జయహో బీసీ..,స్థానిక సంస్థలు బలోపేతానికి మరో ముందడుగు
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచీ బీసీలకు వెన్నూదన్నుగా నిలుస్తోంది. ఈ రోజు ఏపీ మంత్రిమండలి తీసుకున్న మరో చారిత్రక నిర్ణయం బీసీలకు రాజకీయ సాధికారతకు గొప్ప అవకాశం కానుంది. గ్రామీణ స్థానిక సంస్థల్లో (RLBs) బీసీలకు 34 శాతం , పట్టణ స్థానిక సంస్థల్లో (ULBs) బీసీలకు 33⅓ శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం. ప్రజా ప్రభుత్వం బీసీలకు జై కొట్టింది… జయహో బీసీ అంటోంది. ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1994కు అనుగుణంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు నిర్ణయం తీసుకోవడం కీలకమైన అంశం.
నగర, పట్టణ, నగర పంచాయతీల్లోని మేయర్, చైర్మన్ల ఎన్నిక ఇకపై ప్రత్యక్ష పద్ధతిలో చేపట్టాలని, 13 జెడ్పీలను 28 జిల్లాపరిషత్ లు గా ఏర్పాటు చేయాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయాలతో స్థానిక సంస్థల బలోపేతం, పాలనా వికేంద్రీకరణకు గొప్ప ముందడుగు పడింది.
…నారా లోకేష్,
విద్య, ఐటి శాఖల మంత్రి.





















































M