అమరావతి
రాష్ట్ర సచివాలయంలో కొనసాగుతున్న రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్.
ఫైళ్ల క్లియరెన్స్, అవేర్, డేటా లేక్ వంటి అంశాలపై సమీక్ష
ఇ-ఫైళ్ల క్లియరెన్స్ రోజుల వ్యవధి నుంచి గంటల వ్యవధిలోకి రావడం సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు.
ఇ-ఫైళ్ల క్లియరెన్స్ లో వేగంగా ఉన్న మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, సెక్రటరీలకు సీఎం అభినందనలు.
పెద్దమొత్తంలో ఫైళ్లు వచ్చినా సరాసరి 10 గంటల వ్యవధిలో ఫైళ్లను డిస్పోజ్ చేసిన సీఎస్ సాయి ప్రసాద్ కు ముఖ్యమంత్రి అభినందనలు.
ఫైళ్ల క్లియరెన్స్ లో వెనుకబడిన పలువురు కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లకు వేగం పెంచాలని సూచనలు.
గత మూడు నెలలతో పోల్చుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఫైళ్ల క్లియరెన్స్ సమయం 10 రోజుల నుంచి రెండు రోజులకు తగ్గిందని చెప్పిన ఐటీ సెక్రటరీ.
కలెక్టర్ల సదస్సుల్లో స్వయంగా సీఎం పర్యవేక్షణతో ఫైళ్ల డిస్పోజల్లో కనిపించిన స్పష్టమైన మార్పు.
========================================================================
అమరావతి
రాష్ట్ర సచివాలయంలో కొనసాగుతున్న జిల్లా కలెక్టర్ల సమావేశం.
అవేర్ సహా వాట్సప్ గవర్నెన్సు వినియోగంపై కలెక్టర్లకు సీఎం సూచనలు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…
• ప్రభుత్వ నిబంధనలు, ప్రొసీజర్స్ సులభతరం కావాలి
• కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటే ఎంత టైమ్ వృధా అవుతుందో ఆలోచించండి.
• ప్రజలకు త్వరితగతిన సేవలు అందిస్తూ.. ఆన్ లైన్ సేవలను పూర్తిగా అందుబాటులోకి తెస్తే ప్రజల సమయం వృధా కాదు.
• టెక్నాలజీ ఇంటిగ్రేషన్ జరిగితే… పాలన సులభతరం అవుతుంది.
• వాట్సప్ గవర్నెన్సు మనమిత్ర ద్వారా పౌరసేవలపై ప్రజలకు శిక్షణ ఇస్తున్నాం.
• ఇప్పటికే 29 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చాం… 90 శాతం ప్రభుత్వ సేవలు వాట్సప్ లో అందుబాటులో ఉన్నాయి.
• డిసెంబరు నాటికి అన్ని సేవల్ని వాట్సప్ లో అందించేలా చూడాలి.
• మాన్యువల్ టచ్ పాయింట్ల వద్దకు వచ్చే ప్రజలకు వాట్సప్ వినియోగాన్ని వివరించాలి.
• స్మార్ట్ ఫోన్లు లేని కుటుంబాలు 34 శాతంగా ఉన్నాయి.
• ఆన్ లైన్ సేవల ద్వారా అవినీతితో పాటు దుర్వినియోగం కూడా తగ్గుతుంది.
• అవేర్ 2.0 నుంచి వచ్చే సమాచారాన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ నిర్ణయాలు తీసుకోవాలి
• పిడుగుల హెచ్చరికలను జారీ చేయటంలో ఇంకా పర్ఫెక్షన్ రావాలి.
• తుపాన్ల హెచ్చరికల సమయంలో నేరుగా మొబైళ్లకే మెసేజిలు పంపించాలి.
• తుపాన్ల హెచ్చరికలను స్వర్ణ గ్రామ,వార్డుల ద్వారా కూడా పంపించాలి.
• సీవీడ్ సాగుపై తీరప్రాంత జిల్లాల కలెక్టర్లు దృష్టి పెట్టాలి.
• అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల్లో అక్రమ కట్టడాలపై దృష్టి పెట్టాలి.
• మున్సిపాలిటీలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఎలాంటి అక్రమ నిర్మా్ణాలూ లేకుండా చూడాలి
=======================================================================
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…
- ఫైళ్లను త్వరగా క్లియర్ చేస్తే ప్రభుత్వ సేవలు మరింత త్వరగా అందుతాయి.
- స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సులో ఫైళ్ల క్లియరెన్స్ అనేది అతి ముఖ్యమైన అంశం.
- సీఎస్, సెక్రటరీలు, హెచ్వోడీలు మొదలుకుని.. మండల స్థాయి వరకు ఫైళ్ల క్లియరెన్సులో వేగం పెరగాలి.
- మ్యానువల్ ఫైళ్లనేవి దాదాపు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
- పాలనకు టెక్నాలజీ అనుసంధానించడంతోపాటు… హ్యుమన్ టచ్ కూడా ముఖ్యం.
- 24 గంటల్లోపు ఇ-ఫైల్స్ డిస్పోజ్ చేసేలా మంత్రులు, అధికారులు శ్రద్ధ పెట్టాలి.
- ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో అందరి పనితీరును ఎప్పటికప్పుడు నమోదు చేస్తూనే ఉన్నాం.
- జిల్లాల్లో ఇ-ఆఫీస్ ద్వారా లేని ఫైల్స్ ఎన్ని ఉన్నాయో గుర్తించండి.
- జిల్లా స్థాయిలో, హెచ్ఓడీలు తప్పనిసరిగా ఇ-ఫైల్స్ మాత్రమే జనరేట్ చేయాలి.
- ప్రజలకు సేవలందించే విషయంలో వినూత్న ఆలోచనలతో పాటు… మరింత మెరుగైన పాలనకూ కలెక్టర్లు వినూత్నంగా ఆలోచించాలి.
















































