అమరావతిలో పర్యటించిన సింగపూర్ బృందం
ప్రజారాజధాని అమరావతిలో సింగపూర్ బృందం రెండు రోజులపాటు పర్యటించింది. పర్యటంలో తొలి రోజైన సోమవారం రాయపూడిలోని APCRDA కార్యాలయంలో అమరావతి ప్రాజెక్టు, మాస్టర్ ప్లాన్ తదితర అంశాలను సింగపూర్ బృందానికి APCRDA అధికారులు వివరించారు. రెండో రోజైన మంగళవారం సింగపూర్ బృందం శాఖమూరు పార్క్, ట్రంక్ ఇన్‌ఫ్రా రహదారులు, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో భాగంగా నిర్మిస్తున్న టవర్లు, బంగ్లాలు, MLA & MLC టవర్స్‌ను సందర్శించారు. సింగపూర్ బృందానికి APCRDA అధికారులు ఆయా ప్రాజెక్టుల పురోగతి, అమరావతిలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు.
సింగపూర్ ప్రతినిధుల బృందం:
నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి
యో సై హైప్
జో యిమిన్
ఎల్ దర్శన్
జయేష్ కుమార్
MTI నుంచి ఫ్రాన్సిస్ చాంగ్
SCE నుంచి టై లియాన్ చు
IFC నుంచి అనంత్ శంకర్
















































