-
అమరావతిలో ఘనంగా జాతీయ సరస్ మేళా-2026 ప్రారంభం**
**మహిళలు కేవలం ‘లక్ పతీ దీది’లుగా కాకుండా ‘కరోడ్ పతీ దీది’లుగా ఎదగాలి: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
SARAS – Sale of Articles of Rural Artisans Society
**అమరావతి / విజయవాడ:** విజయవాడలో కనకదుర్గమ్మ సన్నిధిలో, దేవీ శరన్నవరాత్రుల వేళ జాతీయ సరస్ మేళా-2026 ను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ఢిల్లీ వెలుపల తొలిసారిగా స్వయం సహాయ సంఘాల (SHG) జాతీయ సరస్ మేళాను ప్రారంభించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖను ఆమె అభినందించారు. దేశవ్యాప్తంగా ఎస్.హెచ్.జి. మహిళలు పాల్గొంటున్న ఈ మేళాను విజయవాడలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరియు గవర్నర్ శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్ లకు ఆమె ప్రత్యేక అభినందనలు తెలిపారు.
విజయవాడలో జరిగిన ఈ జాతీయ సరస్ మేళా-2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు, రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్, కేంద్రమంత్రులు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రపతి ప్రసంగం:
మహిళా సాధికారతకు పెద్దపీట: గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా చర్యలు చేపట్టారని, ఎస్.హెచ్.జి. మహిళలు సాంకేతికంగా, ఆర్థికాంశాల్లో పెద్ద ఎత్తున భాగస్వామ్యం వహిస్తున్నారని రాష్ట్రపతి కొనియాడారు. దేశవ్యాప్తంగా చేపట్టిన చర్యల వల్ల ఎస్.హెచ్.జి.ల ఆర్థిక స్థితిగతులు మారాయని, మహిళల్లో మరింత చైతన్యం పెరిగిందని తెలిపారు.
కరోడ్ పతీ దీదిలుగా ఎదగాలి:
మహిళలను ఇకపై ‘లక్ పతీ దీది’లుగా మాత్రమే కాకుండా ‘కరోడ్ పతీ దీది’లుగా మార్చాలని ఆమె ఆకాంక్షించారు. దేశాన్ని ముందుకు నడిపేలా ‘లక్ పతీ దీది’ కార్యక్రమం పెద్ద ఎత్తున తోడ్పడుతోందని, గ్రామీణ మహిళలు తమ ఆదాయాన్ని పెంచుకునేలా ఈ స్వయం సహాయ సంఘాలు సహకారం అందిస్తున్నాయని పేర్కొన్నారు.
తెలుగు భాషపై ఆసక్తి:
ఏపీ ఒడిశా రాష్ట్రానికి పక్కనే ఉన్నప్పటికీ తాను తెలుగు భాషలో మాట్లాడలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసిన రాష్ట్రపతి, త్వరలోనే తెలుగు భాషను కూడా నేర్చుకుని మీతో మాట్లాడేందుకు వస్తానని హామీ ఇచ్చారు.
మౌలిక వసతులు, వ్యవస్థల్లో మార్పులు:
మహిళలకు మరిన్ని వనరులు అందేలా ప్రభుత్వాలు చూడాలని, గ్రామీణ అజీవికా మిషన్ ద్వారా మహిళలు నేతృత్వం వహించే మరిన్ని సంస్థలు ప్రారంభం కావాలని కోరారు. మధ్యవర్తుల వ్యవస్థను తొలగించేలా అన్ని వ్యవస్థలూ మార్పులు తీసుకురావాలని, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా రైతులు స్వయం సాధికారత సాధించేలా తోడ్పాటు అందించాలని సూచించారు.
డిజిటల్ అవగాహన ,మార్కెటింగ్:** డిజిటల్ మాధ్యమాలు, విధానాలపై గ్రామీణ మహిళలకు మరింత అవగాహన కల్పించాలని పేర్కొంటూ.. సరస్ లాంటి మేళాల ద్వారా బ్రాండింగ్, ప్యాకింగ్, నెట్వర్కింగ్ లాంటి విధానాలపై అవగాహన కలుగుతుందని వివరించారు.
దేశ సంస్కృతికి ప్రతీక ఏపీ:
దేశ సంస్కృతిని మరింత ముందుకు తీసుకువెళ్లటంలో ఏపీ ముందు ఉందని రాష్ట్రపతి ప్రశంసించారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి భగవాన్ విష్ణువు మరో రూపమని, అమరావతిలోని శిల్పకళా చాతుర్యం కూడా ఏపీ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతి రూపమని తెలిపారు.
మహిళలదే భవిష్యత్తు:
మన దేశంలో మహిళా శక్తిని పూజిస్తామని, మహిళలు-పురుషులు కలిసి పనిచేస్తేనే దేశం అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. అన్ని రంగాల్లోనూ మహిళలు దూసుకుపోతున్నారని, వికసిత్ భారత్ గా దేశాన్ని తీర్చిదిద్దటంలో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాలని ఆకాంక్షిస్తూ విజయవాడలో ఏర్పాటు చేసిన జాతీయ సరస్ మేళా-2026 తన లక్ష్యాలను పూర్తిగా సాధించాలని ఆమె ఆకాంక్షించారు.
Grand Inauguration of National SARAS Mela-2026 in Amaravati
**Women should aspire to become not just ‘Lakhpati Didis’ (earning in lakhs), but ‘Crorepati Didis’ (earning in crores): President Droupadi Murmu**
**Amaravati / Vijayawada:** The Honorable President of India, Smt. Droupadi Murmu, commended the organization of the National SARAS Mela-2026 in Vijayawada—near the abode of Goddess Kanaka Durga—coinciding with the auspicious ‘Devi Sharannavaratri’ festival. She lauded the Union Ministry of Rural Development for hosting this National SARAS Mela for Self-Help Groups (SHGs) outside of Delhi for the first time. She also extended special appreciation to Chief Minister Shri Nara Chandrababu Naidu and Governor Shri S. Abdul Nazeer for facilitating this event, which sees the participation of SHG women from across the country.
The inauguration ceremony of the National SARAS Mela-2026 in Vijayawada was attended by the President, Andhra Pradesh Chief Minister Shri Chandrababu Naidu, Governor Shri S. Abdul Nazeer, and Union Ministers Shri Shivraj Singh Chouhan, Shri Kinjarapu Rammohan Naidu, and Dr. Pemmasani Chandra Sekhar, among others.
**President’s Address:**
**Prioritizing Women’s Empowerment:** The President noted that Prime Minister Narendra Modi has taken specific initiatives to ensure the economic empowerment of women in rural areas, particularly through Self-Help Groups (SHGs). The President commended the significant participation of women in technical and economic spheres. She noted that initiatives undertaken across the country have transformed the financial status of Self-Help Groups (SHGs) and fostered greater awareness and empowerment among women.
**Aspiring for ‘Crorepati Didis’:**
The President expressed a vision for women to evolve beyond being ‘Lakhpati Didis’ (women earning an annual income of at least one lakh rupees) to becoming ‘Crorepati Didis’. She highlighted that the ‘Lakhpati Didi’ program is playing a major role in driving the nation forward, with Self-Help Groups providing the necessary support for rural women to increase their incomes.
**Interest in the Telugu Language:**
Expressing regret that she is unable to speak Telugu—despite Andhra Pradesh being a neighbor to her home state of Odisha—the President promised to learn the language and return to interact with the people in Telugu.
**Infrastructure and Systemic Changes:**
The President urged governments to ensure that women have access to more resources and called for the establishment of more women-led organizations under the ‘Rural Livelihood Mission’. She suggested implementing systemic changes to eliminate intermediaries and emphasized the need to support women farmers in rural areas toward achieving self-empowerment.
**Digital Literacy and Marketing:**
Stressing the importance of enhancing rural women’s understanding of digital platforms and related policies, she explained that events like the ‘SARAS’ fair provide valuable insights into branding, packaging, and networking. Andhra Pradesh: A Symbol of the Nation’s Culture
The President praised Andhra Pradesh for its leading role in advancing the nation’s culture. She noted that Lord Sri Venkateswara of Tirumala is a manifestation of Lord Vishnu, and that the sculptural artistry found in Amaravati serves as a true reflection of the state’s cultural heritage and traditions.
The Future Belongs to Women
Highlighting that our nation reveres the power of women (*Shakti*), the President stated that the country can only achieve progress when men and women work together. Observing that women are excelling across all sectors, she expressed her hope that their participation in shaping a ‘Vikasit Bharat’ (Developed India) will continue to grow. She further wished for the ‘National Saras Mela-2026,’ organized in Vijayawada, to fully realize its objectives.





































































