏఐ డిజిటల్ గైడ్స్‌తో పాటు ప్రొఫెషనల్ టూర్ గైడ్స్ అందుబాటులోకి వస్తారన్న మంత్రి దుర్గేష్
- సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల ఆధ్వర్యంలో రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పనే కూటమి ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత: మంత్రి కందుల దుర్గేష్













































