Farmers voluntarily donated 100 acres in a single day for the construction of the capital, Amaravati.
రాజధాని అమరావతి నిర్మాణానికి ఒకే రోజు స్వచ్ఛందంగా
100 ఎకరాలు అందజేసిన రైతులు
ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి స్వచ్ఛందంగా తమ భూములను ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చేందుకు రైతులు APCRDA కార్యాలయానికి బుధవారం భారీగా చేరుకున్నారు. తుళ్లూరు, రాయపూడి, లింగాయపాలెం గ్రామాలకు చెందిన రైతులు భూసమీకరణ పథకం కింద భూములు ఇచ్చేందుకు APCRDA అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవతేజ ఐఏఎస్, సంబంధిత కాంపిటెంట్ అధికారులకు అంగీకార పత్రాలు అందజేశారు.
పూలింగ్ కింద భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చిన రైతులు ప్రజారాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. రాజధాని గ్రామాలలో భూములు ఇవ్వాల్సిన రైతులు ఇకనైనా ముందుకొచ్చి పూలింగ్ ప్రక్రియలో పాల్గొనాలని, అమరావతి అభివృద్ధి ప్రయాణంలో APCRDA అధికారులకు సహకరించాలని కోరారు. మొత్తంగా బుధవారం 4 గ్రామాలకు చెందిన రైతులు 100.885 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద అందజేశారు.
గ్రామాలవారీగా బుధవారం పూలింగ్ కింద సమీకరించిన భూమి:
తుళ్లూరు- 9.76 ఎకరాలు
రాయపూడి- 31.005 ఎకరాలు
లింగాయపాలెం- 16.90 ఎకరాలు
వెలగపూడి- 43.22 ఎకరాలు











































