ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సౌజన్యంతో మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ నిర్వహణలో – జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు-2026
ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సౌజన్యంతో మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ నిర్వహణలో డిసెంబరు 12, 13 తేదీలలో సాంస్కృతిక రాజధాని విజయవాడలో ‘జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు-2026’ పేరుతో రెండు రోజుల పాటు సాహిత్య సాంస్కృతిక సంబరాలు జరుగనున్నాయి.
ఎస్.ఆర్.ఆర్ & సి.వి.ఆర్ ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు, నిర్వాహకులతో కలిసి ఈ కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న ఎన్టీఆర్ జిల్లా పర్యాటక మరియు సాంస్కృతిక అధికారి కొల్లేటి రమేష్. కార్యక్రమంలో మల్లెతీగ అధ్యక్షులు కలిమిశ్రీ, ఉత్సవాల బాధ్యులు చొప్పా రాఘవేంద్రశేఖర్, వై.డి.ఆనంద్, రాజధాని వార్తలు ఎడిటర్ పి. హుస్సేన్ ఖాన్ పాల్గొన్నారు.

















































