ప్రజాస్వామ్య మూలాల పరిరక్షణ – స్థానిక , సాధారణ ఎన్నికల్లో ప్రభుత్వాల బాధ్యత , పౌరుల పాత్ర
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అనేవి కేవలం రాజకీయ నాయకులను ఎన్నుకునే ప్రక్రియ మాత్రమే కాదు, అది ప్రజల సమిష్టి ఆకాంక్షలకు, వారి చైతన్యానికి నిలువెత్తు రూపం. కానీ, ఇటీవలి కాలంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటింగ్ శాతం క్రమంగా తగ్గిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల వరకు ప్రతిచోటా కనిపిస్తున్న ఈ ఉదాసీనత ప్రజాస్వామ్య మూలాలకే ముప్పుగా పరిణమిస్తోంది. జాతీయ స్థాయి సాధారణ ఎన్నికలకు పెద్దఎత్తున తరలివచ్చే ప్రజలు, తమ ప్రత్యక్ష జీవన ప్రమాణాలను ప్రభావితం చేసే స్థానిక ఎన్నికల పట్ల మాత్రం విముఖత చూపడం గమసార్హం. ఈ అంతరాన్ని పూడ్చి, ప్రజాస్వామ్యాన్ని అట్టడుగు స్థాయి నుంచి బలోపేతం చేయాలంటే ప్రభుత్వాలు, ఎన్నికల సంఘాలు ,పౌరులు సమన్వయంతో ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది.
ప్రభుత్వాలు ,ఎన్నికల యంత్రాంగం తీసుకోవాల్సిన నిర్మాణాత్మక చర్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటింగ్ శాతం పడిపోవడాన్ని కేవలం ప్రజల అలసత్వంగా కొట్టిపారేయలేము. దీనివెనుక వ్యవస్థాపక లోపాలు, పారదర్శకత లోపించడం ,ప్రజలకు పాలనపై నమ్మకం సడలడం వంటి కారణాలు ఉన్నాయి. ఈ పరిస్థితిని మార్చడానికి ప్రభుత్వాలు క్రింది చర్యలు తీసుకోవడం అత్యంత ముఖ్యం.
ఎన్నికల ప్రక్రియను సరళతరం చేయడం
పోలింగ్ కేంద్రాల వద్ద గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఉండకూడదు. క్యూ లైన్ల స్థితిని ఎప్పటికప్పుడు తెలియజేసే మొబైల్ యాప్‌లు, డిజిటల్ ఓటరు స్లిప్పులు, వేగవంతమైన పోలింగ్ విధానాలను ప్రవేశపెట్టాలి. వృద్ధులు, గర్భిణులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ,సులభతరమైన సదుపాయాలు కల్పించాలి.
నిరంతర పౌర విద్య ,అవగాహన
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన చివరి కొన్ని రోజుల్లో మాత్రమే ప్రచారాలు చేయడం సరికాదు. పాఠశాల ,కళాశాల స్థాయి నుంచే విద్యార్థులకు స్థానిక సంస్థల ప్రాముఖ్యత, మున్సిపల్ పనులు, ఓటు హక్కు విలువపై తరగతులు నిర్వహించాలి. తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిలైట్లు, డ్రైనేజీ వ్యవస్థ వంటి నిత్య జీవిత అవసరాలు స్థానిక ప్రభుత్వాల ద్వారానే నెరవేరుతాయని ప్రజలకు అర్థమయ్యేలా చైతన్యవంతం చేయాలి.
పట్టణ ప్రాంతాల్లో ఓటరు భాగస్వామ్యాన్ని పెంచడం
పట్టణాల్లో ఓటింగ్ శాతం అత్యంత దారుణంగా ఉంటోంది. ఇక్కడ మధ్యతరగతి ,మేధావి వర్గాల నిరుత్సాహం స్పష్టంగా కనిపిస్తుంది. దీనిని రూపుమాపేందుకు గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు ,ఐటీ పార్కుల వద్దే ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం, అలాగే ఉద్యోగులు ఓటు వేసేందుకు వీలుగా ప్రత్యేక సెలవు దినాలను పకడ్బందీగా అమలు చేయడం అవసరం.
పౌరుల కర్తవ్యం బాధ్యతారహిత్యాన్ని వీడి క్రియాశీలక భాగస్వామ్యం
ఎన్నికల వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉన్నప్పటికీ, పౌరులు తమ బాధ్యతను విస్మరిస్తే ప్రజాస్వామ్యం కుంటుపడుతుంది. “నేనొక్కడిని ఓటు వేయకపోతే జరిగే నష్టమేమిటి?” లేదా “ఎవరు గెలిచినా మా బ్రతుకులు మారవు” అనే నిరాశావాద ధోరణి దేశ భవిష్యత్తును అంధకారంలోకి నెడుతుంది.
ఓటింగ్‌ను పవిత్రమైన బాధ్యతగా భావించడం
పన్నులు చెల్లించడం, చట్టాలను గౌరవించడం ఎంత ముఖ్యమో, ప్రతి ఐదేళ్లకోసారి సరైన నాయకులను ఎన్నుకోవడం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మన వీధిని, మన వార్డును అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకునే అవకాశం మనకే ఉంటుంది. కాబట్టి, ఓటు హక్కును కేవలం హక్కుగా కాక, ఒక సామాజిక బాధ్యతగా గుర్తించాలి.
అవినీతి రహిత, సమర్థవంతమైన నాయకత్వ ఎంపిక:
కులాలు, మతాలు, డబ్బు లేదా తాగునీటి సీసాలు, ఉచిత హామీల వంటి స్వల్పకాలిక ప్రలోభాలకు లోనై ఓటును అమ్ముకోవడం సమాజానికి చేసే ద్రోహం. అభ్యర్థుల చరిత్రను, వారి పనితీరును, స్థానిక సమస్యలపై వారికి ఉన్న అవగాహనను బేరీజు వేసుకొని ఓటు వేయాలి. నిజమైన మార్పు బ్యాలెట్ బాక్స్ ద్వారానే సాధ్యమవుతుంది.
నిరంతర ప్రశ్నించే తత్త్వాన్ని అలవర్చుకోవడం
ఎన్నికల రోజు ఓటు వేయడంతోనే పౌరుడి బాధ్యత ముగియదు. గెలిచిన ప్రతినిధులు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అని నిలదీసే అధికారం, బాధ్యత పౌరులకు ఉన్నాయి. రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, స్థానిక యువజన సంఘాలు ప్రజా సమస్యలపై ప్రభుత్వాలతో చర్చలు జరిపి, పారదర్శకతను డిమాండ్ చేయాలి.
ప్రజాస్వామ్య వ్యవస్థకు స్థానిక సంస్థలే పునాదిరాళ్లు. ఈ పునాదులు బలహీనపడితే జాతీయ స్థాయి ప్రజాస్వామ్య సౌధం కుప్పకూలే ప్రమాదం ఉంది. ఇటీవలి కాలంలో తగ్గిన ఓటింగ్ శాతం మనకు ఒక పెద్ద హెచ్చరిక. ప్రభుత్వాలు పారదర్శకమైన, సులభతరమైన వ్యవస్థలను నిర్మించాలి, అదే సమయంలో పౌరులు నిరుత్సాహాన్ని వీడి క్రియాశీలకంగా ముందుకు రావాలి. ప్రభుత్వ బాధ్యతాయుతమైన విధానాలు, ప్రజల చైతన్యవంతమైన భాగస్వామ్యం కలిసినప్పుడే నిజమైన గ్రామ స్వరాజ్యం, పరిపూర్ణ ప్రజాస్వామ్యం సాధ్యమవుతాయి. అప్పుడే మన దేశ భవిష్యత్తు సురక్షితమైన చేతుల్లో ఉంటుంది.
Preserving the Foundations of Democracy * The Responsibilities of Governments and the Role of Citizens in Local and General Elections
In a democratic system, elections are not merely a process for selecting political leaders, they are a true reflection of the collective aspirations and civic consciousness of the people. However, the recent, gradual decline in voter turnout for local body elections is a cause for serious concern. This growing apathy—evident everywhere from village panchayats to municipalities and municipal corporations—poses a threat to the very foundations of democracy. It is noteworthy that while people turn out in large numbers for national-level general elections, they often show reluctance toward local elections, even though these directly impact their daily lives and standards of living. To bridge this gap and strengthen democracy from the grassroots level, governments, election commissions, and citizens must work together in a coordinated manner.
Constructive Measures for Governments and Election Authorities
The decline in voter turnout for local body elections cannot be dismissed simply as public indifference. Underlying this trend are systemic flaws, a lack of transparency, and an erosion of public trust in governance. To reverse this situation, it is crucial for governments to take the following steps:
Simplifying the Election Process
Voters should not be subjected to the ordeal of waiting for hours at polling stations. Mobile apps providing real-time updates on queue status, digital voter slips, and faster polling procedures should be introduced. Special, accessible facilities must be provided for the elderly, pregnant women, and persons with disabilities.
Continuous Civic Education and Awareness
Relying solely on campaigns conducted in the final days following an election notification is insufficient. From the school and college levels, students should be educated on the importance of local governing bodies, the functions of municipalities, and the value of the right to vote. Public awareness initiatives should help citizens understand that essential daily needs—such as drinking water, sanitation, street lighting, and drainage systems—are fulfilled through local governments.
Increasing Voter Participation in Urban Areas
Voter turnout in urban areas is alarmingly low, reflecting a clear sense of apathy among the middle class and the intelligentsia. To address this, special polling stations should be established within gated communities, apartment complexes, and IT parks. Furthermore, the provision of dedicated leave for employees to cast their votes must be strictly enforced.
The Duty of Citizens Moving Beyond Irresponsibility Toward Active Participation
Regardless of how robust an electoral system may be, democracy will falter if citizens neglect their responsibilities. Pessimistic attitudes—such as “What harm will it cause if I don’t vote?” or “Whoever wins, our lives won’t change”—only serve to cast the nation’s future into darkness.
Viewing Voting as a Sacred Responsibility
Just as paying taxes and respecting the law are essential, electing the right leaders every five years is equally vital. Local body elections, in particular, offer us the chance to choose representatives who will develop our own streets and wards. Therefore, the right to vote should be seen not merely as a personal privilege, but as a social responsibility.
Choosing Corruption-Free, Capable Leadership
Selling one’s vote—whether swayed by caste, religion, money, handouts like bottles of liquor, or empty promises of “freebies”—is a betrayal of society. Voters should evaluate candidates based on their track record, past performance, and their understanding of local issues. True change can only be achieved through the ballot box.
Cultivating a Spirit of Constant Questioning
A citizen’s responsibility does not end with casting a vote on election day. Citizens have both the right and the duty to hold elected representatives accountable and question whether they are performing their roles effectively. Resident welfare associations and local youth groups should engage with the government regarding public issues and demand transparency. Local governing bodies are the foundation stones of a democratic system. If these foundations weaken, the entire edifice of democracy at the national level risks collapse. The recent decline in voter turnout serves as a serious warning. Governments must establish transparent and accessible systems, while citizens, for their part, should overcome any sense of disillusionment and engage actively. True ‘Gram Swaraj’ (self-rule at the village level) and a complete democracy can only be realized when responsible governance is combined with the vibrant participation of the people. Only then will the future of our nation remain in safe hands.
This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy. I Agree