పెదమద్దూరులో 70y.66% శాతం పూర్తి అయిన భూసమీకరణ
LPS 2.Oలో భాగంగా పెదమద్దూరులో భూ సమీకరణ ప్రక్రియ జోరుగా సాగుతోంది. గ్రామంలోని రైతులు ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి భూములు పూలింగ్ కింద ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు.
కాగా ఇప్పటివరకు గ్రామంలో నిర్ణీత లక్ష్యంలోని 70.66 శాతం భూమిని రైతుల నుంచి APCRDA అధికారులు సమీకరించారు. మొత్తంగా లక్ష్యంగా నిర్దేశించబడిన 1,018 ఎకరాలకు గాను 719.35 ఎకరాలను ఇప్పటివరకు భూసమీకరణ కింద సమీకరించారు.
సోమవారం, 2026 ఆగస్టు 10న గ్రామానికి చెందిన పలువురు రైతులు..స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.రత్నకుమార్, డిప్యూటీ కలెక్టర్ ఎన్. ఏసురత్నం గార్లకు సంబంధిత పత్రాలను అందజేశారు. ప్రభుత్వ పిలుపుమేరకు రాజధాని అమరావతి నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ కింద భూములు అందజేస్తున్న పెదమద్దూరు గ్రామస్తులకు APCRDA తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయుచున్నాము.



















































