విక్రమ్-1 (VIKRAM-1) ద్వారా ‘విశ్వ-ఎం’ (VISWA-M) పేలోడ్ విజయవంతంగా ప్రయోగించబడిన తర్వాత, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం వద్ద విఐటి-ఏపి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డా|| పి. అరుళ్‌మొళివర్మన్.
Dr. P. Arulmozhivarman Vice Chancellor VIT AP university at Satish Dhavan space center sriharikota after successful launch of VISWA-M payload launch through VIKRAM 1
Date :18-07-2026
అమరావతి:
శ్రీహరికోట నుండి విక్రమ్-1 రాకెట్ ద్వారా విఐటి-ఎపి విశ్వవిద్యాలయ విద్యార్థులు రూపొందించిన ‘విశ్వ-ఎమ్’ (VISWA-M) పేలోడ్ ప్రయోగం విజయవంతం
విఐటి-ఎపి విశ్వవిద్యాలయం అంతరిక్ష పరిశోధన రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. విద్యార్థులు, అధ్యాపకులు అత్యంత ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసి, అభివృద్ధి చేసిన ప్రయోగాత్మక అంతరిక్ష పేలోడ్ ‘విశ్వ-ఎమ్’ (VISWA-M – VIT Satellite Wavelength Analysis Module) విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (SDSC) నుండి, స్కైరూట్ ఏరోస్పేస్‌కు చెందిన ‘విక్రమ్-1’ (Vikram-1) ఆర్బిటల్ లాంచ్ వెహికల్ ద్వారా, ‘సోలారాస్’ (SOLARAS) నానోశాటిలైట్‌లో భాగంగా ఈ పేలోడ్‌ను 18 జూలై 2026 మధ్యాహ్నం 12:05 గంటలకు అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించారు. విశ్వవిద్యాలయ ప్రయాణంలో స్పేస్ టెక్నాలజీ పరిశోధన, ఆవిష్కరణల దిశగా ఇదొక చారిత్రాత్మక మైలురాయి.
బెంగళూరుకు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్ స్టార్టప్ ‘గ్రహా స్పేస్’ (అక్షత్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్) తో 2023లో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం (MoU) ప్రకారం ఈ పేలోడ్ రూపుదిద్దుకుంది. గ్రహా స్పేస్ చేపట్టిన ‘మిషన్ సిద్ధి’ (Mission SIDDHI) లో భాగంగా సాగిన ఈ ప్రయోగం, విఐటి-ఎపి విశ్వవిద్యాలయం అంతరిక్షంలోకి పంపిన మొట్టమొదటి పేలోడ్. వాణిజ్యపరంగా అందుబాటులో ఉండే (COTS) విడిభాగాలు మరియు సెన్సింగ్ సిస్టమ్‌లను ఉపయోగించి, వివిధ వేవ్‌లెంగ్త్‌లలో సూర్యుడి వర్ణపటాన్ని (Solar Spectrum) అధ్యయనం చేయడానికి ఈ కాంపాక్ట్ మాడ్యూల్‌ను రూపొందించారు.
ముఖ్య లక్ష్యాలు:
వివిధ వేవ్‌లెంగ్త్ బ్యాండ్‌లలో సౌర వికిరణాన్ని (Solar Radiation) కొలవడం మరియు విశ్లేషించడం.
విద్యాసంస్థల ఉపగ్రహ మిషన్ల కోసం తక్కువ ఖర్చుతో కూడిన ‘హోస్టెడ్ పేలోడ్ ఆర్కిటెక్చర్’ను ప్రదర్శించడం.
భవిష్యత్ అంతరిక్ష పరిశోధనల కోసం పునాది వంటి డేటాసెట్‌లను సృష్టించడం.
విద్యార్థులకు డిజైన్, ఇంటిగ్రేషన్ నుండి టెస్టింగ్ మరియు మిషన్ ఆపరేషన్స్ వరకు పూర్తి స్థాయి అంతరిక్ష ప్రాజెక్ట్ అనుభవాన్ని అందించడం.
ఈ సందర్బంగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డా|| పి. అరుల్మొళివర్మన్ మాట్లాడుతూ విశ్వ-ఎమ్ విజయం మా విశ్వవిద్యాలయానికి గర్వకారణం. ఇది మా విద్యార్థుల ప్రతిభకు, అనుభవపూర్వక విద్యా విధానానికి (Experiential Learning) నిదర్శనం. భారతీయ అంతరిక్ష రంగానికి మా వంతు సహకారం అందించడం ఆనందంగా ఉందని తెలియచేసారు.
విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా|| జగదీష్ చంద్ర మాట్లాడుతూ విద్యా నైపుణ్యం, పరిశోధన, పరిశ్రమల సహకారం ఒకచోట చేరితే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో ఈ ప్రాజెక్ట్ నిరూపించింది. దేశ అంతరిక్ష సాంకేతిక వృద్ధిలో యువతను భాగస్వామ్యం చేయడమే మా లక్ష్యమని అన్నారు.
డా|| ఎల్లిసన్ మ్యాథే (డైరెక్టర్, IIEC) & ప్రొఫెసర్ మహేష్ మిరియాల (ఫ్యాకల్టీ గైడ్) మాట్లాడుతూ గ్రహా స్పేస్ తో భాగస్వామ్యం విద్యార్థులకు అద్భుతమైన సాంకేతిక నైపుణ్యాలను, ఆత్మవిశ్వాసాన్ని అందించింది. క్లాస్‌రూమ్‌కు అతీతంగా విద్యార్థులు అంతరిక్ష గమనానికి సంబంధించిన ఎన్నో విషయాలను ప్రాక్టికల్‌గా నేర్చుకున్నారని తెలియచేసారు.
ఈ విజయవంతమైన ప్రయోగంతో, అంతరిక్ష పరిశోధన రంగంలో క్రియాశీలక పేలోడ్‌ను విజయవంతంగా అభివృద్ధి చేసిన అతికొద్ది అంతర్జాతీయ స్థాయి భారతీయ విద్యాసంస్థల జాబితాలో విఐటి-ఏపి విశ్వవిద్యాలయం చేరింది. ఇది ఇండియన్ స్పేస్ పాలసీ 2023 ఆశయాలకు అనుగుణంగా సాగింది














































