జాతీయ సారస్ మేళా–2026లో రుచుల విందుగా నిలిచిన సారస్ శక్తి ఫుడ్ కోర్టు
- మహిళా ఆహార వ్యాపారాలకు కుడుంబశ్రీ నైపుణ్యం తోడ్పాటు
- ఫుడ్ కోర్టు మొత్తం ₹1.85 కోట్ల విక్రయాలు నమోదు
విజయవాడ | 1 నవంబర్ 2026:
ఢిల్లీ–ఎన్సీఆర్ వెలుపల తొలిసారిగా విజయవాడలోని పున్నమి ఘాట్లో 2026 అక్టోబర్ 13 నుంచి 31 వరకు నిర్వహించిన జాతీయ సారస్ మేళా–2026లో సారస్ శక్తి ఫుడ్ కోర్టు సందర్శకులు, కొనుగోలుదారులు, ఆహార ప్రియులను విశేషంగా ఆకర్షించింది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 50 ప్రత్యక్ష ఆహార స్టాళ్లతో ఏర్పాటు చేసిన ఈ ఫుడ్ కోర్టు, భారతదేశంలోని ప్రాంతీయ వంటకాలు, సంప్రదాయ వంటలు, విభిన్న రుచులను ఒకే వేదికపై అందించింది.
2026 అక్టోబర్ 15న మేళా ప్రారంభోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ఇతర మంత్రులు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు ఫుడ్ కోర్టును సందర్శించి వంటకాలను ఆస్వాదించారు. ఈ సందర్శన భారతీయ ఆహార వారసత్వాన్ని, మహిళల ఆధ్వర్యంలోని గ్రామీణ వ్యాపారాలను ప్రదర్శించే వేదికగా ఫుడ్ కోర్టు ప్రాధాన్యతను చాటిచెప్పింది.
మహిళల ఆధ్వర్యంలోని ఆహార వ్యాపారాలకు తమ వంట నైపుణ్యాలను ప్రదర్శించడానికి, ప్రాంతీయ ప్రత్యేక వంటకాలను ప్రోత్సహించడానికి, వినియోగదారులతో నేరుగా అనుసంధానం కావడానికి ఫుడ్ కోర్టు ఒక చైతన్యవంతమైన వేదికగా నిలిచింది. సంప్రదాయ వంటకాల నుంచి స్థానిక ప్రత్యేకతల వరకు, ఈ స్టాళ్లు భారతదేశపు గొప్ప ఆహార వారసత్వాన్ని చాటుతూ స్వయం సహాయక సంఘాల (SHG) మహిళా పారిశ్రామికవేత్తలకు వ్యాపార అవకాశాలను కల్పించాయి.
ఫుడ్ కోర్టు నిర్వహణలో కుడుంబశ్రీ నైపుణ్యం
కేరళ రాష్ట్ర గ్రామీణ జీవనోపాధుల మిషన్ (SRLM) అయిన కుడుంబశ్రీ, సారస్ మేళాలు ,ఇతర జాతీయ కార్యక్రమాల్లో ఫుడ్ కోర్టుల నిర్వహణలో విశేష అనుభవాన్ని కలిగి ఉంది. తన నేషనల్ రిసోర్స్ ఆర్గనైజేషన్ (NRO) ద్వారా, విజయవంతమైన కేఫ్ కుడుంబశ్రీ నమూనా ఆధారంగా, మహిళల ఆధ్వర్యంలోని ఆహార వ్యాపారాలను సమర్థవంతంగా నిర్వహించే ఫుడ్ కోర్టు వ్యవస్థను అభివృద్ధి చేసింది.
2026 అక్టోబర్ 13 నుంచి 31 వరకు నిర్వహించిన జాతీయ సారస్ మేళా–2026లో సారస్ శక్తి ఫుడ్ కోర్టు మొత్తం ₹1.85 కోట్ల విక్రయాలను నమోదు చేసింది.
కుడుంబశ్రీ అనుభవంలో ప్రాంగణ ప్రణాళిక, స్టాళ్ల అమరిక, స్వయం సహాయక సంఘాల ఆహార వ్యాపారవేత్తల ఎంపిక, మెనూ రూపకల్పన, సరుకుల కొనుగోలు ,రవాణా నిర్వహణ, ఆహార తయారీ ,నిల్వల నిర్వహణ, బిల్లింగ్ ,విక్రయాల లెక్కల సమన్వయం, ఆహార భద్రత ,పరిశుభ్రత, మొత్తం కార్యక్రమ నిర్వహణ వంటి అంశాలు ఉన్నాయి. సంప్రదాయ వంట నైపుణ్యాలను క్రమబద్ధమైన వ్యాపార నిర్వహణ, నాణ్యమైన సేవలు ,వినియోగదారులతో అనుసంధానించే విధానంతో కుడుంబశ్రీ ముందుకు సాగుతోంది.
మహిళా వ్యాపారాలకు, సాంస్కృతిక మార్పిడికి వేదిక
సారస్ శక్తి ఫుడ్ కోర్టు, గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలు తమ మార్కెట్ పరిధిని విస్తరించడానికి, వినియోగదారుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి, వ్యాపార సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడానికి సమిష్టి వేదికలు ఎంతగానో దోహదపడతాయని నిరూపించింది. దేశవ్యాప్తంగా ప్రాంతీయ వంటకాలను ఒకే ప్రదేశంలో అందించడం ద్వారా సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించి, మేళా సందర్శకుల అనుభవాన్ని మరింత మెరుగుపరిచింది.
కుడుంబశ్రీ NRO బృందం సాంకేతిక మార్గదర్శకత్వం
సారస్ శక్తి ఫుడ్ కోర్టు ఏర్పాట్లు ,నిర్వహణలో కుడుంబశ్రీ నేషనల్ రిసోర్స్ ఆర్గనైజేషన్ (NRO) బృందం కీలక పాత్ర పోషించింది. మార్కెటింగ్ థీమాటిక్ యాంకర్ Ms. అనుగు అంజలా రెడ్డి, మార్కెటింగ్ థీమాటిక్ యాంకర్ Mr. షిరాజ్ సోలంకి, థీమాటిక్ యాంకర్ Mr. విశాల్, మరో 25 మంది బృంద సభ్యులు సాంకేతిక మార్గదర్శకత్వం ,నిర్వహణ సహకారం అందించారు. వారి సహకారం ఫుడ్ కోర్టు సజావుగా పనిచేయడానికి, మహిళా ఆహార వ్యాపారాలను ప్రోత్సహించడానికి దోహదపడింది.
ఈ పెద్ద స్థాయి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో బృందం మార్గదర్శక శక్తిగా నిలిచింది. మేళా అంతటా ఫుడ్ కోర్టు నిర్వహణలోని వివిధ అంశాలను సమన్వయం చేస్తూ, పాల్గొన్న మహిళా పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహకారం అందించింది.
వారి భాగస్వామ్యం ,సేవలను గుర్తిస్తూ, కుడుంబశ్రీ NRO బృందం 50 మంది మహిళా ఆహార వ్యాపారవేత్తలకు పాల్గొనడం ,ప్రశంసా పత్రాలను అందజేసింది. భారతదేశపు గొప్ప ఆహార వైవిధ్యాన్ని ప్రదర్శించడంలో, మహిళా పారిశ్రామికవేత్తల అభివృద్ధికి తోడ్పడడంలో వారి కృషిని ఈ సందర్భంగా గుర్తించింది.
ఫుడ్ కోర్టు విజయవంతం కావడం మహిళల ఆధ్వర్యంలోని ఆహార వ్యాపారాలు గ్రామీణ జీవనోపాధులు, పారిశ్రామికవేత్తల అభివృద్ధి ,ఆర్థిక సాధికారతకు ఎంతగానో దోహదపడగలవని తెలియజేస్తోంది. అలాగే, రాష్ట్ర గ్రామీణ జీవనోపాధుల మిషన్ల మధ్య సంస్థాగత నైపుణ్యాల పరస్పర భాగస్వామ్యం ద్వారా ఫుడ్ కోర్టుల నిర్వహణను బలోపేతం చేసి, స్వయం సహాయక సంఘాల మహిళలకు స్థిరమైన మార్కెట్ అవకాశాలను సృష్టించవచ్చని స్పష్టం చేస్తోంది.
‘Saras Shakti’ Food Court: A Culinary Highlight at the National Saras Mela 2026
- Kudumbashree’s Expertise Empowers Women-Led Food Enterprises
- Food Court Records Total Sales of ₹1.85 Crore
Vijayawada | November 1, 2026:
The ‘Saras Shakti’ Food Court, featured at the National Saras Mela 2026—held at Punnami Ghat in Vijayawada from October 13 to 31, 2026 (marking its first-ever edition outside the Delhi-NCR region)—proved to be a major attraction for visitors, shoppers, and food enthusiasts alike. Comprising 50 live food stalls representing various states across the country, the food court brought together a diverse array of regional cuisines, traditional dishes, and unique flavors on a single platform.
During the inauguration of the Mela on October 15, 2026, the President of India, the Chief Minister of Andhra Pradesh, the Union Minister for Rural Development, and other dignitaries—including senior officials from both the Central and State governments—visited the food court and sampled the various culinary offerings. This visit underscored the significance of the food court as a showcase for India’s rich culinary heritage and rural, women-led enterprises.
The food court served as a vibrant platform for women-led food businesses to demonstrate their culinary skills, promote regional specialties, and engage directly with consumers. From traditional dishes to local specialties, these stalls showcase India’s rich culinary heritage while creating business opportunities for women entrepreneurs from Self-Help Groups (SHGs).
Kudumbashree’s Expertise in Managing Food Courts
Kudumbashree—the State Rural Livelihoods Mission (SRLM) of Kerala—possesses extensive experience in managing food courts at ‘Saras Melas’ (fairs) and various other national-level events. Through its National Resource Organization (NRO), and building upon the successful ‘Cafe Kudumbashree’ model, the organization has developed a robust food court system that effectively facilitates food-based enterprises run by women.
At the National Saras Mela 2026, held from October 13 to 31, the ‘Saras Shakti’ food court recorded total sales of ₹1.85 crore.
Kudumbashree’s operational expertise encompasses a wide range of functions: venue planning, stall layout, selection of SHG-based food entrepreneurs, menu design, procurement and logistics, food preparation and inventory management, billing and sales reconciliation, ensuring food safety and hygiene, and overall event management. By integrating traditional culinary skills with systematic business management, quality service, and a customer-centric approach, Kudumbashree continues to drive success. A Platform for Women-Led Businesses and Cultural Exchange
The ‘Saras Shakti’ Food Court has proven that collective platforms are instrumental in helping rural women entrepreneurs expand their market reach, gain consumer feedback, and strengthen their business capabilities. By bringing together regional cuisines from across the country under one roof, it has fostered cultural exchange and significantly enriched the experience for visitors at the fair.
Technical Guidance from the Kudumbashree NRO Team
The Kudumbashree National Resource Organisation (NRO) team played a pivotal role in the setup and management of the ‘Saras Shakti’ Food Court. The team—comprising Marketing Thematic Anchors Ms. Anugu Anjala Reddy, Mr. Shiraz Solanki, and Mr. Vishal, along with 25 other members—provided essential technical guidance and operational support. Their contribution ensured the smooth functioning of the food court and helped promote the food-based enterprises run by women.
The team served as a guiding force in the successful execution of this large-scale initiative. Throughout the fair, they coordinated various aspects of the food court’s operations and provided the necessary support to the participating women entrepreneurs. In recognition of their participation and services, the Kudumbashree NRO team presented certificates of appreciation to 50 women food entrepreneurs. This gesture acknowledged their efforts in showcasing India’s rich culinary diversity and contributing to the growth of women-led enterprises.
The success of the food court demonstrates that food businesses run by women can significantly contribute to rural livelihoods, entrepreneurial development, and economic empowerment. Furthermore, it highlights that by fostering the exchange of institutional expertise among State Rural Livelihood Missions, the management of such food courts can be strengthened, thereby creating sustainable market opportunities for women in Self-Help Groups (SHGs).


























































