ఆర్ & బీ శాఖ 2 ఏళ్ల అభివృద్ధి ప్రయాణం
• రహాదారులు మానవ నాగరికతకు చిహ్నాలు.. ప్రగతికి సోపానాలు.. ఒక దేశం లేదా రాష్ట్ర సామాజిక, ఆర్థిక అభివృద్ధికి వెన్నుముకగా రోడ్లు నిలుస్తాయి.. ఆధునిక సమాజంలో పురోగతిని ప్రతిబింబించే కొలమానాలు రవాణా సౌకర్యాలు… ప్రజలకు మెరుగైన, నాణ్యమైన రహదారుల కల్పన ఆయా ప్రభుత్వాల ప్రాథమిక కర్తవ్యం… అయితే గత వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో రోడ్లకు గ్రహాణం పట్టింది.. దీంతో గుంతల – గోతుల రహదారులతో ప్రజలు నరకయాతన అనుభవించారు..
రూ. 861 కోట్లతో మిషన్ పాట్ హోల్ ఫ్రీ కు శ్రీకారం
• తమ కష్టాలకు కూటమి ప్రభుత్వం రాకతోనే పరిష్కారం లభిస్తోందని, నమ్మి ప్రజలు ఆఖండ విజయాన్నందించారు. ప్రజల ఇబ్బందులు, సమస్యలు తెలిసిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన వెనువెంటనే రాష్ట్రంలో రోడ్లపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.. తామొస్తే రోడ్ల స్థితిగతులు పూర్తిగా మారిపోతాయని బలంగా విశ్వాసించే ప్రజలకు తక్షణ ఉపశమనం కల్పించేందుకు.. గుంతల రహిత రహదారులే లక్ష్యంగా రూ. 861 కోట్లతో 20,060 కి.మీ మేర రోడ్ల మరమ్మతుల కోసం 2024 నవంబర్ 1 న మిషన్ పాత్ హోల్ ఫ్రీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి కేవలం 9 నెలల కాలంలో(మార్చి 2025) రహదారులను తీర్చిదిద్దారు..
రూ. 2500 కోట్లతో రహదారుల అభివృద్ధి
• రహదారుల అభివృద్ధి నిరంతర ప్రక్రియనే విషయం గుర్తెరిగిన కూటమి ప్రభుత్వం రెండో ఏడాది సైతం రాష్ట్రాన్ని గుంతల రహితంగా తీర్చిదిద్ది రహదారులను అభివృద్ధి చేసేందుకు రూ. 2500 కోట్ల నిధులు కేటాయించి, 6054 కి.మీ మేర 922 పనులను చేపట్టడం జరిగింది.. ఇందులో రూ. 417.30 కోట్ల వ్యయంతో 1,326 కిలోమీటర్ల మేర 221 పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయి, ఇవి ఆగస్టు 2026 నాటికి పూర్తిచేయనున్నాం..
• మొత్తం నిర్దేశించుకున్న 21,037 కిలోమీటర్లలో, ఇప్పటివరకు దాదాపు 20,967 కి.మీ రహదారులను గుంతలు రహితంగా తీర్చిదిద్దాం.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (GWR)
• బెంగళూరు-కడప-విజయవాడ 6-లేన్ కారిడార్ ప్యాకేజీ-2 నిర్మాణంలో NHAI & రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా జనవరి 2026 న 2 సరికొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డులను సృష్టించాయి..
• రికార్డు 1 : 24 గంటల్లో అత్యంత పొడవైన నిరంతర బిటుమినస్ కాంక్రీట్ రోడ్డు నిర్మాణం – 28.95 లేన్ కిలోమీటర్లు.
• రికార్డు 2 : 24 గంటల్లో అత్యధిక పరిమాణంలో నిరంతర బిటుమినస్ కాంక్రీట్ వేయడం – 10,675 మెట్రిక్ టన్నులు.
టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటుతో సమస్యల పరిష్కారం
• గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా, రాష్ట్రంలోనే తొలిసారి భూసేకరణ, అటవీ అనుమతులు, కోర్టు కేసులు, & శాంతిభద్రతల సమస్యలను పరిష్కరించడానికి గౌరవ R&B శాఖ మంత్రి అధ్యక్షతన ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (T,R&B) మరియు CCLA ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్లు, అటవీ శాఖ మరియు జాతీయ రహదారుల అధికారులతో క్రమం తప్పకుండా (3) సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ.. ఇప్పటివరకు 413 కిలోమీటర్ల పొడవునా, 2640 ఎకరాలకు సంబంధించిన భూసేకరణ సమస్యలను విజయవంతంగా పరిష్కరించగలిగాం..
భవిష్యత్తులో పూర్తి చేయబోయే ప్రాజెక్టులు….
రాష్ట్ర రహదారులు (SH) & ప్రధాన జిల్లా రోడ్లు (MDR):
• రహదారులను మెరుగుపరచడం ద్వారా గుంతల రహితంగా తీర్చిదిద్దడానికి రూ. 2,083.00 కోట్ల వ్యయంతో 4,728 కి.మీ పొడవు గల 701 రోడ్ల అభివృద్ధి పనులను పూర్తి చేయడమే లక్ష్యం.
• అత్యంత దారుణంగా దెబ్బతిన్న(intensive patch works) 4,164 కిలోమీటర్ల రహదారులకు సంబంధించి 862 పనులను రూ. 514.50 కోట్ల వ్యయంతో చేపట్టి, పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము.
• 2026-27 సంవత్సరానికి కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ – 1 (KPI 1) కింద సాధారణ మరమ్మతుల (Ordinary repairs) ద్వారా 22,602 కి.మీ మేర గుంతలు లేని రహదారులను సిద్ధం చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం..
ఈ ఏడాది అమలుకు రూపకల్పన చేసిన ప్రధాన ప్రాజెక్టులు లేదా పథకాలు
ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రహదారుల పునర్నిర్మాణం & అభివృద్ధి కోసం కొన్ని ప్రత్యేక ప్రతిపాదనలు అమలు చేస్తున్నాం.. ఇందులో భాగంగా
• గోదావరి పుష్కరాలకు రూ. 439 కోట్ల అంచనా వ్యయంతో 398 కిలోమీటర్ల మేర 72 అభివృద్ధి పనులను చేపట్టనున్నాము.
• ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని గ్రామాలలో రూ. 926.6 కోట్ల అంచనా వ్యయంతో 444.53 కిలోమీటర్ల మేర 430 సిసి రోడ్లు నిర్మించనున్నాము.
• వివిధ కారణాల వల్ల మధ్యలోనే నిలిచిపోయిన రాష్ట్రంలోని 13 అసంపూర్తి వంతెనల నిర్మాణ పనులను పూర్తి చేయడానికి రూ. 85.68 కోట్లు ఖర్చు చేయనున్నాము.
• ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కాలువ గట్లను ఆనుకుని ఉన్నా, తరచూ పాడైపోయే 165 పనులకు సంబంధించి 540 కిలోమీటర్ల మేర రహదారులను రూ. 757.2 కోట్లతో చేపట్టనున్నాము.
• శిథిలావస్థకు చేరిన & ప్రమాదకరంగా మారిన 124 వంతెనల పునర్నిర్మాణం (Re-construction) కోసం అత్యధికంగా రూ. 1480 కోట్లు ఖర్చు చేయనున్నాము..
పీపీపీ ప్రాజెక్టులు (6)
• కేంద్ర ప్రభుత్వ వైబిలిటీ గ్యాప్ ఫండ్ (VGF) సహాయంతో PPP విధానంలో రాష్ట్రంలో 405 కి.మీ మేర రూ. 2506 కోట్ల అంచనా వ్యయంతో 6 ప్రాజెక్టులు గుర్తించాం. ఈ 6 ప్రాజెక్టులకు సంబంధించిన DPR లు పూర్తయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ‘వైబిలిటీ గ్యాప్ ఫండ్’ (VGF) సూత్రప్రాయ అనుమతి కోసం వీటిని కేంద్రానికి సమర్పిస్తున్నాం.
• ఒంగోలు – బెస్తవారిపేట రోడ్డు ప్రాజెక్టు 109 కిలోమీటర్లు & దీని నిర్మాణ వ్యయం రూ. 648 కోట్లు
• నర్సీపట్నం – తాళ్ళపాలెం రోడ్డు: ఈ ప్రాజెక్ట్ 30 కిలోమీటర్లు & అంచనా వ్యయం రూ. 142 కోట్లు.
• ప్యాపిలి – బనగానపల్లి రోడ్డు : ఈ ప్రాజెక్టు 54 కిలోమీటర్లు కాగా, ప్రాజెక్టు అంచనా వ్యయం 260 కోట్లు
• జమ్మలమడుగు – కొలిమిగుండ్ల రోడ్డు: ఈ ప్రాజెక్టు పొడవు 42 కిలోమీటర్లు & దీని అంచనా వ్యయం రూ. 279 కోట్లు.
• చిలకపాలెం – రాంభద్రాపురం – రాయగడ రోడ్డు : ఈ ప్రాజెక్ట్ పొడవు 130 కిలోమీటర్లు & అంచనా వ్యయం రూ. 918 కోట్లు.
• సోమందేపల్లి – హిందూపూర్ & హిందూపూర్ – తూమకుంట రోడ్డు: ఈ కారిడార్ పొడవు 40 కిలోమీటర్లు కాగా, దీని నిర్మాణ వ్యయం రూ. 260 కోట్లు
ఆర్ & బీ శాఖలో సరికొత్త టెక్నాలజీ…
• ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా రోడ్ల పరిశీలన:
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 807 కిలోమీటర్ల రాష్ట్ర రహదారుల ప్రస్తుత స్థితిని అంచనా వేయడానికి డ్యాష్‌క్యామ్ ఆధారిత సర్వేతో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టారు. 4-లేన్ రోడ్లకు ఇరువైపులా వీడియోలను రికార్డ్ చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విశ్లేషించే బాధ్యతను ‘మెసర్స్ లాన్రిక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థకు అప్పగించారు.
• ఎకో-ఫిక్స్ (Eco-Fix) సాంకేతికతతో గుంతల మరమ్మతులు:
• సరికొత్త, అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భాగంగా కొన్ని చోట్ల పట్టణ ప్రాంత రహదారులపై ఉన్న గుంతలను వేగంగా పూడ్చడానికి, ‘సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’ (CRRI) సాంకేతిక సహకారంతో ఎకో-ఫిక్స్ అనే పర్యావరణ అనుకూల మిశ్రమాన్ని ఉపయోగించి మరమ్మతులు చేయనున్నారు.
• తరచూ దెబ్బతినే రోడ్లపై శాస్త్రీయ పరిశోధన:
ఆంధ్రప్రదేశ్‌లోని 11 జిల్లాల పరిధిలో (ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో) తరచూ పాడైపోయే 436 కిలోమీటర్ల రహదారులకు శాశ్వత, తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాలను సూచించడానికి CRRI ఆధ్వర్యంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ అధ్యయనం ప్రస్తుతం క్షేత్రస్థాయిలో కొనసాగుతోంది.
• ఐఐటీ తిరుపతి ఆధ్వర్యంలో నానో-కాంక్రీట్ రోడ్లు:
తిరుపతి డివిజన్‌లో 2 పైలట్ ప్రాజెక్టుల కోసం ఐఐటీ తిరుపతి మరియు ‘కార్బన్‌లైట్ సొల్యూషన్స్’ అనే స్టార్టప్ సంస్థలతో R&B శాఖ చేతులు కలిపింది. ఐఐటీ తిరుపతి అభివృద్ధి చేసిన నానో-మాడిఫైడ్ ఫైబర్- రీ ఇన్‌ఫోర్స్డ్ హై-పెర్ఫార్మెన్స్ కాంక్రీట్ సాంకేతికత ద్వారా తక్కువ ఖర్చుతో, ఎక్కువ కాలం మన్నే రహదారులను నిర్మించి వాటి పనితీరును పరిశీలిస్తారు.
• ఫ్లై యాష్ (Fly Ash) వినియోగం – SRM యూనివర్సిటీ MoU:
రోడ్ల నిర్మాణం మరియు నిర్వహణలో థర్మల్ ప్లాంట్ల వ్యర్థమైన ‘ఫ్లై యాష్’ను ఉపయోగించేందుకు SRM యూనివర్సిటీతో ఒప్పందం కుదిరింది. దీని ద్వారా (i) డ్యూరబుల్ కోల్డ్ మిక్స్ తారు, (ii) ఫ్లై యాష్ గ్రౌండ్ గ్రాన్యులేటెడ్ బ్లాస్ట్ ఫర్నెస్ స్లాగ్ (GGBS) కాంక్రీట్ మిశ్రమాలను తయారు చేశారు. వీటిని త్వరలోనే క్షేత్రస్థాయిలో పరీక్షించనున్నారు.
• ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హాకథాన్‌లు:
గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు RTGS సహకారంతో (1) స్మార్ట్ పాట్ హోల్ డిటెక్షన్ (గుంతల గుర్తింపు), (2) రోడ్ నెట్‌వర్క్ డిజిటలైజేషన్ అనే 2 AI హాకథాన్‌లు నిర్వహించి విజేతలను ఎంపిక చేశారు. వీరు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ (PoC) పూర్తి చేసిన తర్వాత, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రోడ్ల డిజిటలైజేషన్ కోసం వీరి సేవలను వినియోగించుకుంటారు.
• ప్లాస్టిక్ & స్టీల్ వ్యర్థాలతో రహదారులు:
రోడ్ల నిర్మాణంలో వినూత్నంగా డానిష్ ఫైబర్ మెటీరియల్స్ (ఫ్యాక్టరీల వ్యర్థాలైన స్టీల్ స్లాగ్‌ను తారుతో కలిపి) ఉపయోగించడంతో పాటు, పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ రోడ్ల (Plastic Roads) నిర్మాణ పనులను కూడా చేపట్టారు.
జాతీయ రహదారులు (National Highways) :
• ఆంధ్రప్రదేశ్ నుంచి 8,744 కి.మీ జాతీయ రహదారులు వెళ్తున్నాయి. వీటిలో 4,406 కి.మీ R&B శాఖ పరిధిలో ఉండగా, 641 కి.మీ MoRTH పరిధిలో ఉండగా, 3,697 కి.మీ NHAI ఆధ్వర్యంలో ఉన్నాయి.
• కూటమి ప్రభుత్వంలో గత రెండేళ్ల పాలనలో NHAI ఆధ్వర్యంలో 683 కి.మీ జాతీయ రహదారులను రూ.14,570 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు..
• కూటమి ప్రభుత్వంలో గత రెండేళ్ల పాలనలో MORTH ఆధ్వర్యంలో 866 కి.మీ జాతీయ రహదారులను రూ.8755 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు..
• మొత్తంగా గత రెండేళ్లలో రాష్ట్రంలో 1549 కి.మీ మేర జాతీయ రహదారులు, రూ. 23,325 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు..
• మొత్తంగా జాతీయ రహదారులకు నిధులు వ్యయంలో.. చిన్న రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తర్వాత దేశంలో 3 స్థానంలో నిలవడం గర్వకారం…
• గత రెండేళ్ల పాలనలో NHAI ఆధ్వర్యంలో రూ.26,760 కోట్లతో 677 కి.మీ మేర 24 ప్రాజెక్టులకు విజయవంతంగా పూర్తి చేశాం
• గత రెండేళ్ల పాలనలో MORTH ఆధ్వర్యంలో రూ. 9039 కోట్లతో 838 కి.మీ మేర 37 ప్రాజెక్టులకు విజయవంతంగా పూర్తి చేశాం
• మొత్తంగా రెండేళ్లలో రూ.35,799 కోట్ల విలువైన 1515 కి.మీ మేర 61 ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేశాం..
భవిష్యత్తులో పూర్తి చేయబోయే NH ప్రాజెక్టులు….
• 2026-27 సంవత్సరానికి రూ. 12,000 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 784 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము.
• రాబోయే ఏడాదిలో రూ. 30,781 కోట్ల విలువైన, మొత్తం 1,467 కిలోమీటర్ల పొడవు గల మొత్తం 79 ప్రాజెక్టులను పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం..











































