80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సిఎస్ సమీక్ష
అమరావతి,జూలై 17, ఆగష్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.రానున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పటిష్ట నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులకు సిఎస్ ఆదేశాలు జారీ చేశారు.రాజధాని ప్రాంతంలోని ప్రస్తుత పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఈసమావేశంలో జిఏడి ముఖ్య కార్యదర్శి జె.శ్యామల రావు, ఎంఏయుడి ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్,ఐజి రాజ కుమారి, డైరెక్టర్ ఐఅండ్పిఆర్ కె.ఎస్. విశ్వనాథన్, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్ లక్ష్మీ పార్థ సారథి,గుంటూరు జిల్లా కలెక్టర్,ఎస్పి ఇతర అధికారులు పాల్గొన్నారు.వర్చువల్ గా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

















































