శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాప్ట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు నాయుడు గారు, రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు. AMCAతో పాటు మరికొన్ని డిఫెన్స్, డ్రోన్ సిటీ లోని ప్రాజెక్టులకు శంకుస్థాపన. అనంతరం వేదిక వద్ద మిస్సైల్ లు, హ్యాండ్ గ్రేనేడ్, ఆధునిక తుపాకులు, యుద్ధ విమానం ప్రొటోటైప్ లాంటి రక్షణ ఉత్పత్తుల ప్రదర్శనను తిలకించిన సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్, మంత్రి లోకేష్. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మంత్రులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ….
• రాయలసీమలో ఇనుపఖనిజం, సున్నపు రాయి లాంటి ఖనిజ వనరుల్ని సమర్ధంగా వినియోగించుకుంటాం.
• కడప స్టీల్ ప్లాంటును జూన్ లో ప్రారంభిస్తాం… 2027 డిసెంబరు నాటికి పూర్తి చేస్తాం.
• స్టీల్, సిమెంట్ ప్లాంట్లు, సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు సీమ కేంద్రంగా మారుతుంది.
• డిఫెన్స్, స్పేస్ , ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ లాంటి పరిశ్రమలతో రాయలసీమ రతనాల సీమగా మారుస్తాం.
• కొప్పర్తి పారిశ్రామిక నోడ్ ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్ గా మారుతుంది.
• తిరుపతిలో రాయల్ ఎన్ ఫీల్డ్ ప్లాంట్, శ్రీహరికోట సమీపంలో స్పేస్ సిటీ ఏర్పాటు చేస్తాం.
• కియా పరిశ్రమ 18 లక్షల కార్లు తయారు చేస్తోంది. కరవు సీమలో తయారైన కార్లు 80 దేశాల్లో తిరుగుతున్నాయి.
• ఆర్డీటీ సంస్థకు విదేశీ విరాళాల విషయంలో సమస్య ఉత్పన్నమైతే కేంద్రంతో మాట్లాడి మంత్రి లోకేష్ ఆ సమస్యను పరిష్కరించారు.
• గతంలో గోల్డ్ అంటే KGF, ఇప్పుడు గోల్డ్ అంటే JGF… జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ కర్నూలులో వస్తోంది.
• JGFలో ఈ ఏడాది 600 కేజీల బంగారం ఉత్పత్తి అవుతుంది. రెండో ఏడాది 1500 కిలోల బంగారం తయారవుతుంది. రానున్న రోజుల్లో బంగారం ఉత్పత్తికి ఏపీ కీలకమవుతుంది.
• తిరుమల, శ్రీకాళహస్తి, శ్రీశైలం, అహోబిలం, పుట్టపర్తి లాంటి ఆలయాలు ఆధ్యాత్మిక శోభను పెంచుతున్నాయి.
• సమర్ధ నీటి నిర్వహణతో జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి.
• సమర్ధవంతమైన పాలన ఫలితంగానే రిజర్వాయర్లలో నిండుగా నీరు ఉన్నాయి.
• అభివృద్ధిని బుల్లెట్ స్పీడ్ తో తీసుకెళ్తున్నాం. అవకాశాలు తెచ్చే బాధ్యత మాది. వాటిని అందిపుచ్చుకునే బాధ్యత యువతది.
• గత పాలనలో విధ్వంసం చేశారు. పరిశ్రమలు తరిమేశారు. సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేశారు.
• సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో మళ్లీ ఏపీ బ్రాండ్ ను పునరుద్ధరించాం
• 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. వీటివల్ల 24 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి.
• యువతకు ఇక్కడే ఉద్యోగాలు రావాలి, ఇతరులకూ మనమే ఉపాధి కల్పించేలా పరిశ్రమలు వస్తున్నాయి.
• గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ లాంటి ప్రాజెక్టులు వచ్చాయి. రిలయన్స్, బీపీసీఎల్ లాంటి ప్రాజెక్టులు వస్తాయి.
• విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రంగా మూడు ఎకనామిక్ రీజియన్లలో పెట్టుబడులు వస్తాయి.
• చిప్ నుంచి షిప్ వరకూ మన దేశంలోనే తయారు కావాలని ప్రధాని మోదీ పిలుపు ఇచ్చారు.
• ఏపీలో డిజైన్ చేయండి, పెట్టుబడులు పెట్టండి, తయారు చేయాలని నేను కోరుతున్నాను.
• పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా ఏపీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం… వేగంగా అనుమతులిస్తాం.
• దేశానికి తిరుగులేని శక్తిగా రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ తయారవుతాయి.
• ఆర్ధిక భద్రత కూడా అత్యంత కీలకం. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం మనపై కూడా పడింది.
• ఇంధనం, బంగారం కొనుగోలుతో విదేశీ మారకనిల్వలు తరిగి పోతున్నాయి.
• నాదేశం- నాబాధ్యత అనే అంశంపై అందరం దృష్టి పెట్టాలి.
• ప్రధాని ప్రతిపాదించిన వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి 7 అంశాలను మనం కూడా ఆచరిద్దాం.
• ఇతర దేశాలు కూడా పొదుపు చర్యలు చేపట్టాయి. మనం కూడా బాధ్యతతో ముందుకు వెళ్లాలి.
• పొదుపు చర్యల్లో భాగంగా కాన్వాయ్ సంఖ్యను తగ్గించాం. దీనిపై ఓ కార్యాచరణ కూడా తీసుకుంటున్నాం.
• ప్రతీ భారతీయుడు సవాళ్లను అధిగమించేలా చర్యలు తీసుకోవాలి.
• ప్రతీ సవాలును మనం ఓ అవకాశంగా మలచుకుందాం.
• ప్రధాని మోదీ పిలుపు ఇచ్చిన పొదుపు ఉద్యమానికి ఏపీ సారధ్యం వహించాలి.
పుట్టపర్తి
పుట్టపర్తిలో మరికొన్ని డిఫెన్స్, డ్రోన్ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసిన కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు.
రూ. 2959 కోట్ల విలువైన మూడు డిఫెన్స్ ప్రాజెక్టులకు శంకుస్థాపన… 1935 మంది ఉపాధి కల్పించనున్న 3 డిఫెన్స్ ప్రాజెక్టులు.
డిఫెన్స్ రంగంలో కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, HFCL సంస్థలకు చెందిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్.
డ్రోన్ సిటీలో పరిశ్రమలు ఏర్పాటు చేసే వివిధ డ్రోన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన రక్షణ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు.
శంకుస్థాపనల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, మంత్రులు టీజీ భరత్, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్య ప్రసాద్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఆయా సంస్థల ప్రతినిధులు
పుట్టపర్తి
డిఫెన్స్ రంగంలో పెట్టుబడులకు 7 సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం.
రూ. 4460 కోట్లకు పైగా పెట్టుబడులు, 6400కు పైగా ఉద్యోగాలు కల్పించేలా 7 సంస్థలతో ఒప్పందాలు.
భారత్ ఫోర్జ్, రఘు వంశీ మెషీన్ టూల్స్, సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్, NIBE గ్రూప్, PMT డిఫెన్స్, చక్రవ్యూహ్ డైనమిక్స్, ఇండస్ బ్రిడ్జ్ వెంచర్స్ సంస్థలతో ఒప్పందాలు.
పుట్టపర్తి
ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏడీఏ ఆధ్వర్యంలో AMCA ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో ప్రసంగించిన ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్
కొద్దిసేపు హిందీలో ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్న మంత్రి లోకేష్
నారా లోకేష్, ఐటీ-విద్యా శాఖ మంత్రి
• ఆపరేషన్ సింధూర్ కు ఏడాది పూర్తి అయ్యింది. శత్రువుకు భారత రక్షణ దళాల శక్తి ఏమిటో ప్రధాని చూపించారు
• ప్రతీ భారతీయుడు గర్వపడే ప్రధాని దేశానికి ఉన్నారు.
• దేశానికి ఐరన్ మ్యాన్ గా రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఉన్నారు.
• సత్యసాయి జిల్లా దేశానికే రక్షణ శక్తికి నయా కేంద్రంగా తయారవుతుంది.
• కూటమికి మద్దతు ఇచ్చిన ఉమ్మడి అనంతపురం జిల్లాకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికే ఈ ప్రాజెక్టు తెచ్చాం.
• కరవు నేలపై రక్షణ ప్రాజెక్టులు వచ్చాయి. పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తున్నాయి.
• కరవు నేలపై కియా ప్రాజెక్టు తీసుకువచ్చిన నేత సీబీఎన్.
• గతంలో శ్రీసత్యసాయి బాబా పుట్టపర్తిలో ఎయిర్ పోర్టు నిర్మిస్తుంటే అందరూ అవసరమా అని అడిగారు.
• బాబా స్పూర్తితో పుట్టపర్తికి కూటమి ప్రభుత్వం డిఫెన్సు ప్రాజెక్టు తెచ్చింది.
• డబుల్ ఇంజన్ బుల్లెట్ సర్కార్ ఏపీలో ఉంది. ఏపీలో నమో అంటే నాయుడు జీ, మోడీజీ జోడీ.
• మోడీజి, చంద్రబాబుజి, రాజ్ నాథ్ సింగ్ జీ 75 ఏళ్ల కుర్రవాళ్లు. వారి స్పీడ్ ఇప్పటికీ ఎవరూ అందుకోలేరు.
• గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ లాంటి లక్షల కోట్ల ప్రాజెక్టులు ఏపీకి వచ్చాయి.
• త్వరలో కర్నూలులోనూ హైకోర్టు బెంచ్ ఏర్పాటు కాబోతోంది.
• నాయుడుజీ, మోడీజీ జోడీతో రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది.
• స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో అతి తక్కువ సమయంలో ఈ ప్రాజెక్టును సాకారం చేశాం
• పొరుగు రాష్ట్ర ప్రజలు ఏపీని చూసి అసూయపడే పరిస్థితి తీసుకువచ్చాం.
• రాయలసీమతో పాటు రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి.
• జువ్వలదిన్నెలో సాగర్ డిఫెన్సు వచ్చింది. పుట్టపర్తిలో ఏడీఏ AMCA ప్రాజెక్టును తీసుకువచ్చాం.
• పుట్టపర్తిలో 5వ తరం ఆధునిక యుద్ధ విమానాల ఇంటిగ్రేషన్, ఫ్లైట్ టెస్టింగ్ ప్రాజెక్టు వచ్చింది.
• ఇతర డిఫెన్సు ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు కూడా ఇక్కడికి వచ్చాయి.
• AMCA ప్రాజెక్టు రాకతో ఉమ్మడి అనంతపురం జిల్లా నెంబర్-1గా నిలుస్తుంది.
• AMCA కథ 2025 డిసెంబరులో ఢిల్లీలో మొదలైంది. రక్షణ మంత్రి రాజ్ నాథ్ ను కలిసి ఈ ప్రాజెక్టు ఇవ్వాలని కోరాను.
• ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వేగంగా ఈ ప్రాజెక్టు కోసం పనిచేసింది.
• ఇది కేవలం డిఫెన్సు ప్రాజెక్టు మాత్రమే కాదు రాయలసీమకు కొత్త దిశను కల్పించే అత్యుత్తమ ప్రాజెక్టు ఇది.
• ఇంత మంచి పెద్ద ప్రాజెక్టును ఏపీకి ఇచ్చినందుకు ప్రధాని మోదీకి, రక్షణ మంత్రికి రాజ్ నాథ్ సింగ్ కు ధన్యవాదాలు.
• భారత నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా సహకరాన్ని అందిస్తుంది.
• వాళ్లది ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్- మనది ఫైటర్ జెట్ బ్యాక్ గ్రౌండ్.
• వాళ్లది క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ మనది కియా బ్యాక్ గ్రౌండ్.
పుట్టపర్తి
ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలోని అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ ఫ్లైట్ టెస్టింగ్ ప్రాజెక్టు శిలాఫలకాన్ని ఆవిష్కరించిన రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు.
ఈ ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్న కల్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హెచ్ఎఫ్ సీఎల్ ప్రాజెక్టులకు చెందిన శిలాఫలకాలను వర్చువల్ గా ఆవిష్కరించిన కేంద్ర మంత్రి, సీఎం చంద్రబాబు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…
• పుట్టపర్తి సత్యసాయి బాబా బోధనలతో విశ్వశాంతికి బాటలు పడ్డాయి.
• పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు రావటం ఎంతో కీలకం.
• దేశం గర్వించే వ్యూహాత్మకమైన రక్షణ కేంద్రంగానూ పుట్టపర్తి మారుతుంది.
• AMCA ప్రాజెక్టుతో ఆత్మనిర్బర్ భారత్ లక్ష్యసాధనలో ఏపీ ముఖ్యపాత్ర పోషిస్తుంది.
• భారత రక్షణ రంగాన్ని ఆధునీకరించటంతో పాటు బలోపేతం చేయటంపై ప్రధాని దృష్టి సారించారు.
• ఆధునికతరం స్టెల్త్ యుద్ధ విమానాలను తయారు చేసేలా AMCA ప్రాజెక్టు ఏర్పాటు అవుతోంది.
• భారత రక్షణ శక్తిని ప్రపంచానికి చాటటంలో ఆపరేషన్ సింధూర్ ఓ ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది.
• ఆపరేష్ సింధూర్ లో వినియోగించిన డ్రోన్లు ఏపీలోనే తయారై, టెస్ట్ చేశారు.
• AMCA లాంటి ప్రాజెక్టును ఏపీకి కేటాయించినందుకు రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ కు ధన్యవాదాలు.
• రూ.15 వేల కోట్లకు పైగా పెట్టుబడితో 7500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రాజెక్టు వస్తుంది.
• ఫైటర్ జెట్ ఇంటిగ్రేషన్ తో పాటు ఫ్లైట్ టెస్టింగ్ కేంద్రంగా పుట్టపర్తి మారుతుంది.
• అత్యంత వేగంగా ఈ ప్రాజెక్టును సాకారం చేయటంలో రక్షణ శాఖ, కేంద్ర ప్రభుత్వ సహకారం అందించాయి.
• కేవలం 36 రోజుల్లోనే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగలిగాం… జెట్ స్పీడ్ తో అనుమతులిచ్చాం.
• ఏరోస్పేస్ రంగంలో కీలకమైన ప్రాజెక్టుతో మరికొన్ని డిఫెన్సు ప్రాజెక్టులు కూడా వస్తాయి.
• భారత్ ఫోర్జ్, హెచ్ఎఫ్ సీఎల్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, కర్నూలు జిల్లాలో డ్రోన్ సిటీలకు శంకుస్థాపన చేశాం.
• ఇటీవల యుద్ధాల్లో డ్రోన్లే కీలకంగా మారాయి. వ్యవసాయం నుంచి చాలా రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరిగింది.
• ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేసి ఉత్పత్తి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
• శ్రీహరికోట అంతరిక్షశక్తి, నాగాయలంకలో క్షిపణిశక్తి, పుట్టపర్తి రక్షణ శక్తి, విశాఖ నుంచి నౌకాదళ శక్తిగా ఏపీ దేశానికే అండగా నిలుస్తుంది.
• గతంలో రాయలసీమ రతనాల సీమ.. కానీ వివిధ కారణాల వల్ల కరవుసీమగా మారిపోయింది.
• కూటమి అధికారంలోకి వచ్చాక మళ్లీ ఆ పరిస్థితిని మార్చాం.
• ఆనాడు ఎన్టీఆర్, ఈనాడు కూటమి ప్రభుత్వం రాయలసీమకు నీరిచ్చేందుకు కృషి చేస్తున్నాం.
• ప్రతీ ఎకరాకూ నీరిచ్చేలా కార్యాచరణ చేపట్టాం. కియా పరిశ్రమకు నీరిచ్చాం. లక్ష కోట్ల రూపాయలతో సీమను హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తున్నాం.








































































