HCM Singapore tour Day-1
- భారత్ దూసుకెళ్తున్న ఆర్ధిక శక్తి – ఏపీ కీలక చోదకశక్తిఆర్టీఐహెచ్‌లో ఆవిష్కరణలు, స్టార్టప్‌లకు వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులు
- ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల తయారీకి ఏపీ అనుకూలం
- సింగపూర్ పర్యటనలో వెంచర్ క్యాపిటలిస్టులతో సీఎం చంద్రబాబు సమావేశం
- భారత హై కమిషనర్ శిల్పక్ అంబులేతోనూ ముఖ్యమంత్రి భేటీ
VBYP Press Release English -Telugu
VBYP Press Release English -Telugu
సింగపూర్, జూన్ 15:
సంస్కరణలతో భారత్ దూసుకుపోతున్న ఆర్ధిక శక్తిగా మారిందని, ఇందులో ఆంధ్రప్రదేశ్ కీలక చోదక శక్తిగా ఎదుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. చైనా లాంటి దేశాలు ఆర్ధిక వృద్ధికి దశాబ్దాల కాలం పట్టిందని.. భారత్‌కు అంత సమయం అవసరం లేదని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఆధునిక ఆలోచనలు, సంస్కరణలతో భారత్‌ను అద్భుతమైన వేగంతో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. సింగపూర్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి తొలిరోజు సోమవారం వెంచర్ క్యాపిటలిస్టులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. మెడికల్ టెక్నాలజీ సహా ఆధునిక పరికరాల తయారీలో భారత్ ఇప్పుడు అగ్రస్థానంలో ఉందన్నారు. వివిధ రకాల ఎలక్ట్రానిక్స్ పరికరాలు ఇప్పుడు భారత్ నుంచి ఎగుమతి అవుతున్నాయని అన్నారు. డెమోగ్రాఫిక్ డివిడెండ్‌తో అతిపెద్ద యువశక్తి ఉన్న మానవ వనరుల దేశంగా భారత్ నిలిచిందన్నారు. భారత్ తయారీ రంగంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 5వ జనరేషన్ ఫైటర్ జెట్‌లు సహా వివిధ రక్షణ రంగ ఉత్పత్తులు తయారు చేసేలా ప్రాజెక్టులు ఏర్పాటు అవుతున్నాయని సీఎం వివరించారు. మెడికల్ టెక్నాలజీ, ఇతర ఆధునిక పరికరాల తయారీలో భారత్ అగ్రస్థానంలో ఉందన్నారు. తయారీ రంగాన్ని ప్రోత్సహించేలా ఆంధ్రప్రదేశ్‌లో వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ అనే విధానాన్ని అనుసరిస్తున్నామని సీఎం తెలియచేశారు. ఏపీకి అడ్వాన్స్ డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (AMCA), గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ లాంటి పరిశ్రమలకు వేగంగా అనుమతులు, భూములు కేటాయించామని ముఖ్యమంత్రి వారికి వివరించారు. ఏపీలో వివిధ పారిశ్రామిక ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ఇదే సరైన సమయం అని.. పెట్టుబడిదారులు ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. శ్రీసిటీ లాంటి ప్రత్యేక పారిశ్రామికవాడలు పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని అన్నారు. ఏపీలో పౌరసేవలతో పాటు అన్ని అంశాలకూ టెక్నాలజీని అనుసంధానించాం అన్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా పెట్టుబడులకు ఆస్కారం ఉందన్నారు. వెంచర్ క్యాపిటలిస్టులు ఆర్టీఐహెచ్ ప్రోత్సహించిన స్టార్టప్‌లకు పెట్టుబడులు అందించే అవకాశం ఉందన్నారు. అత్యుత్తమ ఆవిష్కరణల్ని పోత్సహించేందుకు వెంచర్ కాపిటలిస్టులు ముందుకు రావాలని కోరుతున్నానని సీఎం అన్నారు. ఈ సమావేశానికి ఆరిజన్ వెంచర్స్, ఆటోమోనిక్స్, ఏలెవ్ 8 వెంచర్స్, ఆప్టిమమ్ సొల్యూషన్స్, క్వోనా కాపిటల్, జంగిల్ వెంచర్స్ తదితర వెంచర్ క్యాపిటల్ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.
షిప్ బిల్డింగ్ పరిశ్రమకు ఏపీ అనుకూలం
తొలిరోజు పర్యటనలో ముందుగా… సింగపూర్‌లోని భారత హై కమిషనర్ శిల్పక్ అంబులే ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. భారత్‌లో సింగపూర్‌కు ఉన్న ఆర్ధిక, వాణిజ్య ఒప్పందాలను ముఖ్యమంత్రికి వివరించారు. ఏపీ అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్ కీలక భాగస్వామి కావాలని సీఎం స్పష్టం చేశారు. సింగపూర్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలని సీఎం కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, క్వాంటం టెక్నాలజీ సహా వివిధ రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని సీఎం వివరించారు. ఏపీలో కొత్తగా అందుబాటులోకి పోర్టులు అందుబాటులోకి వస్తున్నందున షిప్ బిల్డింగ్, సివిల్ ఏవియేషన్, మెయింటెనెన్సు, రిపేర్స్ ఓవర్ హాలింగ్ కేంద్రాలకు నెలకొల్పేందుకు అవకాశం ఉందని తెలిపారు. ఏపీలో హార్టికల్చర్ ఉత్పత్తుల ట్రేసింగ్, సర్టిఫికేషన్‌కు వెళ్తున్నామని సీఎం వివరించారు. రోబోటిక్స్, మెడికల్ డివైజెస్, హార్డ్ వేర్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో సింగపూర్ సహకారం కోరుతున్నామని అన్నారు. సింగపూర్-ఏపీ విద్య సంస్థల మధ్య భాగస్వామ్యం ఏర్పాటుకు కృషి చేయాలని సీఎం కోరారు. ఈ సమావేశానికి మంత్రి పి.నారాయణ, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, ఈడీబీ సీఈఓ షన్మోహన్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్ తదితరులు హాజరయ్యారు.
Meeting-4
సింగపూర్‌కు చెందిన వివిధ ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశాలు.
ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆయా సంస్థల ప్రతినిధులకు వివరించిన ముఖ్యమంత్రి.
తొలిరోజు పర్యటనలో భాగంగా YCH లాజిస్టిక్స్ గ్రూప్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ సునీల్ నంబియార్‌తో సీఎం చంద్రబాబు భేటీ.
సప్లై చైన్, లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుపై YCH గ్రూప్‌తో చర్చలు.
ఆటోమేటెడ్, అత్యాధునిక సాంకేతికతతో కూడిన భారీ సప్లై చైన్ సిటీని ఏపీలో నిర్మించే అంశంపై చర్చ.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…
• ఏపీకి 1,000 కి.మీ సుదీర్ఘ సముద్ర తీరం ఉంది. లాజిస్టిక్స్ పరంగా అనేక అనుకూలతలు ఉన్నాయి.
• హైవేలు, పోర్టులు, ఎయిర్ పోర్టులు, రైల్వే కనెక్టవిటీ ఉంది. లాజిస్టిక్స్ వ్యయం తగ్గించేందుకు ప్రణాళికతో పనిచేస్తున్నాం.
• హార్టికల్చర్‌పై 1 లక్ష కోట్లు ఇవ్వెస్ట్ చేయబోతున్నాం. ఆక్వాకల్చర్‌లో నెంబర్ 1గా ఉన్నాం.
• ఆహార ఉత్పత్తులకు వాల్యూఎడిషన్ ద్వారా ఎగుమతులకు ప్రయత్నం చేస్తున్నాం.
• ఏపీలో అపార అవకాశాలున్నాయి… ప్రొడక్షన్ లో కూడా పెట్టుబడులు పెట్టవచ్చు.
• ఏపీని సందర్శించండి… రాష్ట్రంలో ఉన్న పాలసీలు, అనుకూలతలు చూసి పెట్టుబడులు పెట్టండి.





























































