పెట్టుబడులు మౌలిక సదుపాయాలు (I&I) శాఖ రెండేళ్లలో సాధించిన కీలక విజయాలు
ఏపీ మారిటైమ్ బోర్డు
• గ్రీన్‌ఫీల్డ్ పోర్టుల నిర్మాణం : అత్యంత సంక్లిష్టమైన ఇపిసి (EPC) మోడల్ కింద ఏకకాలంలో పలు గ్రీన్‌ఫీల్డ్ ఓడరేవు ప్రాజెక్టులను వేగంగా ముందుకు తీసుకెళ్లడం ద్వారా ఏపీ మారిటైమ్ బోర్డు తన గొప్ప నిర్మాణ సామర్థ్యాన్ని నిరూపించుకుంది.
• భారీ పెట్టుబడులు : మచిలీపట్నం, రామాయపట్నం మరియు మూలాపేట వంటి ప్రధాన ఓడరేవులను ఒక్కొక్కటి సుమారు రూ. 3 వేల – రూ. 5 వేల కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చేస్తున్నాము. దీని కింద బ్రేక్‌వాటర్స్, డ్రెడ్జింగ్, బెర్త్‌లు మరియు ఆన్‌షోర్ సౌకర్యాలు వంటి కీలకమైన మౌలిక సదుపాయాల పనులు జరుగుతున్నాయి.
• భౌతిక పురోగతి (Physical Progress): తీర ప్రాంతంలో పనుల సంక్లిష్టత & సవాలుతో కూడిన వాతావరణం ఉన్నప్పటికీ, కీలక పోర్టులలో 40% – 80% వరకు పనులు పూర్తయ్యాయి. బ్రేక్‌వాటర్స్, బెర్తింగ్ మౌలిక సదుపాయాల పనులు వేగంగా సాగుతున్నాయి.
• రామాయపట్నం పోర్టు అత్యధికంగా 78.48% భౌతిక పురోగతి సాధించింది. దీని సామర్థ్యం 34 MMTPA కాగా, రూ. 4,929 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పోర్టు పనులను డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
• మూలాపేట పోర్టు రూ. 4,362 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నండగా.. ఇప్పటికే 75.5% పనులు పూర్తయ్యాయి. 24 MMTPA సామర్థ్యం గల ఈ ప్రాజెక్టును నవంబర్ 2026 నాటికి పూర్తి చేయనున్నాం..
• మచిలీపట్నం పోర్టు రూ. 5,156 కోట్లతో అంచనా వ్యయంతో ప్రారంభించబడి, ఇప్పటికే 57.78% పనులు పూర్తి చేసుకొని, డిసెంబర్ 2026 నాటికి పూర్తి కావడానికి సిద్ధంగా ఉంది. 35 MMTPA తో అత్యధిక సామర్థ్యం గల ప్రాజెక్ట్ ఇది.
• కాకినాడ గేట్‌వే పోర్టును రూ. 2,620 కోట్ల వ్యయంతో 16 MMTPA సామర్థ్యంతో నిర్మిస్తుండగా, ఇప్పటి కే ఈ ప్రాజెక్టు 41% భౌతిక పురోగతితో ఉంది. దీనిని మార్చి 2028 నాటికి పూర్తి చేయాలని గడువుగా నిర్ణయించారు.
• నిర్వహణ (O&M) టెండర్లు : రామాయపట్నం, మచిలీపట్నం, మూలాపేట మూడు గ్రీన్‌ఫీల్డ్ పోర్టుల ఆపరేషన్స్ & మేనేజ్‌మెంట్ (O&M) ఆపరేటర్లను ఎంపిక చేయడానికి ఆర్ఎఫ్‌పి (RFP) పత్రాలు సిద్ధమయ్యాయి. ఇవి 2026-27 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం (Q2, FY27) నాటికి జారీ చేయబడతాయి.
ఇపిసి (EPC) వ్యూహం వల్ల ప్రభుత్వానికి కలిగిన ప్రయోజనాలు:
• ఎ) ప్రాజెక్ట్ అమలుపై ప్రభుత్వం నేరుగా నియంత్రణ కలిగి ఉండటం వల్ల పనుల వేగం, నాణ్యత పెరిగాయి.
• బి) ప్రైవేట్ భాగస్వామ్యానికి ముందే పోర్టుకు అవసరమైన ప్రధాన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం స్వయంగా కల్పించింది..
• సి) ప్రాజెక్టుల రిస్క్‌ను తగ్గించి, (PPP) ఆధారిత ఓడరేవుల నిర్వహణకు & Phase-II విస్తరణకు సిద్ధం చేసింది.
• డి) పెద్ద & సంక్లిష్టమైన సముద్ర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్వహించడంలో మారిటైమ్ బోర్డు అంతర్గత సామర్థ్యం పెరిగింది.
ఫలితం (Outcome) :
• ఈ కార్యక్రమాల ద్వారా APMB కేవలం ఒక నియంత్రణ సంస్థ (Regulatory Institution) లాగా కాకుండా, బిలియన్ డాలర్ల విలువైన ఓడరేవు మౌలిక సదుపాయాలను అందించే ఒక ఉన్నత స్థాయి ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ ఏజెన్సీగా రూపాంతరం చెందింది.
• తద్వారా గ్రీన్‌ఫీల్డ్ పోర్టులను అత్యంత వేగంగా మరియు భారీ స్థాయిలో అభివృద్ధి చేయగల సామర్థ్యం ఉన్న దేశంలోని అతి కొద్ది ముఖ్య రాష్ట్రాల సరసన ఆంధ్రప్రదేశ్ నిలిచింది.
ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టులు (Fishing Harbor Projects)
• తీరప్రాంత ఆర్థిక వృద్ధి : APMB ఫిషింగ్ హార్బర్‌ల అభివృద్ధిని కేవలం సాధారణ మౌలిక సదుపాయాల నిర్మాణంగా కాకుండా, ఒక సమగ్ర తీర ప్రాంత ఆర్థిక వృద్ధి వ్యూహంగా మార్చింది. మత్స్య పరిశ్రమను ఇతర పరిశ్రమలు, లాజిస్టిక్స్ మరియు పర్యాటక రంగాలతో అనుసంధానించడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
మొదటి దశ (Phase-I) అభివృద్ధి:
• ఒకేసారి పలు ప్రాంతాలలో సుమారు రూ. 1,522.8 కోట్ల మొత్తం వ్యయంతో ఫిషింగ్ హార్బర్‌ల అభివృద్ధి పనులను ప్రారంభించారు.
• జువ్వలదిన్నె హార్బర్ (నెల్లూరు జిల్లా) ప్రాజెక్టు అత్యధికంగా 97.98% భౌతిక పురోగతి సాధించింది. రూ. 288.80 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి.
• ఉప్పాడ హార్బర్ (కాకినాడ జిల్లా): రూ. 361.00 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ హార్బర్ పనులు ప్రస్తుతం 84.48% పూర్తయ్యాయి. దీనిని డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
• నిజాంపట్నం హార్బర్ (బాపట్ల జిల్లా): ఈ జాబితాలో రూ. 451.00 కోట్లతో అత్యధిక వ్యయం గల ప్రాజెక్ట్ ఇది. ప్రస్తుతం 81.61% పనులను పూర్తి చేసుకొని, డిసెంబర్ 2026 నాటికి అందుబాటులోకి రానుంది.
• మచిలీపట్నం హార్బర్ (కృష్ణా జిల్లా): రూ. 422.00 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ప్రస్తుతం 71.45% భౌతిక పురోగతితో ఉంది. దీనిని కూడా డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేయాలని గడువుగా నిర్ణయించారు.
• పరిశ్రమల అనుసంధానం (జువ్వలదిన్నె హార్బర్):
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పరిధిలో సుమారు 29.58 ఎకరాల స్థలాన్ని (7.58 ఎకరాల వాటర్‌ఫ్రంట్ + 22 ఎకరాల బ్యాకప్ ల్యాండ్) కేటాయించారు.
దీని ద్వారా ‘సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు మార్గం సుగమం అయింది.
రెండవ దశ (Phase-II) ఫిషింగ్ హర్బర్ల అభివృద్ధి:
• పూడిమడక ఫిషింగ్ హార్బర్ : పిపిపి (PPP) మోడల్‌లో 3,000 DWT సామర్థ్యం గల కోస్టల్ బెర్త్‌తో నిర్మించేలా రూపకల్పన చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వ SASCI పథకం కింద నిధులను సేకరిస్తున్నారు.
• బుడిగట్లపాలెం హార్బర్ (శ్రీకాకుళం జిల్లా):
• 2020-21 ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 365.81 కోట్లు కాగా, 2025-26 ప్రకారం ఇది రూ. 444.00 కోట్లకు చేరింది. కేంద్రం రూ. 80 కోట్లు గ్రాంట్ కింద నిధులు మంజూరయ్యాయి..
• పూడిమడక హార్బర్ (అనకాపల్లి జిల్లా):
• 2020-21 ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 392.53 కోట్లు కాగా, 2025-26 ప్రకారం అంచనా వ్యయం రూ. 700.00 కోట్లకు చేరింది. కేంద్రం రూ. 80 కోట్లు గ్రాంట్ కింద నిధులు మంజూరయ్యాయి..
• కొత్తపట్నం హార్బర్ (ప్రకాశం జిల్లా):
• 2020-21 ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 392.45 కోట్లు కాగా, 2025-26 ప్రకారం ఇది రూ. 441.00 కోట్లుగా ఉంది. కేంద్రం రూ. 80 కోట్లు గ్రాంట్ కింద నిధులు మంజూరయ్యాయి..
• బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం (3 ఫిషింగ్ హార్బర్) లకు కలిపి రాష్ట్ర ప్రభుత్వం (GoAP) రూ. 40 కోట్లు, భారత ప్రభుత్వం & SASCI పథకం ద్వారా రూ. 410 కోట్లు కోట్లు మంజూరయ్యాయి. కేంద్ర గ్రాంట్ రూ. 240 కోట్లు కలిపి మొత్తంగా 690 కోట్లు మంజూరయ్యాయి..
• ఓడరేవు హార్బర్ (బాపట్ల జిల్లా):
• 2020-21 ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 417.55 కోట్లుగా ఉంది. (2025-26 ఎస్‌ఎస్‌ఆర్ మరియు నిధుల మంజూరు వివరాలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది).
• బియ్యపుతిప్ప (పశ్చిమ గోదావరి జిల్లా):
• 2020-21 అంచనా వ్యయం రూ. 429.43 కోట్లుగా ఉండగా.. ఈ ప్రాంతాన్ని ఫిషింగ్ హార్బర్‌కు బదులుగా ‘ఫిష్ ల్యాండింగ్ సెంటర్’గా మార్చడానికి ప్రతిపాదించారు.
షిప్ బిల్డింగ్ క్లస్టర్ అభివృద్ధి (Shipbuilding Cluster)
• దుగ్గరాజపట్నం – మెగా షిప్‌బిల్డింగ్ క్లస్టర్:
• భూసేకరణ: పోర్టు మరియు నౌకా నిర్మాణ అభివృద్ధి కోసం సుమారు 3,500 ఎకరాలను గుర్తించి, అందులో 2,170 ఎకరాల భూమిని సేకరించే ప్రక్రియను ప్రారంభించారు
• ప్రత్యేక సంస్థ ఏర్పాటు: ఈ క్లస్టర్ అభివృద్ధి, నిధులు మరియు సమన్వయం కోసం విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (VPA) భాగస్వామ్యంతో ‘NSHIP–AP SPV’ అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేశారు
• కేంద్ర ప్రభుత్వ అనుమతి: దుగ్గరాజపట్నాన్ని జాతీయ వ్యూహాత్మక ప్రాధాన్యత గల “మెగా షిప్‌బిల్డింగ్ క్లస్టర్” గా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుండి సూత్రప్రాయ అనుమతి లభించింది
• ప్రైవేట్ భాగస్వామ్యం: ఈ ప్రాజెక్టును పిపిపి (PPP-DBFOT) పద్ధతిలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో భాగస్వామిగా ఉండేందుకు ఒక ప్రముఖ ప్రైవేట్ సంస్థను ఎంపిక చేసే ప్రక్రియ సాగుతోంది
మచిలీపట్నంలో చిన్న నౌకా నిర్మాణం మరియు మరమ్మతు కేంద్రం:
• బహుళ ప్రయోజనాలు : మచిలీపట్నం పోర్టులో కేవలం సరుకు రవాణా (Cargo) మాత్రమే కాకుండా, వ్యూహాత్మకంగా నౌకా నిర్మాణం మరియు ఓడల మరమ్మతు (Ship Repair) పనులకు కూడా అవకాశం కల్పించారు
• డెవలపర్ ఎంపిక : దీని కోసం ప్రత్యేక వాటర్‌ఫ్రంట్ మరియు భూములను కేటాయిస్తూ టెండర్లు (RFP) జారీ చేశారు. జూన్ 2026 మధ్య నాటికి డెవలపర్‌ను ఖరారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు
కార్గో నిర్వహణలో అద్భుతమైన పనితీరు (Operational Excellence)
• సరుకు రవాణాలో స్థిరమైన వృద్ధి (FY20–FY26) (CAGR): చిన్న మరియు మధ్య తరహా పోర్టులలో 2.8%, ప్రధాన పోర్టులలో (Major Ports) 4.0% వార్షిక వృద్ధి నమోదైంది
• జాతీయ సగటు కంటే ఎక్కువ వృద్ధి:
• చిన్న పోర్టులు : భారతదేశ సగటు వృద్ధి 2% మాత్రమే కాగా, ఏపీలో 13.9% వృద్ధి నమోదైంది
• ప్రధాన పోర్టులు: దేశవ్యాప్తంగా 7.1% వృద్ధి ఉంటే, ఏపీలో 10.4% వృద్ధి నమోదైంది. ఇది జాతీయ సగటు కంటే ఆంధ్రప్రదేశ్ వేగంగా దూసుకుపోతోందని చూపిస్తోంది
లక్ష్యాల సాధన (FY 2025–26):
• చిన్న పోర్టులు : 120 MMTPA లక్ష్యానికి గాను 118.15 MMTPA (98%) సాధించాయి
• ప్రధాన పోర్టులు: 90 MMTPA లక్ష్యానికి గాను ఏకంగా 91.2 MMTPA (100% కంటే ఎక్కువ) సాధించి రికార్డు సృష్టించాయి
• అంతర్జాతీయ గుర్తింపు మరియు ఆర్థిక సంస్కరణలు
ప్రపంచ వేదికలపై ప్రాతినిధ్యం:
• గ్లోబల్ ఫోరమ్స్: దావోస్‌లో జరిగిన WEF 2026, సింగపూర్ మారిటైమ్ వీక్ 2026, విశాఖపట్నం పార్టనర్‌షిప్ సమిట్ మరియు ముంబై ఇండియా మారిటైమ్ వీక్‌లలో APMB చురుగ్గా పాల్గొని రాష్ట్ర తీరప్రాంత అభివృద్ధి వ్యూహాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది
• భారీ పెట్టుబడులు : దీని ద్వారా సుమారు రూ. 1.7 లక్షల కోట్ల పెట్టుబడి సామర్థ్యం మరియు 1.4 లక్షల మందికి ఉపాధి కల్పించగల 30 కి పైగా భారీ ప్రాజెక్టులను ఆకర్షించేందుకు మార్గం సుగమమైంది
• కీలక పరిశ్రమల ఆకర్షణ: ఏపీ పోర్టులు ప్రస్తుతం కింది రంగాలకు ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయి:
• నౌకా నిర్మాణం మరియు రక్షణ రంగ ఉత్పత్తులు (ఉదా: సాగర్ డిఫెన్స్)
• గ్రీన్ ఎనర్జీ (గ్రీన్ అమ్మోనియా, హైడ్రోజన్, ఎల్‌ఎన్‌జి టెర్మినల్స్)
• లాజిస్టిక్స్ మరియు భారీ ఇంజనీరింగ్ తయారీ సంస్థలు (BMEL)
రుణాల పునర్వ్యవస్థీకరణ (Loan Restructuring):
• తక్కువ వడ్డీకి మార్పిడి: ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి APMB ఒక అడుగు ముందుకు వేసింది. గతంలో పీఎఫ్‌సీ (PFC) నుండి తీసుకున్న అధిక వడ్డీ రుణాలను, తక్కువ వడ్డీతో కూడిన సాగరమాల ఫైనాన్స్ కార్పొరేషన్ (SMFCL) నిధులుగా విజయవంతంగా మార్చింది
• ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డ్ (APMB) చేపట్టిన రుణాల పునర్వ్యవస్థీకరణ, పారదర్శక విధానాలు మరియు “స్వర్ణాంధ్ర విజన్” అమలుకు సంబంధించిన పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి:
రుణాల పునర్వ్యవస్థీకరణ పట్టిక (Loan Restructuring)
• తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను మార్చడం ద్వారా ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని తగ్గించిన వివరాలు:
• రామాయపట్నం పోర్టు: రుణం ₹2,267 కోట్లు @ 10.40% వడ్డీతో (PFC ద్వారా)
• గతంలో తీసుకోగా సాగరమాల ఫైనాన్స్ కార్పొరేషన్ (SMFCL) కిందకు మార్చడం ద్వారా వడ్డీ రేటు 8.38%కి తగ్గింది.
• మచిలీపట్నం పోర్టు: రుణం ₹1,655 కోట్లు @ 9.90% వడ్డీతో గతంలో తీసుకోగా ₹2,284 కోట్ల మిగిలిన బ్యాలెన్స్‌ను బదిలీ చేయడానికి ప్రతిపాదించారు. ఫలితంగా మెరుగైన తక్కువ వడ్డీ నిబంధనలు ఆశించబడుతున్నాయి.
• భావనపాడు పోర్టు (మూలపేట): రుణం ₹2,239 కోట్లు @ 10.15% వడ్డీతో
తీసుకోగా ₹1,645 కోట్ల మిగిలిన బ్యాలెన్స్‌ను రీఫైనాన్స్ కోసం ప్రతిపాదించారు. ఫలితంగా మెరుగైన తక్కువ వడ్డీ నిబంధనలు ఆశించబడుతున్నాయి.
ఫలితం – రుణ ఖర్చులను తగ్గించడం మరియు ఆర్థిక క్రమశిక్షణను బలోపేతం చేయడం ద్వారా, పోర్టుల అభివృద్ధి అనేది ఆర్థికంగా లాభదాయకమైన మరియు సమర్థవంతంగా నిర్వహించబడే ప్రజా మౌలిక సదుపాయాలనే భావనను APMB (ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు) దృఢపరిచింది. తద్వారా రాష్ట్ర సముద్రయాన అభివృద్ధి వ్యూహంపై ప్రజల నమ్మకాన్ని మరియు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచింది.
3. పారదర్శకత, నిష్పాక్షికత మరియు వ్యాపార నిర్వహణ వేగాన్ని (Ease of Doing Business) మెరుగుపరచడానికి తీసుకున్న చర్యలు
3.1. విధానపరమైన మరియు నియంత్రణ చట్రం (Policy and Regulatory Framework)
• గతంలో ఆంధ్రప్రదేశ్‌లో సముద్రయాన పెట్టుబడులు ఎదుర్కొన్న సమస్యలు:
ఎ) వివిధ ప్రభుత్వ శాఖల మధ్య విడిపోయిన అనుమతుల ప్రక్రియ
బి) వ్యవస్థీకృత భూ కేటాయింపుల విధానం లేకపోవడం
సి) పోర్టుల చుట్టూ సమగ్ర ప్రణాళిక కొరవడటం
డి) ధరలు, అనుమతులు మరియు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడం
• ఈ అడ్డంకులను అధిగమించడానికి, ప్రభుత్వం సముద్రయాన పెట్టుబడి వ్యవస్థను పూర్తిగా మార్చేసే లక్షిత విధాన మరియు నియంత్రణ సంస్కరణలను ప్రవేశపెట్టింది:
ఎ) రాష్ట్ర మారిటైమ్ మరియు వాటర్‌వేస్ మాస్టర్ ప్లాన్
బి) మారిటైమ్ పాలసీ 2024
సి) PPADA ఏర్పాటు
డి) భూ కేటాయింపు మార్గదర్శకాలు 2026
• సమగ్ర విధానం: విడివిడిగా ఉన్న పాత విధానాల స్థానంలో ఇప్పుడు పటిష్టమైన, అందరికీ ఒకే రకమైన ‘సమగ్ర మారిటైమ్ పాలసీ’ అమల్లోకి వచ్చింది.
• వేగవంతమైన అనుమతులు: బహుళ ప్రభుత్వ శాఖల చుట్టూ తిరిగే పని లేకుండా, ఇప్పుడు ‘సింగిల్-విండో’ మరియు PPADA సమన్వయంతో అనుమతులు చాలా వేగంగా లభిస్తున్నాయి.
• పారదర్శక భూ కేటాయింపులు: గతంలో ఒక్కో రంగానికి ఒక్కోలా (కేస్-బై-కేస్) జరిగే భూ కేటాయింపుల స్థానంలో, ప్రస్తుతం నిబంధనలకు లోబడి పారదర్శకమైన వ్యవస్థ వచ్చింది.
• స్పష్టమైన ధరలు: ధరలపై ఉన్న పాత అస్పష్టతను తొలగించి, అందరికీ సమానంగా ఉండేలా ‘ప్రామాణికమైన SoR ఆధారిత ధరల’ విధానాన్ని తెచ్చారు.
• మారిటైమ్ పాలసీ 2024, PPADA మరియు భూ కేటాయింపు మార్గదర్శకాలు 2026 ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాత కేస్-బై-కేస్ అనుమతుల విధానం నుండి నిర్మాణాత్మక, పారదర్శక మరియు పెట్టుబడిదారులకు అనుకూలమైన నియంత్రణ వ్యవస్థ వైపు అడుగులు వేసింది. ఇది సముద్రయాన రంగంలో వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని (Ease of Doing Business) గణనీయంగా మెరుగుపరిచింది.
వ్యాపార సరళీకరణ, పారదర్శకత
• గతంలో ఉన్న విడివిడి ఆమోదాలు, భూ కేటాయింపుల్లో అస్పష్టతలను తొలగిస్తూ ప్రభుత్వం మెరిటైమ్ పాలసీ 2024 మరియు భూ కేటాయింపు మార్గదర్శకాలు 2026 ద్వారా విప్లవాత్మక మార్పులు తెచ్చింది.
• పాలసీ మార్పులు: గతంలో వేర్వేరు శాఖల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నుండి ఇప్పుడు సింగిల్ విండో (ఏకగవాక్ష) విధానం మరియు పారదర్శకమైన ధరల నిర్ణయాన్ని ప్రవేశపెట్టారు.
APLINC ఏర్పాటు (ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్):
• లాజిస్టిక్స్ రంగాన్ని ఒకే వ్యవస్థ కిందకు తీసుకురావాడానికి 12 జనవరి 2026న (G.O.Ms.No. 4) ఈ సంస్థ ఏర్పాటుకు ఆమోదం లభించింది.
• కోస్టల్ ల్యాండ్ బ్యాంక్ : తీరప్రాంతాల్లో పెట్టుబడులకు ప్రధాన అడ్డంకిగా ఉన్న భూ సమస్యను తీర్చడానికి, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఉపయోగించని 19,619 ఎకరాల ఉప్పు భూములను (Salt Lands) గుర్తించి సేకరిస్తున్నారు.
స్వర్ణాంధ్ర విజన్ (Swarna Andhra Vision) అమలు చర్యలు
• రాష్ట్రాన్ని సరికొత్త సాంకేతిక లాజిస్టిక్స్ హబ్‌గా మార్చడానికి నాలుగు కీలక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి:
• ఎ) రాయలసీమ హార్టికల్చర్ హబ్:
రాయలసీమ ప్రాంతం నుండి పండ్లు, కూరగాయల ఎగుమతులను పెంచేందుకు వ్యవసాయ, ఉద్యానవన శాఖలతో కలిసి క్షేత్రస్థాయి పరిశోధనలు పూర్తి చేశారు.
• బి) జాతీయ లాజిస్టిక్స్ ప్లాట్‌ఫారమ్ (ULIP) తో అనుసంధానం:
డేటా ఆధారిత నిర్ణయాలు మరియు సరుకు రవాణా పర్యవేక్షణను సులభతరం చేయడానికి ULIP సంస్థతో APMB అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది.
• సి) రైల్వే కనెక్టివిటీ మరియు కొత్త జోన్:
విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా ప్రకటించబడిన సౌత్ కోస్ట్ రైల్వే (SoCR) జోన్ వచ్చే వారం (జూన్ 1, 2026) నుండి అధికారికంగా తన విధులను ప్రారంభించనుంది. దీనితో పాటు గోల్డెన్ క్వాడ్రిలేటరల్‌లో 3, 4 వ లైన్లు, దుగ్గరాజపట్నం రైల్ లింక్ పనులను వేగవంతం చేస్తున్నారు.
• డి) మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కులు:
జాతీయ రహదారులు మరియు కార్గో టెర్మినల్స్ కలిసే కూడళ్ల వద్ద సరుకుల నిల్వ, రవాణా కేంద్రాలుగా ఉపయోగపడే మల్టీమోడల్ పార్కుల ఏర్పాటుకు భూములను గుర్తించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
*ఆకాశమే హద్దుగా గత రెండేళ్ల
ఏపీ ఎయిర్ పోర్టు డెవలప్ మెంట్ కార్పొరేషన్ పయనం*
• FY 2024–26 కాలంలో, ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APADCL) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా విమానయాన మౌలిక వసతులు మరియు అనుబంధ వ్యవస్థల అభివృద్ధిలో గణనీయమైన పురోగతి సాధించింది. సమర్థవంతమైన ప్రాజెక్ట్ అమలు, విధాన రూపకల్పన, భాగస్వామ్య సంస్థలతో సమన్వయం మరియు సంస్థాగత బలోపేతం ద్వారా ఈ పురోగతి సాధ్యమైంది.
• a) అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం (భోగాపురం)
• అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు విశాఖపట్నం సమీపంలోని విజయనగరం జిల్లా భోగాపురంలో 2,203.26 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయబడుతోంది. ఈ ప్రాజెక్టు డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ మరియు ట్రాన్స్‌ఫర్ (DBFOT) మోడల్ ఆధారంగా పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ (PPP) పద్ధతిలో అమలవుతోంది. GMR విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (GVIAL) కన్సెషనైర్‌గా వ్యవహరిస్తోంది.
• విమానాశ్రయం ప్రస్తుత స్థితి
• రాష్ట్ర & కేంద్ర ప్రభుత్వ స్థాయిలలో సంబంధిత విభాగాలతో నిరంతర సమన్వయం ద్వారా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం 2026 మే 26 నాటికి 99.35% పనులు పూర్తయ్యాయి
• 2026 జనవరిలో టెస్ట్ ఫ్లైట్ విజయవంతంగా నిర్వహించబడింది.. 2026 జూన్ నాటికి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి
• పర్యావరణ మరియు అనుబంధ అభివృద్ధి దృష్ట్యా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి అనంతరం భోగాపురం ఏవియేషన్ హబ్ కోసం 500 ఎకరాల సిటీ-సైడ్ భూమిని GVIAL కు అప్పగించారు. ఇది రాష్ట్రంలో ఏరోస్పేస్ మరియు అనుబంధ పెట్టుబడులను ఆకర్షించే వ్యూహాత్మక కేంద్రంగా నిలవనుంది.
• ఈ విమానాశ్రయం ప్రాంతీయ వైమానిక కనెక్టివిటీని మెరుగుపరచడం ద్వారా విశాఖపట్నం ఆర్థిక ప్రాంత అభివృద్ధికి ప్రధాన ఆర్థిక ప్రేరక శక్తిగా మారనుంది.
• 2026 జూలైలో ప్రారంభోత్సవం నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధమైంది.
b) ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు
• ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విజన్‌కు అనుగుణంగా, రాష్ట్రవ్యాప్తంగా వైమానిక రవాణా మరియు కార్గో రవాణాను సులభతరం చేయడానికి APADCL కొత్త విమానాశ్రయాల అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తోంది.
• గత 2 సంవత్సరాల్లో, APADCL ఐదు గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల (దగదర్తి, కుప్పం, శ్రీకాకుళం, అమరావతి, నాగార్జునసాగర్) కోసం టెక్నికల్ మరియు ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్స్ (TEFRs) పూర్తి చేసింది. దీంతో సైట్ క్లియరెన్స్ మరియు భూసేకరణ దశలకు మార్గం సుగమమైంది. అదనంగా, ఈ విమానాశ్రయాల కోసం PPP నిర్మాణం కూడా ఖరారైంది. అనుమతులు లభించిన వెంటనే ప్రాజెక్టుల అమలు వేగవంతం కానుంది.
• ప్రత్యేకంగా, దగదర్తి విమానాశ్రయం గణనీయమైన పురోగతి సాధించింది. అన్ని చట్టపరమైన అనుమతులు పొందబడగా, భాగస్వామ్య సంస్థల సూచనలు పొందిన అనంతరం ప్రస్తుతం టెండర్ దశలో ఉంది. ఈ విమానాశ్రయం నెల్లూరు ప్రాంతంలో కనెక్టివిటీ మరియు ఆర్థిక వృద్ధికి తోడ్పడనుంది.
విమానాశ్రయాల ప్రస్తుత స్థితి
1. దగదర్తి
• DBFOT కన్సెషన్ కోసం RFPలను 2025 సెప్టెంబర్ మరియు 2026 మార్చిలో రెండుసార్లు విడుదల చేశారు
• మూడోసారి టెండర్ పిలవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది మరియు భాగస్వామ్య సంస్థల సంప్రదింపులు నిర్వహించబడాయి
• 2026 మే 8 మరియు 13 తేదీలలో స్టేక్‌హోల్డర్ సమావేశాలు పూర్తయ్యాయి; సవరించిన నిబంధనలు ప్రభుత్వ అనుమతికి పంపబడ్డాయి
2. కుప్పం
• RFP విడుదలకు సిద్ధంగా ఉంది; MoCA నుండి సైట్ క్లియరెన్స్ కోసం నిరీక్షణలో ఉంది
• ఎయిర్‌స్పేస్ పరిమితులపై వివరణను MoCA కు పంపారు
• విమానాశ్రయం O&M కోసం 15% మార్జిన్ మరియు CAPEX ను GoAP భరిస్తే అనుమతిస్తామని BIAL MoCA కు షరతులతో కూడిన NOC అందించింది
• RFP విడుదలకు Fairfax Holdings నుండి షరతుల్లేని NOC అవసరం
3. అమరావతి
• MoCA నుండి సైట్ క్లియరెన్స్ కోసం నిరీక్షణలో ఉంది
• ల్యాండ్ పూలింగ్ / భూసేకరణపై నిర్ణయం కోసం CRDA కు ఫైల్ పంపబడింది
• ట్రంక్ మౌలిక వసతుల నిధులు APADCL / CRDA ద్వారా సమకూర్చబడతాయి
4. శ్రీకాకుళం
• విమానాశ్రయాన్ని PPP కన్సెషన్ రూపంలో అభివృద్ధి చేయడానికి AAI కు 2025 డిసెంబర్‌లో ప్రతిపాదన పంపబడింది
• MoCA నుండి సైట్ క్లియరెన్స్ కోసం నిరీక్షణలో ఉంది
5. నాగార్జునసాగర్
• MoCA నుండి సైట్ క్లియరెన్స్ కోసం నిరీక్షణలో ఉంది
• RCS పథకం ద్వారా నిధుల సమకూర్పును AAI ప్రతిపాదించింది – మార్గదర్శకాలు నిరీక్షణలో ఉన్నాయి
• భూసేకరణ మరియు ట్రంక్ మౌలిక వసతుల కోసం నిధులు సమకూర్చాల్సి ఉంది
6. ఒంగోలు
• సర్వే కోసం భూభాగాల ఖరారు ప్రక్రియ కొనసాగుతోంది
• గుర్తించిన భూభాగాల నుండి VANPIC భూములను తొలగించే పనిలో జిల్లా కలెక్టర్ ఉన్నారు
• భూమి గుర్తింపు అనంతరం TEFR తయారీ ప్రారంభమవుతుంది
• AAI సంయుక్త భాగస్వామ్య (JV) పద్ధతిలో అభివృద్ధిని ప్రతిపాదించింది
7. తాడేపల్లిగూడెం
• ప్రీ-ఫీజిబిలిటీ అధ్యయనం కోసం AAI బృందం 22 మే న స్థలాన్ని సందర్శించింది
8. తుని–అన్నవరం
• ప్రీ-ఫీజిబిలిటీ అధ్యయనం కోసం AAI బృందాన్ని పంపనుంది; GoAP నుండి అభ్యర్థన పంపబడింది
9. అనంతపురం
• గుర్తించిన స్థలం గణనీయమైన భౌగోళిక మరియు అడ్డంకి పరిమితుల కారణంగా అనుకూలం కాదని AAI నివేదించింది
• తక్కువ అడ్డంకులు మరియు సమతల భూభాగం కలిగిన ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించాల్సి ఉంది
• ఈ విమానాశ్రయాల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ లక్ష్యమైన విమానాశ్రయ మౌలిక వసతుల విస్తరణ మరియు విమాన ప్రయాణాన్ని ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ముందుకు తీసుకెళ్తుంది. వ్యాపారం మరియు పర్యాటకానికి మెరుగైన కనెక్టివిటీ, విమానాశ్రయాల చుట్టూ వాణిజ్య కార్యకలాపాల ప్రోత్సాహం, ఏరోస్పేస్ మరియు విమానయాన వ్యవస్థ బలోపేతం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుంది. అదనంగా, సరుకు రవాణా మెరుగుపడి, అధిక విలువ గల త్వరగా పాడయ్యే వస్తువులకు అంతర్జాతీయ మార్కెట్లు అందుబాటులోకి వస్తాయి.
భవిష్యత్ కార్యాచరణ:
• 2027 నాటికి 5 విమానాశ్రయ ప్రాజెక్టులు ప్రారంభింప చేయాలని APADCL లక్ష్యంగా పెట్టుకుంది. PPP ఆధారిత అభివృద్ధి, భాగస్వామ్య సంస్థల సమన్వయం మరియు విధాన ప్రోత్సాహాలపై నిరంతర దృష్టి కొనసాగించబడుతుంది.
• c) బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయం
• కర్నూలు విమానాశ్రయాన్ని PPP పద్ధతిలో అభివృద్ధి చేయడానికి APADCL చర్యలు చేపట్టింది. దీని లక్ష్యం నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడం మరియు ప్రభుత్వ ఆర్థిక భారం తగ్గించడం.
విమానాశ్రయం ప్రస్తుత స్థితి
• ఓర్వకల్‌లోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం
• ప్రస్తుతం కార్యకలాపాలు కొనసాగుతున్న విమానాశ్రయం; 0.02 మిలియన్ ట్రాఫిక్ మరియు ఇండిగో ద్వారా 3 మార్గాల్లో సేవలు
• PPP అభివృద్ధికి భాగస్వామ్య సంస్థల ఆసక్తి వ్యక్తమైంది
• 100 ఎకరాల భూమి APADCL వద్ద ఉంచబడుతుంది; 908 ఎకరాలు కన్సెషనైర్‌కు ఇవ్వబడతాయి
• SIPC సిఫార్సులు చేర్చబడగా, RFP కి కేబినెట్ ఆమోదం లభించింది; విడుదలకు సిద్ధంగా ఉంది
• సామర్థ్య అభివృద్ధి దృష్ట్యా, కర్నూలు విమానాశ్రయంలో రెండు ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్లకు (FTOs) భూమి కేటాయించబడింది. ఒకటి కార్యకలాపాలకు సిద్ధమవుతుండగా, రెండోది 2026 ఆగస్టు నాటికి ప్రారంభం కానుంది.
• అనుకూలమైన డెవలపర్ ఎంపికైన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నిర్వహణ వ్యయాలు మరియు బాధ్యతలు తగ్గుతాయి. ప్రైవేట్ రంగ నైపుణ్యం పెరగడం ద్వారా సామర్థ్యం మెరుగుపడి, కర్నూలులో బలమైన విమానయాన వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది.
భవిష్యత్ కార్యాచరణ:
• RFP విడుదల చేసి, కర్నూలు విమానాశ్రయానికి అనుకూలమైన PPP డెవలపర్‌ను ఎంపిక చేయడం.
d) వాటర్ ఏరోడ్రోమ్స్
• రాష్ట్రంలో వాటర్ ఏరోడ్రోమ్‌ల అభివృద్ధి కోసం APADCL ఫీజిబులిటీ స్టడీ ప్రారంభించింది. 8 వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్టుల కోసం DPRలు పూర్తయ్యాయి. 4 ప్రదేశాలు తక్షణ కార్యకలాపాలకు సిద్ధంగా ఉన్నాయి.
• ప్రదేశాలు : ప్రకాశం, గండికోట, శ్రీశైలం, కాకినాడ, విశాఖపట్నం, అరకు, లంబసింగి, తిరుపతి మరియు కోనసీమ. అదనంగా రాజమండ్రి మరియు సూర్యలంక వద్ద మరో 2 ప్రదేశాలను ఖరారు చేయనున్నారు.
• విశాఖపట్నం, ప్రకాశం, శ్రీశైలం మరియు గండికోట వద్ద మౌలిక వసతులు సిద్ధంగా ఉన్నాయి
• తొమ్మిది ప్రదేశాల అభివృద్ధి వ్యయం రూ.149 కోట్లు
• UDAN 5.5 కింద MoCA ప్రాజెక్ట్ ఎవాల్యుయేషన్ కమిటీ (PEC) నిధులను ఆమోదించింది
• వాటర్ ఏరోడ్రోమ్ అభివృద్ధికి PPP నిర్మాణంలో APTDC కు APADCL మద్దతు ఇచ్చింది
• వాటర్ ఏరోడ్రోమ్‌లు పర్యాటకాన్ని ప్రోత్సహించడం, చివరి మైలు కనెక్టివిటీని మెరుగుపరచడం మరియు దూర ప్రాంత పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఏపీఫైబర్ నెట్ లిమిటెడ్ రెండేళ్ల సాధించిన విజయాలు
సవరించిన భారత్‌నెట్ ప్రోగ్రామ్ (ABP) – MoC మరియు SPV ఏర్పాటు
• కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రయోజన వాహనం (SPV) ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసి, ఆంధ్రప్రదేశ్ భారత్‌నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (APBIL) అనే SPV విజయవంతంగా స్థాపించబడింది.
• 2026 ఫిబ్రవరి 22న సహకార ఒప్పందం అమలు చేయబడగా, అనంతరం 2026 మే 13న MoU పై సంతకాలు జరిగాయి. 2026 మే 14న ప్రాజెక్ట్ అమలు సంస్థ (PIA) ఎంపిక కోసం RFP విడుదల చేయబడింది.
GoAP నుండి బకాయిల వసూళ్లు
• టెలికాన్ఫరెన్స్, ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ (IBB), ఇంటర్నెట్ లీజ్డ్ లైన్ (ILL), HCM కార్యక్రమాలు వంటి సేవలకు సంబంధించిన దీర్ఘకాలిక బకాయిలపై ప్రతిపాదనలు సమర్పించబడ్డాయి.
• 2025 ఏప్రిల్ నుండి 2026 జనవరి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విభాగాల నుండి సుమారు రూ.12 కోట్లు వసూలు చేయబడ్డాయి.
SASCI కింద CAPEX బకాయిల క్లియరెన్స్
• APSFL ఫేజ్-I నెట్‌వర్క్, భారత్‌నెట్ ఫేజ్-II మరియు CCTV విక్రేతల చెల్లింపులకు సంబంధించిన పెండింగ్ CAPEX బకాయిల క్లియరెన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు విడతలుగా నిధులు విడుదల చేసింది.
• 2025 ఏప్రిల్‌లో రూ.112.5 కోట్లు
• 2026 జనవరిలో రూ.60 కోట్లు
• 2026 మార్చిలో రూ.50 కోట్లు
• మొత్తం రూ.222.50 కోట్ల CAPEX బకాయిలు క్లియర్ చేయబడ్డాయి. దీంతో విక్రేతల విశ్వాసం పెరిగి APSFL ఆర్థిక పరిస్థితి బలపడింది.
బ్యాండ్‌విడ్త్ రేట్ల సవరణ
• APSFL 2026 జనవరిలో వినియోగ ఆధారిత సౌకర్యవంతమైన ఇంటర్నెట్ బ్యాండ్‌విడ్త్ కొనుగోలు విధానాన్ని అమలు చేసింది.
• బ్యాండ్‌విడ్త్ సామర్థ్యం 100 Gbps నుండి 110 Gbps కు పెరిగింది
• సంవత్సరానికి రూ. 4.14 కోట్ల ఆదా అయ్యింది.
• పీరింగ్ మరియు ILL సేవల యూనిట్ ఖర్చులు 37% తగ్గాయి
కంటెంట్ ఆప్టిమైజేషన్ మరియు బ్రాడ్‌కాస్టర్ భాగస్వామ్యం
• సబ్‌స్క్రైబర్ అవసరాలు మరియు వీక్షణ అభిరుచుల ఆధారంగా APSFL ఛానల్ బొకేను పునర్వ్యవస్థీకరించింది. బ్రాడ్‌కాస్టర్లతో LCN ప్లేస్‌మెంట్ మరియు ప్రచార ఒప్పందాలు కుదుర్చుకుంది.
• ఈ భాగస్వామ్యాల ద్వారా కంటెంట్ వ్యయాల పెరుగుదలను అదుపులో ఉంచి అదనపు ఆర్థిక భారం లేకుండా సేవలను మెరుగుపరిచింది.
• LCN మరియు ప్రచార ఒప్పందాల ద్వారా సుమారు రూ.10 కోట్ల నోటిషనల్ ఆదాయం
• ప్రతి సబ్‌స్క్రైబర్‌పై కంటెంట్ వ్యయం తగ్గింపు
• సబ్‌స్క్రైబర్ విలువ పెంపు
B2B ఆదాయ వృద్ధి – Airtel టవర్స్ ఒప్పందం
• భారతి ఎయిర్‌టెల్ లిమిటెడ్‌తో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న MPLS కనెక్టివిటీ ఒప్పందం పునరుద్ధరించబడింది.
• ప్రస్తుతం 82 టవర్ సైట్లకు కనెక్టివిటీ అందుతోంది
• అదనంగా 20 సైట్లను చేర్చే ప్రతిపాదనలు ఉన్నాయి
• పెండింగ్ బకాయిల సర్దుబాటు ప్రక్రియ కొనసాగుతోంది
• సంస్థాగత B2B ఆదాయం బలోపేతమై, సుమారు రూ.9 కోట్ల విడుదల త్వరలో జరగనుంది. కొత్త కొనుగోలు ఆర్డర్లకు అవకాశాలు ఉన్నాయి.
ప్రజాభిప్రాయం సానుకూలంగా మారేందుకు చేపట్టిన చర్యలు
CPE బాక్స్‌లపై రూ.59 అద్దె ఛార్జ్ తగ్గింపు
• CAF స్థాయిల నిలిపివేత కారణంగా LMO స్థాయిలో ఆర్థిక మరియు నిర్వహణ ఒత్తిడి ఏర్పడింది. దీనిని దృష్టిలో ఉంచుకుని పరికరాల జీవితకాలం మరియు మూలధన రికవరీ సూత్రాల ఆధారంగా CPE పెనాల్టీ నిర్మాణం సవరించబడింది.
• 78 నెలలకు పైబడిన పరికరాలకు రూ.9
• 60–78 నెలల మధ్య పరికరాలకు రూ.29
• 60 నెలలలోపు పరికరాలకు రూ.59
వ్యాపారంలో పారదర్శకత, వేగం మరియు నిష్పక్షపాతాన్ని మెరుగుపరచడానికి తీసుకున్న చర్యలు
హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల సవరణ
• అనియంత్రిత వినియోగం వల్ల నెట్‌వర్క్ ఒత్తిడి పెరగకుండా ఉండేందుకు అన్‌లిమిటెడ్ ప్లాన్‌ల స్థానంలో డేటా పరిమితులు అమలు చేశారు.
• రూ.249 ప్లాన్‌ను 400GB పరిమితి ప్లాన్‌గా మార్చారు
• రూ.599 ప్లాన్‌ను 1000GB పరిమితి ప్లాన్‌గా మార్చారు
• ఈ మార్పులు Fair Usage Policy మరియు మార్కెట్ ప్రమాణాలకు అనుగుణంగా అమలు చేయబడ్డాయి.
APSFL వెబ్‌సైట్ పునర్నిర్మాణం
• ప్రస్తుత వెబ్‌సైట్‌ను ఆధునిక UI/UX ప్రమాణాలతో తిరిగి రూపొందిస్తున్నారు.
• సులభమైన నావిగేషన్
• మెరుగైన కంటెంట్ నిర్మాణం
• అన్ని భాగస్వామ్య సంస్థలకు సమాచార కేంద్రంగా అభివృద్ధి
WhatsApp ఛానల్ అమలు
• ప్రణాళికలు, RFP వివరాలు, కనెక్టివిటీ స్థితి మరియు ఇతర కీలక సమాచారాన్ని భాగస్వామ్య సంస్థలకు తక్షణంగా అందించేందుకు ప్రత్యేక WhatsApp ఛానల్ ప్రారంభించబడింది.
• దీంతో పారదర్శకత పెరిగింది
• MSOలు, LMOలు, విక్రేతలు మరియు వినియోగదారుల విశ్వాసం బలపడింది
యూనిఫైడ్ e-Tappal మరియు e-Office వ్యవస్థ
• ఇమెయిల్లు, e-office ఫైళ్లు మరియు భౌతిక లేఖలు సహా అన్ని కమ్యూనికేషన్లు డిజిటలైజ్ చేయబడ్డాయి.
• tappal నంబర్లు కేటాయింపు
• పూర్తి డిజిటల్ ప్రాసెసింగ్
• ట్రాకింగ్, స్టోరేజ్ మరియు రికార్డ్ నిర్వహణ సులభతరం
ప్రీపెయిడ్ బిల్లింగ్ విధానం మరియు డిజిటల్ చెల్లింపులు
• APSFL నెట్‌వర్క్‌లో రాష్ట్ర మరియు జిల్లా స్థాయి లోకల్ ఛానళ్ల కోసం పోస్ట్‌పెయిడ్ విధానాన్ని ప్రీపెయిడ్ విధానంగా మార్చారు.
• ముందస్తు ఆదాయ వసూళ్లు
• బిల్లింగ్ లోపాల నివారణ
• ప్రత్యేక ప్రీపెయిడ్ అప్లికేషన్ ప్రారంభం
• ఆన్‌లైన్ చెల్లింపుల కోసం పేమెంట్ గేట్‌వే సమీకరణ
• Merchant ID (MID) సృష్టి
• సేవల యాక్టివేషన్ మరియు ధరల నిర్ణయానికి నిర్వచిత విధానాలు
• సమయానుకూల ఆదాయ వసూళ్లు, నిర్వహణాపరమైన ప్రమాదాల తగ్గింపు మరియు ఆర్థిక నిర్వహణ మెరుగుదలతో పారదర్శకమైన మరియు సమర్థవంతమైన ప్రీపెయిడ్ బిల్లింగ్ వ్యవస్థ ఏర్పడింది.
డ్రోన్ కార్పొరేషన్
• ఆంధ్రప్రదేశ్ ను డ్రోన్ కేపిటల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దాలన్న సీఎం చంద్రబాబు ఆశయం మేరకు పనిచేస్తున్నాం..
• 2024-29 కాలానికి డ్రోన్ పాలసీని తీసుకురావడంతో పాటు డ్రోన్ రంగంలో దాదాపు రూ. 1000 కోట్ల పెట్టుబడులును ఆకర్షించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం..
• అమరావతి కేంద్రంగా నిర్వహించిన డ్రోన్ సదస్సు… డ్రోన్ షో లు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులు, జాతీయ స్థాయిలో గుర్తింపుని తీసుకొచ్చింది..
• కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 300 ఎకరాల్లో దేశంలోనే మొదటి డ్రోన్ సిటీ ఏర్పాటు చేశాం. డ్రోన్ సిటీలో భూ కేటాయింపుల కోసం 14 పెట్టుబడి ప్రతిపాదనలను సిఫార్సు చేశారు.. డ్రోన్ సిటీ అభివృద్ధి కోసం 3 ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు (MoUs) కుదుర్చుకున్నారు.
• క్షేత్రస్థాయిలో వ్యవసాయం అనుబంధ రంగాల్లో డ్రోన్ల వినియోగం, ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం.. అదే సమయంలో పెద్ద ఎత్తున ప్రతి జిల్లాలో డ్రోన్ ఫైలెట్ల శిక్షణ కార్యక్రమాలు చేపట్టడానికి కృషి చేస్తున్నాం..
• ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 15 జూలై 2025న డిజిటల్ పోర్టల్ ప్రారంభమైంది. ఈ ప్రత్యేక ప్లాట్‌ఫారమ్‌లో దాదాపు 80 మంది డ్రోన్ విక్రేతలు భాగస్వామ్యమయ్యారు. వివిధ రంగాల కోసం 122 రకాల డ్రోన్ సేవా నమూనాలను (Use cases) రూపొందించారు.
అంతర్గత జల మార్గాలు
• రాష్ట్రంలో కృష్ణా, గోదావరి వంటి ముఖ్య నదులు, నదీ, సముద్ర తీర ప్రాంతాల మధ్య అనుసంధానం పెంచడం ద్వారా అంతర్గత జల మార్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం..
• తద్వారా కార్గో రవాణా, టూరిజం వంటి రంగాలు అభివృద్ధి చెందడంతో పాటురాష్ట్ర ఆర్ధికాభివృద్ధికి దోహదపడనుంది..
• విశాలమైన సముద్రతీరం.. సుధీర్ఘమైన నదీ పరివాహక ప్రాంతం, పలు అధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల నెలవైన ఆంధ్రప్రదేశ్ లో సీప్లేన్ సేవలను తీసుకొచ్చేందుకు ఇప్పటికే విజయవాడ– శ్రీశైలం మధ్య డెమో ట్రయిల్ రన్ కోసం.. నది లోతు, ప్రవాహ వేగాన్ని అంచనా వేస్తూ ‘బాతిమెట్రిక్ సర్వే’ పూర్తి చేశారు.
• నౌకల నమోదు మరియు నియంత్రణ : రాష్ట్రవ్యాప్తంగా ‘ఇన్‌ల్యాండ్ వెసెల్ యాక్ట్ 2021’ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ, దాదాపు 700 నీటి నౌకలకు వార్షిక సర్వేలు నిర్వహించి నమోదు చేశారు.
• కేంద్ర పోర్టల్‌తో అనుసంధానం: సురక్షిత ప్రయాణం మరియు సర్టిఫికేషన్ ప్రమాణాల కోసం రాష్ట్ర నౌకల డేటాను కేంద్ర ప్రభుత్వ ‘నావిక్’ (NAVIC) పోర్టల్‌తో అనుసంధానించారు.
• బోట్ మారథాన్ & సదస్సులు: జల రవాణా, పర్యాటక రంగాలలో పెట్టుబడులను ఆకర్షించడానికి విజయవాడ పున్నమి ఘాట్ వద్ద బోట్ మారథాన్ మరియు 2 ప్రతినిధుల (స్టేక్‌హోల్డర్స్) సమావేశాలను నిర్వహించాము.
• సీ ప్లేన్ రన్-వే సర్వే: కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజ్ వద్ద 09.11.2024 న సీ ప్లేన్ డెమో రన్ కోసం నది లోతు, ప్రవాహ వేగాన్ని అంచనా వేస్తూ ‘బాతిమెట్రిక్ సర్వే’ పూర్తి చేశారు.
• క్రూయిజ్ సేవల కొరకు సర్వే: గోదావరి నదిపై (గండిపోచమ్మ – పాపికొండలు) మరియు మైలవరం, గండికోట జలాశయాల వద్ద కమర్షియల్ క్రూయిజ్ (పర్యాటక పడవలు) నిర్వహణ సాధ్యసాధ్యాలపై హైడ్రోగ్రాఫిక్ సర్వేలు చేశారు.
• పోర్ట్ కనెక్టివిటీ ప్రాజెక్టులు: పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) పద్ధతిలో ముక్త్యాల–మచిలీపట్నం మరియు నిడదవోలు–కాకినాడ అనే రెండు ప్రాధాన్యత కలిగిన జలరవాణా కారిడార్ల అభివృద్ధిని ప్రారంభించారు.
• రీజినల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (RCoE): జల రవాణా రంగంలో నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలను పెంచేందుకు సిమ్యులేటర్లు మరియు ప్రాక్టికల్ శిక్షణా సదుపాయాలతో కూడిన ఒక ప్రాంతీయ కేంద్రాన్ని ప్రతిపాదించారు.
• వాటర్ మెట్రో ప్రాజెక్ట్: పర్యావరణహిత రవాణా కోసం విజయవాడ-అమరావతి మరియు విశాఖపట్నం అనే రెండు కీలక నగరాలలో అత్యాధునిక ‘వాటర్ మెట్రో’ వ్యవస్థల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
• కమ్యూనిటీ జెట్టీల అభివృద్ధి: జాతీయ జలమార్గం-4 (NW-4) పరిధిలోని గోదావరి, కృష్ణా నదులపై పట్టిసీమ, పోలవరం, రుద్రమకోట, పుట్లగూడెం వంటి 8 ప్రాంతాలలో కమ్యూనిటీ జెట్టీలను నిర్మిస్తున్నారు.
• బకింగ్‌హామ్ కెనాల్ పునరుద్ధరణ: రామాయపట్నం, కృష్ణపట్నం పోర్టులు మరియు జువ్వలదిన్నె హార్బర్‌లను అనుసంధానించడానికి 371 కిలోమీటర్ల మేర కెనాల్ సర్వే పూర్తి చేసి, కేంద్ర నిధుల కోసం ప్రతిపాదనలు పంపారు.
పెట్టుబడులు
• విశాఖ సీఐఐ సదస్సు & SIPB ద్వారా దాదాపు 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 24 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించగలగడం రాష్ట్ర చరిత్రలోనే సరికొత్త అధ్యాయనానికి నాంది పలికింది..
• ఏపీ మారిటైమ్ బోర్డుకు పెట్టుబడులకు సంబంధించి 27 ప్రతిపాదనలు, రూ.167 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.18 లక్షల ఉద్యోగాలు రానున్నాయి.
• ఏపీ ఎయిర్ పోర్టు డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా 13 ప్రతిపాదనలతో, రూ. 36 వేల కోట్ల పెట్టుబడులు, 1.91 లక్షల ఉద్యోగాలు రానున్నాయి..
• మొత్తం పెట్టుబడులు & మౌలిక సదుపాయాల శాఖకు సంబంధించి మొత్తంగా 40 ప్రతిపాదనలు, 2.03 లక్షల కోట్ల పెట్టుబడులు, 3.09 లక్షల ఉద్యోగాలు రానునాయి..
• కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రాన్ని గుంతల రహితంగా తీర్చిదిద్ది, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత కల్పించడం ద్వారా పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగింది..
• వైసీపీ అరాచకాలకు గతంలో పారిపోయిన కంపెనీలు నేడు చంద్రబాబు గారిపై నమ్మకంతో పరిగెత్తుకొస్తున్నాయి..
• 20 నెలల పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగుపడటం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బదులు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి విధానాలు,మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పనతో కూటమి ప్రభుత్వంపై పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగింది*
• నేడు చంద్రబాబుగారి నాయకత్వంలో ప్రపంచ స్థాయి పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ వేదికగా మారింది
• దేశంలో కనీసం 25 వ వంతు జనాభా లేని ఆంధ్రప్రదేశ్ నేడు దేశంలో 25% పెట్టుబడులు సాధించడం చంద్రబాబు కృషికి నిదర్శనం*
• రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నాం.. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీగా ఉన్న భూమి వనరులను వినియోగించుకుని, స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనలకు కృషి చేస్తున్నాం..











































