విజయవాడ కార్పొరేషన్ స్వతంత్ర మేయర్ ఆభ్యర్థి గా ఎబి. వెంకిటేశ్వరరావు

వామపక్షాలు, ప్రజాసంఘాలు బలపరిచిన స్వతంత్ర మేయర్ ఆభ్యర్థి ఎబి. వెంకిటేశ్వరరావు ఇండియా బ్లాక్ పార్టీ ల కార్పొరేటర్ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆయన రిటైర్మెంట్ తరువాత ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజా సమస్యలపై తన వాణిని బలంగా వినిపించి, పరిష్కార దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు.
విజయవాడ నగరంలోని శ్రీ రామా ఫంక్షన్ హాల్ ల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఇండియా బ్లాక్ పార్టీ ల నాయకులు, పౌర సంఘాల ప్రతినిధులు పాల్గొని ఎబి. వెంకటేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ, ఎబి. వెంకటేశ్వరరావు మేయర్ గా, ఇండియా బ్లాక్ కార్పొరేటర్ ల ను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.. ఎబి. వెంజటేశ్వరావు లాంటి ధైర్యం, నిజాయతి, నిబద్దత, ప్రశ్నించగల నాయకుడు విజయవాడ నగరానికి అవసరమని కాంగ్రెస్, వామపక్షాలు, ప్రజాసంఘాల నాయకులు తెలిపారు. అయన విజయం కోసం కృషిచేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్బంగా మేయర్ అభ్యర్థి ఎబి. వెంకిటేశ్వరరావు మాట్లాడుతూ..
విజయవాడ ప్రజల సమస్యలు ఈ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేదన్నారు. విజయవాడ నగర ఎన్నికలు జరిగితే వచ్చే నిధుల పైనా ఉన్న ఆసక్తి నగరంలో సమస్య ల పరిష్కారం ఫై లేదని ఆరోపించారు. ఇన్నేళ్లుగా విజయవాడ నగరానికి ఈ ముఖ్యమంత్రి చేసిందేమిటో చెప్పాలని ప్రశ్నించారు. వైసీపీ జగన్ ప్రతిపక్ష హోదా లేకున్నా కనీసం ప్రజా సమస్యల ఫై పోరాడే పరిస్థితి లేదన్నారు. రెండు పార్టీ ల నాయకులు కలిసి దోచుకుంటున్నారన్నారు. విజయవాడ లో పేదల ఆస్తులు కబ్జాలకు గురైతే ఎవరికి చెప్పుకోవాలో తెలియటంలేదని, తాను మేయర్ అయితే పేదల పక్షాన కబ్జాలను అడ్డుకుంతమన్నారు.
ఎన్నికలకు కనీస సమయం కూడా లేకుండా 8 రోజుల్లో ముగించి కొత్తవారికి అవకాశం లేకుండా కుట్ర చేసారన్నారు. ఈ వ్యవహారం ఫై జగన్ నోరు మెదపకపోవటం పై విమర్శించారు. గత ప్రభుత్వం నామినేషన్ లు వేయనివ్వలేదని ప్రజలు టీడీపీ కూటమికి అవకాశం ఇస్తే కూటమి కూడా అదే తరహా లో వ్యవహారిస్తే ప్రజలు తగిన బుద్ది చెప్తారన్నారు.
ఎన్నికల కమిషన్ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇలానే ఉందన్నారు. నీ దుర్మార్గం నిన్ను కబలిస్తుందని చంద్రబాబు ను విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని,
జరిగే అన్యాయాయాన్ని తట్టుకోలేక సీనియర్ లు బయటకు వస్తున్నారని అన్నారు. నగర ప్రజల సమస్యలు పరిష్కారిస్తానని, విజయవాడ నగర ప్రజలకు మాటిస్తున్నా అన్నారు.
నగరాన్ని నిలబెట్టే భాద్యత తీసుకుంటానన్నారు. హైద్రాబాద్ కట్టాను, హైటెక్ సిటీ కట్టానని చెప్పుకునే చంద్రబాబు విజయవాడ కు ఏమిచేసారని ప్రశ్నించారు. తిరుపతి, వైజాగ్ లాంటి నగరాలకు కోట్లు ఖర్చుపెట్టిన ప్రభుత్వం విజయవాడ ఏమి పాపం చేసిందన్నారు. విజయవాడ కు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తాఅన్నారు. విజయవాడ ప్రజలకు రాష్ట్ర విభజన తరువాత 2015 లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కి 500 కోట్లు కేటాయిస్తే ..నిధులు ఎటుపోయాయో సమాధానం లేదన్నారు.స్టేట్ గవర్నమెంట్ మింగేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిధులు రాబట్టాలన్నారు. విజయవాడ డబ్బులు కొట్టేసిన నువ్వు విజయవాడ లో ఎలా అడుగుపెడతావన్నారు. విజయవాడ పైన పడి దౌర్జన్యం చేసి అధికారులు దోచుకున్నారన్నారు. విజయవాడ చిన్న , పెద్ద వ్యాపారులకు అండగా ఉంటామన్నారు. అధికార పార్టీ కార్యకర్తలు చేసే దుర్మార్గన్ని నిలబెట్టి నిలదీస్తానని, ఆ దమ్ము ధైర్యం నాకు ఉన్నాయన్నారు. కూటమి ఎమ్మెల్యే లు, మాజీ లు కలిసి దోచుకుంటున్నారన్నారు. కబ్జాదారుల నుంచి బాధితులని కాపాడతానన్నారు. పేదల కాలనీ లను సుందరంగా తయారు చేస్తామని, ఆక్రమణలను తొలగించి,పేదలకు ఉపాధి కి అనువైన సెంటర్స్ గా తయారు చేస్టమన్నారు. బెజవాడ ఎయిర్పోర్ట్ ను మూసేసే కుట్ర జరుగుతొందని, దీనిపై విజయవాడ పౌరులు పోరాడి అడ్డుకోవాలన్నారు..
జగన్ ఫిష్ కాంటీన్ పెడితే బాబు బెజవాడ ఎయిర్పోర్ట్ ను చేపల ఎగుమతికి కార్గో కు వాడతారని చెప్తున్నారన్నారు. డబ్బు రాజకీయాలు చేయనన్నారు. మేయర్ గా గెలిపిస్తే రూపాయి కూడా ప్రజాదనం అవినీతి జరుగనివ్వనన్నారు. బుడమేరు ముంపు బాధితులకు 600 కోట్లు విరాళాలు రాష్ట్ర ప్రజలు ఇస్తే ఏమి చేసారో చెప్పలేదన్నారు. బుడమేరు సమస్య ఇప్పటికి ఉందన్నారు.
స్వతంత్రత , ధైర్యం, వెన్నెముఖ ఉన్న నాయకత్వం ప్రజలకు కావాలన్నారు. తమని గెలిపిస్తే విలువ ఆధారిత పన్ను15% పెంచే పన్ను పద్దతి ఆపేస్తామన్నారు.కూటమి అభ్యర్థి వంగవీటి రాధ తో తనకు గత 15 ఏళ్లుగా పరిచయం ఉండన్నారు. మా మధ్య స్నేహం ఉందని, అందుకే రాదాను వ్యక్తి గతంగా విమర్శించనని, రాధ కూడా తన గురించి వ్యక్తిగతంగా మాట్లాడడని,ఇది రాజకీయ పోరాటం అని, వ్యక్తి గత పోరాటం కాదన్నారు.
తమది డీజే రహిత, శబ్ద రహిత కాంపెయిన్ అన్నారు.
నగర ప్రజలకు ప్రశాంత వతావరణం లో ప్రచారం చేస్తామన్నారు. సెల్ ఫోనే ఆయుధమని, మేధస్సే యుద్ధ క్షేత్రం అని అన్నారు. సెల్ ఫోన్ ద్వారా ప్రచారం. ఈ ఎన్నిక బెజవాడ కు బతుకు సమరమని,
ప్రత్యామ్నాయంగా ఇండియా బ్లాక్ పార్టీ ల కార్పొరేటర్ అభ్యర్థులు, మేయర్ ను ఎన్నుకునే గొప్ప అవకాశం విజయవాడ ప్రజల అదృష్టమని ఏ.బి. వెంకటేశ్వరరావు తెలిపారు. విజయవాడ ప్రజలు దమ్మున్న నాయకత్వాన్ని ఎన్నుకునే అవకాశం అన్నారు.
విజయవాడ నగరానికి నాయకత్వం వహించటం గొప్పగా భావిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ మంత్రి వద్దే శోభన్నాదీస్వరావు, సిపిఎం నాయకులు బాబురావు, సిపిఐ నాయకులు ఈశ్వరయ్య, కాంగ్రెస్ నాయకులు, ప్రజలు సంఘాల నాయకులు, ప్రతినిధులు విచ్చేసి ఎబి వెంకటేశ్వరరావు కు,ఇండియా బ్లాక్ కార్పొరేటర్ అభ్యర్థులను అభినందించి తమ మద్దతు తెలిపారు.
ప్రొఫైల్ : ఏ.బి. వెంకటేశ్వరరావు, ఐ.పి.ఎస్. (రిటైర్డ్), 1989 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్ అధికారి, విద్యార్హతలు: ఎం.టెక్ (IIT) , ఎకనామిక్స్ లో పీజీ.
నిర్వహించిన ముఖ్యమైన బాధ్యతలు:
* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ , విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ కీలక పోలీస్ శాఖా హోదాల్లో సుదీర్ఘకాలం సేవలు అందించారు.
* గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల ఎస్పీగా (SP), విజయవాడ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించారు.
* రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్గా (Additional DGP – Intelligence) అత్యంత కీలకమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు.
* యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) డైరెక్టర్ జనరల్ (DG) గా కూడా సేవలందించారు.
పురస్కారాలు & గుర్తింపు:
* విశిష్ట సేవలకై రాష్ట్రపతి పోలీస్ పతకం (**President’s Police Medal for Distinguished Service** – 2014)
* ప్రతిభావంతమైన సేవలకై ఇండియన్ పోలీస్ పతకం (**Indian Police Medal for Meritorious Service** – 2006)
* పోలీస్ అంత్రిక్ సురక్ష సేవా పతకం (2004) సహా పలు జాతీయ పతకాలను అందుకున్నారు.
ఇతర విశేషాలు:
* సుదీర్ఘకాలం పాటు ఉత్కృష్టమైన పోలీసు సేవలను అందించిన ఆయన, మే 2024లో సర్వీసు నుంచి పదవీ విరమణ పొందారు.
AB Venkateswara Rao as Independent Mayoral Candidate for Vijayawada Corporation
- Supported by Congress, Left Parties, and Civil Society Organizations
Rajadhani Vartalu, Vijayawada:
AB Venkateswara Rao, an independent mayoral candidate for the Vijayawada Corporation elections—backed by the Congress, Left parties, and various civil society organizations—held a cordial meeting to rally support for the ‘INDIA bloc’ coalition’s corporator candidates. Since his retirement, he has entered public life, becoming a strong voice for the issues faced by the people of Andhra Pradesh and exerting pressure on the government to find solutions.
The event, held at Sri Rama Function Hall in Vijayawada, was attended by leaders from the ‘INDIA bloc’ parties and representatives of civil society organizations. They urged the public to ensure the victory of AB Venkateswara Rao as Mayor, along with the ‘INDIA bloc’ candidates for corporator positions. Leaders from the Congress, Left parties, and civil society groups emphasized that Vijayawada needs a leader like AB Venkateswara Rao—someone characterized by courage, honesty, commitment, and the willingness to question authority. They pledged to work toward his electoral success.
Speaking on the occasion, mayoral candidate AB Venkateswara Rao remarked: that there is no evidence to suggest that the current government has taken any notice of the problems faced by the people of Vijayawada. It was alleged that there is more interest in the funds that would flow following the Vijayawada city elections than in actually resolving the city’s problems. A question was raised as to what the current Chief Minister has actually done for Vijayawada over all these years. It was noted that the YSRCP, led by Jagan, is failing to even advocate for the public’s concerns, despite its role as the opposition. It was further claimed that leaders from both parties are colluding to exploit the city. People whose properties—specifically those belonging to the poor—have been seized or encroached upon do not know whom to turn to; it was promised that if elected Mayor, they would stand by the poor and put an end to such land grabbing.
Criticism was leveled at the fact that the entire election process was compressed into just eight days—leaving no reasonable time for the exercise—which appears to be a calculated conspiracy to prevent new candidates from participating. Jagan was also criticized for remaining silent on this entire affair. It was pointed out that if the current alliance—which came to power after the previous government prevented the filing of nominations—resorts to the same tactics, the public will surely teach them a fitting lesson.
The state of the Election Commission was described as dire, with the suggestion that the Election Commission of India is in a similarly poor condition. Chandrababu Naidu was criticized, with the warning that his own wickedness would eventually consume him. It was stated that senior figures are now speaking out, unable to remain silent in the face of such injustice, and that it is essential to protect democracy. A pledge was made to the people of Vijayawada to resolve their grievances.
A commitment was made to take responsibility for the city’s development. Chandrababu Naidu, who often boasts about building Hyderabad and Hitech City, was challenged to explain what he has actually done for Vijayawada. The government has spent crores on cities like Tirupati and Vizag; what did Vijayawada do to deserve such neglect? I will question the injustice done to Vijayawada. After the state bifurcation, 500 crore rupees were allocated for an underground drainage system in 2015—where did those funds go? There has been no answer.
The funds meant for the underground drainage system, which the state government has siphoned off, must be recovered. How can you even set foot in Vijayawada after stealing its funds? Officials have acted high-handedly and plundered the city. We will stand by the small and large business owners of Vijayawada. I have the courage and the guts to confront the misdeeds of the ruling party’s workers. MLAs and former MLAs from the alliance are colluding to loot the city. I will protect the victims from land grabbers. We will beautify the neighborhoods where the poor reside, remove illegal encroachments, and transform these areas into hubs that provide livelihood opportunities for the underprivileged. There is a conspiracy to shut down the Vijayawada (Bezawada) Airport; the citizens of Vijayawada must fight and prevent this.
While Jagan talks about setting up ‘fish canteens,’ it is being suggested that ‘Babu’ (Chandrababu Naidu) intends to use the Vijayawada Airport as a cargo hub for exporting fish. I will not engage in ‘money politics.’ If elected as Mayor, I will ensure that not a single rupee of public money is lost to corruption. He questioned what was done with the ₹600 crore in donations contributed by the people of the state for the victims of the Budameru floods, noting that the Budameru issue remains unresolved to this day.
He emphasized that the people need a leadership characterized by independence, courage, and a strong backbone. He promised that if elected, they would abolish the 15% value-added tax (VAT) system. He mentioned that he has known the alliance candidate, Vangaveeti Radha, for the past 15 years. He stated that because of their friendship, he would not make personal criticisms against Radha, and that Radha, in turn, would not speak about him personally. He clarified that this is a political contest, not a personal vendetta.
He described their campaign as “DJ-free” and “noise-free.”
He assured that they would conduct their campaign in a peaceful environment for the city’s residents. He remarked that the mobile phone is their weapon, and the intellect is the battlefield—with the campaign being driven through mobile phones. He framed this election as a “battle for survival” for Vijayawada (Bejawada).
A.B. Venkateswara Rao stated that the people of Vijayawada have a great opportunity—and are fortunate—to elect corporator candidates from the INDIA bloc parties and me as an independent Mayor as a viable alternative. He added that the people of Vijayawada now have the chance to choose a leadership with real mettle.
He expressed that he considers it a great honor to provide leadership to the city of Vijayawada.
At this event, former minister Vadde Sobhanadreeswara Rao, CPM leader Babu Rao, CPI leader Eswaraiah, along with Congress leaders, representatives of various public organizations, and others, were present. They congratulated A. B. Venkateswara Rao and the ‘INDIA’ bloc’s corporator candidates, extending their support to them.
Profile: A. B. Venkateswara Rao, IPS (Retired)
Full Name: Apparbo Bhattacharya Venkateswara Rao
1989-batch IPS officer, Andhra Pradesh cadre
Educational Qualifications: M.Tech (IIT), Postgraduate degree in Economics
- Key Responsibilities Held:
* Served for a long tenure in various crucial positions within the Police Department, both in undivided Andhra Pradesh and the reorganized state of Andhra Pradesh.
* Held the positions of Superintendent of Police (SP) for Guntur and West Godavari districts, and served as the Commissioner of Police for Vijayawada.
* Effectively discharged critical responsibilities as the State Intelligence Chief (Additional DGP – Intelligence).
* Also served as the Director General (DG) of the Anti-Corruption Bureau (ACB).
Awards & Recognition:
- * President’s Police Medal for Distinguished Service (2014)
- * Indian Police Medal for Meritorious Service (2006)
- * Recipient of several national-level medals, including the Police Antrik Suraksha Seva Padak (2004).
* After a long and distinguished career in the police service, he retired from service in May 2024.






















































