సాయికృష్ణ అదృశ్యపై సీఎం సీరియస్
- సచివాలయంలో సీఎం, డిప్యూటీ సీఎం అత్యున్నత స్థాయి సమీక్ష
- ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజును సస్పెండ్ చేయాలని చంద్రబాబు ఆదేశం
- సీనియర్ ఐపీఎస్ అధికారితో నిష్పాక్షపాత దర్యాప్తు..బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ అదృశ్యం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సింగపూర్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్న వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా సచివాలయానికి చేరుకున్నారు. శాంతిభద్రతలు, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీస్ శాఖకు చెందిన అత్యున్నత అధికారులను అత్యవసరంగా పిలిపించుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కలిసి తాజా పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమీక్షా సమావేశంలో సాయికృష్ణ అదృశ్యం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను, ఇప్పటివరకు పోలీస్ శాఖ చేపట్టిన చర్యలను ఉన్నతాధికారులు సీఎం, డిప్యూటీ సీఎంలకు సవివరంగా వివరించారు.
ఈ ఘటనలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) నాగరాజుపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం, ఆరోపణల తీవ్రతను పరిగణనలోకి తీసుకుని సీఐ నాగరాజును తక్షణమే సస్పెండ్ చేయాలని పోలీస్ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. చట్టాన్ని ఉల్లంఘించినా, బాధ్యతారహితంగా వ్యవహరించినా ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. సాయికృష్ణ అదృశ్యం కేసులో వాస్తవాలను వీలైనంత త్వరగా బయటకు తీయాలని, ఈ కేసును ఒక సీనియర్ ఐపీఎస్ అధికారితో దర్యాప్తు చేయించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
ఎక్కడా ఎటువంటి రాజకీయ లేదా ఇతర బాహ్య ఒత్తిళ్లకు తావులేకుండా, అత్యంత నిష్పాక్షపాతంగా విచారణ జరగాలని పోలీస్ బాసులను ఆదేశించారు. బాధితులకు న్యాయం జరగడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని, ఈ ఘటనకు కారణమైన వారితో పాటు, దీని వెనుక ఎంతటి వారు ఉన్నా కఠినంగా శిక్షించాల్సిందేనని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ అత్యవసర ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్హా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
CM Takes very Serious Note of Saikrishna’s Disappearance
- CM and Deputy CM Hold High-Level Review at the Secretariat
Chandrababu Orders Suspension of CI Nagaraju Amidst Allegations
Impartial Investigation by Senior IPS Officer; Strict Action Against Those Responsible
Chief Minister Chandrababu and Deputy Chief Minister Pawan Kalyan conducted a high-level review regarding the disappearance of Saikrishna, an incident that has caused a stir across the state. Upon returning from his Singapore tour, Chief Minister Chandrababu Naidu proceeded directly to the Secretariat. Prioritizing law and order and public safety, he immediately summoned top police officials and held an extensive discussion with Deputy CM Pawan Kalyan on the current situation. During the meeting, senior officials briefed the CM and Deputy CM in detail about the facts of the case and the actions taken by the police department so far.
Chief Minister Chandrababu Naidu ordered immediate disciplinary action against Circle Inspector (CI) Nagaraju, who is facing serious allegations in connection with the incident. Taking into account the negligence in duty and the gravity of the allegations, the CM directed senior police officials to suspend CI Nagaraju immediately. He made it clear that no one—regardless of their position—would be spared if they violated the law or acted irresponsibly. The Chief Minister has decided that the facts surrounding the disappearance of Saikrishna must be uncovered as quickly as possible and that the case should be investigated by a senior IPS officer.
He directed the police leadership to conduct an absolutely impartial investigation, free from any political or external pressures. CM Chandrababu and Deputy CM Pawan Kalyan emphasized that ensuring justice for the victims is the government’s primary duty and asserted that those responsible for the incident—as well as anyone else involved, regardless of their stature—must face severe punishment.
Chief Secretary Sai Prasad, State Director General of Police Harish Kumar Gupta, Intelligence Chief Mahesh Chandra Laddha, and Vijayawada Police Commissioner Rajasekhar Babu, among others, participated in this urgent high-level review meeting held at the Chief Minister’s Office.












































