-
చింతామోహన్
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్
-
ఏపీలో డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరగలేదు
-
నీట్ ఎగ్జామ్ లాగా, పేపర్ లీక్ కాలేదు
డిఎస్సీపై ఉద్యమాలు చేస్తున్న నాయకులు వైఖరిని ఖండిస్తున్నాను
ఉద్యమాలు చేయాల్సింది అవినీతిపైన. మీరు అవినీతిపై ఉద్యమం ఆరంభిస్తే, మేమంతా మద్దతు ఇస్తాం
అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. అధికారం కోసం మళ్ళీ ఉద్యమాలు చేయాలా?
రాయలసీమ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన రెండు కుటుంబాలు ఒకటి చంద్రబాబు కుటుంబం, రెండోది వైఎస్సార్ కుటుంబం, ఈ రెండు కుటుంబాలు 30 ఏళ్లు ముఖ్యమంత్రి పదవులు అనుభవించింది
చంద్రబాబు నాయుడు 19 ఏళ్లు, వైఎస్ కుటుంబం 11 ఏళ్లు అధికారాన్ని చెలాయించి మన రాష్ట్రానికి ఏమి సాధించారు?
వేల కోట్ల రూపాయలు సంపాదించారు. మిలీనియర్లు, బిలీనియర్లు అయ్యారు
ఏపీ రాజకీయాల్లో సామాజిక న్యాయం జరగాలి. 20 శాతం ఉన్న కాపులు, బలిజలు ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి పదవి అనుభవించలేదు
రాజకీయ సమానత్వం, సామాజిక న్యాయ సాధన కోసం, నేను కృషి చేస్తున్నాను
ముద్రగడ పద్మనాభం గారు వంటి నిజాయితీ పరుడు కాపు సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి కావాలి
కాపులు, బలిజలు కాంగ్రెస్ పార్టీలోకి రండి. మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసేందుకు నా వంతు కృషి చేస్తాను
టిడిపిలో ఉంటే కాపులు ముఖ్యమంత్రి అవ్వరు. వైసిపి ఉంటే అసలే కాలేరు. ఒక్క కాంగ్రెస్ పార్టీ లో మీరు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ వుంది
దేశంలో నిశ్శబ్ద విప్లవం మొదలైంది. నిరుద్యోగుల్లో, విద్యార్థుల్లో, నిరుపేదల్లో అసంతృప్తి, ఆవేదన కనిపిస్తోంది
నెహ్రూ, ఇందిరా గాంధీ, మన్మోహన్ సింగ్ వంటి నాయకులు ప్రధానమంత్రులుగా మన దేశ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు
భారత రాజ్యాంగంలో పొందుపరచిన సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం బిజెపి పాలనలో అమలు కావడం లేదు
బిజెపి పాలనలో ఆర్థిక అసమానతలు పెరిగింది. దేశ సంపదను ప్రధాని మిత్రులు దోచుకుంటున్నారు
రాజ్యాంగాన్ని మార్చాలని బిజెపి కుట్ర చేస్తోంది. ఇందుకు ఎంపీలను కొంటున్నారు. ఢిల్లీలో విష పరిణామాలు జరుగుతోంది
చదువు లేని మోడీ గారు, భారత రాజ్యాంగాన్ని చదవలేరు
బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ల ప్రభుత్వం. కామన్ మ్యాన్ ప్రభుత్వం కాదు
2029లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం
ఈ విలేకరుల సమావేశంలో మాజీ డిసిసి అధ్యక్షులు గారా సూర్యారావు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు అబిదా పాల్గొన్నారు





















































