ఈనెల 11 నుండి 13 వరకూ విశాఖలో పార్టనర్ షిప్ సమ్మిట్-ఏర్పాట్లపై సిఎస్ సమీక్ష
అమరావతి, నవంబరు 2:
ఈనెల 11 నుండి 13 వరకూ మూడు రోజుల పాటు విశాఖపట్నం ఎయు ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సిఐఐ భాగస్వమ్య సదస్సు జరగనుంది.ఇందుకు సబంధించిన ఏర్పాట్లపై సోమవారం ఎపి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ అధికారులతో సమీక్షించారు.
ఈసమావేశంలో ప్రధానంగా రానున్న పార్టనర్ షిప్ సమ్మిట్ విజయంతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయా శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు.పెద్దఎత్తున దేశ విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించే విధంగా ఏర్పాట్లు ఉండాలని అందుకనుగుణంగా సంబంధిత శాఖలు తగిన ఏర్పాట్లు చేయాలని సూసించారు.రాష్ట్రంలో పరిశ్రమలు,కంపెనీలు ఏర్పాటుకు ఉన్న అనూకుల పరిస్థితులను సమ్మిట్ కు వచ్చే పెట్టుబడి దారులను సమగ్రమంగా వివరించి ఆయా రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చే రీతిలో అధికారులు కృషి చేయాలని సిఎస్ సాయి ప్రసాద్ అధికారులను ఆదేశించారు.ఇంకా ఈసమావేశంలో పార్టనర్ షిప్ సమ్మిట్ విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో పరిశ్రమలు,వాణిజ్యశాఖ కార్యదర్శి డా.ఎన్.యువరాజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ పార్టనర్ షిప్ సమ్మిట్ కు సంబంధించిన ఏర్పాట్లు ఇతర అంశాలపై వివరించారు.ఈభాగస్వామ్య సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా,ఇతర కేంద్ర మంత్రులు,రాష్ట్ర ముఖ్యమంత్రి తదితరులు పాల్గోనున్నారని వివరించారు.అదే విధంగా ముగింపు కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి సిపి రాధాకృష్ణణ్ పాల్గోనున్నారని తెలిపారు.దేశ విదేశీ ప్రతినిధులు,వివిధ రంగాల పారిశ్రామిక వేత్తలు తదితరులు పాల్గోనున్నారని వివరించారు.
ఈసమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, ముఖ్య కార్యదర్శులు ఎస్.సురేశ్ కుమార్,ముఖేష్ కుమార్ మీనా,కాంతిలాల్ దండే,ఐఅండ్సి కార్యదర్శి ఎన్.యువరాజ్,విద్యాశాఖ కార్యదర్శి కె.శశిధర్,ఏపిఐఐసి ఎండి దినేష్ కుమార్,చేనేత జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి,గీతాంజలి శర్మ ఎపి పైబర్నెట్ ఎండి,ఎంఎస్ఎంఇ సిఇఒ విశ్వ, ఎపి ఇడిబి సిఇఒ షన్మోహన్,ఎపి ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి ప్రవీణ్ ఆదిత్య, పరిశ్రమల శాఖ డైరెక్టర్ షబ్నమ్ బన్సల్,ఎపిఐఐసి ఇడి యశ్వంత్ కుమార్ రెడ్డి తదితర అధికారులు పాల్గొనగా వర్చువల్ గా ఐఅండ్పిఆర్ డైరెక్టర్ కెఎస్.విశ్వనాధన్ పాల్గొన్నారు.
Chief Secretary Reviews Arrangements for Partnership Summit in Visakhapatnam (Nov 11–13)
Amaravati, November 2:
The Confederation of Indian Industry (CII) Partnership Summit is scheduled to be held over three days, from the 11th to the 13th of this month, at the Andhra University (AU) Engineering College grounds in Visakhapatnam. On Monday, Chief Secretary G. Sai Prasad held a review meeting with officials at the Andhra Pradesh Secretariat regarding the arrangements for this event.
During the meeting, the Chief Secretary discussed the measures required to ensure the success of the upcoming Partnership Summit. He emphasized that arrangements should be made to attract a large number of domestic and international investors, and directed the relevant departments to take appropriate action accordingly. Chief Secretary Sai Prasad instructed officials to clearly explain the favorable conditions available in the state for establishing industries and companies to the visiting investors, with the goal of securing significant investments across various sectors. Furthermore, he provided specific guidance to the officials on various steps to be taken to ensure the summit’s success. During the meeting, Dr. N. Yuvaraj, Secretary of the Industries and Commerce Department, delivered a PowerPoint presentation detailing the arrangements and other aspects related to the Partnership Summit. He stated that Union Home Minister Amit Shah, other Union Ministers, the State Chief Minister, and various other dignitaries will attend the inaugural session of the summit. He further mentioned that Vice President C.P. Radhakrishnan will participate in the concluding ceremony. The event is expected to see the participation of delegates from within the country and abroad, as well as industrialists from various sectors.
The meeting was attended by several officials, including Special Chief Secretary S.S. Rawat; Principal Secretaries S. Suresh Kumar, Mukesh Kumar Meena, and Kanthilal Dande; Secretary of Industries and Commerce N. Yuvaraj; Secretary of the Education Department K. Sashidhar; APIIC MD Dinesh Kumar; Commissioner of Handlooms and Textiles Rekha Rani; AP FiberNet MD Geetanjali Sharma; MSME CEO Viswa; APEDB CEO Shanmohan; AP Airports Development Corporation MD Praveen Aditya; Director of Industries Shabnam Bansal; and APIIC Executive Director Yashwanth Kumar Reddy. Additionally, the Director of Information and Public Relations (I&PR), K.S. Viswanathan, participated in the meeting virtually.