Date :21-05-2026
అమరావతి:
వి.ఐ.టి – ఏ.పి విశ్వవిద్యాలయంలో ఘనంగా 9వ విశ్వవిద్యాలయ దినోత్సవ వేడుకలు
వి.ఐ.టి – ఏ.పి విశ్వవిద్యాలయంలో 9వ విశ్వవిద్యాలయ దినోత్సవ వేడుకలను ది. 21 మే 2026 (గురువారం) నాడు ఘనంగా నిర్వహించారు. గౌరవ అతిథిగా ప్రసాద్ పి (డైరెక్టర్ – క్యాంపస్ సంబంధాల అధిపతి, HCL Tech, చెన్నై, తమిళనాడు) హాజరయ్యారు.
గౌరవ అతిథి ప్రసాద్ పి (డైరెక్టర్ – క్యాంపస్ సంబంధాల అధిపతి, HCL Tech, చెన్నై, తమిళనాడు), విశ్వవిద్యాలయ చాన్సలర్ డా|| జి. విశ్వనాథన్ చేతులమీదుగా విశ్వవిద్యాలయ వార్షిక నివేదిక ఆవిష్కరణ జరిగింది. అనంతరం గౌరవ అతిథి చేతులమీదుగా వివిధ విభాగాలలో అవార్డులను సాధించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు సిబ్బందికి బహుమతి ప్రధానం జరిగింది.
గౌరవ అతిథి ప్రసాద్ పి (డైరెక్టర్ – క్యాంపస్ సంబంధాల అధిపతి, HCL Tech, చెన్నై, తమిళనాడు) మాట్లాడుతూ నేటి విద్యార్థులకు కేవలం విద్యా ప్రావీణ్యం మాత్రమే కాకుండా, అనుకూలత, సృజనాత్మకత మరియు స్పష్టమైన లక్ష్యం కూడా అవసరం అవసరమని అన్నారు. విఐటి-ఏపీ విశ్వవిద్యాలయం ఆవిష్కరణలు, సహకారం మరియు నిరంతర అభ్యాసాన్ని ప్రోత్సహించే ఉత్తేజభరిత వాతావరణాన్ని కల్పిస్తోందని తెలియచేసారు.
విఐటి వ్యవస్థాపకుడు మరియు ఛాన్సలర్ డా|| జి. విశ్వనాథన్ మాట్లాడుతూ విఐటి విశ్వవిద్యాలయంలో అత్యుత్తమ విద్య విధానాలు, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్యను అందిస్తున్నామని, విద్యార్థులు సాధిస్తున్న విజయాలే ఇందుకు నిదర్శనమని తెలియచేసారు. కేంద్రం స్థూల దేశీయోత్పత్తిలో ఉన్నత విద్యకు 6 శాతం కేటాయించాల్సిన అవసరం ఉందని అన్నారు. వికసిత్ భారత్ 2047 ద్వారా భారత్ అభివృద్ధిచెందిన దేశంగా ఎదిగేందుకు ఉన్నతవిద్యలో సంస్కరణలు అవసరమని తెలిపారు. యూనివర్సిటీ హయ్యర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది విద్యార్థులకు ఉపకారవేతనాలు అందించి వారి ఉన్నతవిద్యకు సహాయం చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా అకాడెమిక్ అవార్డులు, ఎండోమెంట్ అవార్డులు, అకడెమిక్ ఎక్సలెంట్ అవార్డులు, స్టాఫ్ ఎక్సలెంట్ అవార్డులు సాధించిన విద్యార్ధులు, అధ్యాపకలు మరియు సిబ్బందిని ప్రశంసించారు.
విశ్వవిద్యాలయ వైస్ ప్రెసిడెంట్ డా||జి. వి. సెల్వం మాట్లాడుతూ విఐటి-ఏపీ విశ్వవిద్యాలయంలో ఎల్లప్పుడూ నూతన ఆవిష్కరణలు, వ్యక్తిత్వ వికాసం మరియు ప్రపంచ స్థాయి నైపుణ్యాలను పెంపొందించే వాతావరణాన్ని సృష్టించేందుకు కృషి చేస్తున్నామని తెలియచేసారు. సమాజానికి సేవ చేయగలిగేలా విద్యార్థులను తీర్చిదిద్దటమే మా లక్ష్యమని పేర్కొన్నారు.
అంతే కాకుండా సిఐడి, ఆంధ్రప్రదేశ్ పోలీస్ మరియు విఐటి-ఏపి విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం (MoU) పై విఐటి ఛాన్సలర్ డా|| జి.విశ్వనాథన్ మరియు డా|| రవి శంకర్ అయ్యనార్, ఐపిఎస్, (డిజిపి, సిఐడి) సంతకాలు చేసారు.
బ్యూమర్క్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో విఐటి-ఏపి విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన కృత్రిమ కాలు పంపిణీ గౌరవ అతిథి చేతులమీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో బ్యూమర్క్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు మేనేజింగ్ ట్రస్టీ అయిన ఆర్. బాలచంద్రన్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డా|| పి. అరుళ్మొళివర్మన్, రిజిస్ట్రార్ డా|| జగదీష్ చంద్ర ముదిగంటి, డా|| ఖాదీర్ పాషా (డిప్యూటీ డైరెక్టర్, స్టూడెంట్ వెల్ఫేర్), విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

















































