మావిగన్ దెబ్బకు 11సీట్లు కూడా పోవడం ఖాయం….
– మంత్రి కొలుసు పార్థసారధి
వైసీపీ అధ్యక్షులు, పులివెందుల శాసనసభ్యులు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మావిగన్ ఎజెండాతో 2029 ఎన్నికలకు వెళతాం అని చేసిన ప్రకటనతో ఈ రాష్ట్రానికి పట్టిన 11వ నంబర్ దరిద్రం పోవడం ఖాయం. 2019-24 మధ్య 3 రాజధానులు అంటూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డికి 151 నుండి 11సీట్లకు చతికిలపడినా ఇంకా తత్వం బోధపడలేదు. 2029లో తనకు అధికారం వస్తే మరోసారి రాష్ట్ర రాజధాని భవిష్యత్తుతో చెలగాటమాడతానని, రైతుల త్యాగాలను అపహాస్యం చేస్తానని, ఇప్పటి వరకు రాజధానిలో జరిగిన పనులన్నింటినీ జేసీబీతో కుప్పకూల్చడం ఖాయం అని జగన్ చెప్పకనే చెప్పారు. ఎన్నో పవిత్రస్థలాల నుండి పవిత్ర జలాలు, మట్టితో శంకుస్థాపన చేసిన ఐదుకోట్ల ఆంధ్రుల రాజధాని అమరావతితో చెలగాటమాడిన జగన్ కు బుద్ధిచెప్పిన రాష్ట్ర ప్రజలు, ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే 11 నుండి 1సంఖ్యకు పరిమితం చేయడం తధ్యం.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో రాజధాని అంటున్న జగన్మోహన్ రెడ్డికి అసలు రాజధాని పరిధి ఎక్కడివరకు విస్తరించి ఉందో కనీస అవగాహన కూడా లేదని ఈరోజు మరోసారి స్పష్టం చేశాడు. ప్రస్తుతం రాజధాని పరిధి మచిలీపట్నం పార్లమెంటు, విజయవాడ పార్లమెంటు, గుంటూరు పార్లమెంటుల మధ్య కేంద్రీకృతమైంది. కనీసం ఈ విషయంపై కూడా జగన్ కి అవగాహన లేకుండా మావిగన్ అని చెప్పడం అంటే పూర్తిగా అవివేకం కాక మరొకటి కానేకాదు. అమరావతికి చట్టబద్ధత లభించినా, గెజిట్ విడుదలైనప్పటికీ జగన్ అమరావతిని నాశనం చేయడమే తన పంతంగా పెట్టుకున్నాడని తేటతెల్లమైంది. మావిగన్ 2029 సార్వత్రిక ఎన్నికల వరకు కాదు, త్వరలోనే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దెబ్బకే తుప్పుపట్టి విరిగిపోవడం ఖాయం.
మాటతప్పడం, మడమను 360డిగ్రీల కోణంలో తిప్పడం జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. 2029 ఎన్నికలు వచ్చేనాటికి జగన్ తన మావిగన్ ప్రతిపాదనను మార్చేసి మరో ప్రతిపాదనతో రాష్ట్ర ప్రజలను పూర్తిగా పక్కదోవ పట్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. మొదట అమరావతే రాజధాని అన్నాడు, తర్వాత 3రాజధానులు అన్నాడు, నేడు మావిగన్ అంటున్నాడు, ఆ తర్వాత ఏ గన్ తెస్తారోనని రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
ఐదుకోట్ల ఆంధ్రుల కలల రాజధానికి కులాలను అంటగట్టి కుప్పకూల్చే కుతంత్రాలు చేయడం జగన్మోహన్ రెడ్డి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. దేవతల రాజధాని అమరావతి జోలికి ఎవరు వచ్చినా, చెడగొట్టాలని చూసినా ఫలితం అనుభవించక తప్పదు. రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరగడం చూసి జగన్ కి నిద్రపట్టడం లేదు. 2029లో అధికారంలోకి వస్తామని, మావిగన్ తో అమరావతిని కూల్చేస్తామని ఉత్తరకుమార ప్రగల్భాలు పలకడం శోచనీయం. జగన్ అధికారంలోకి రావడం కాదు, ప్రస్తుతం ఉన్న 11సీట్లు కుప్పకూలకుండా నిలబెట్టుకుంటే గొప్పే. జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధ్వంసపూరితమని, కూటమి ప్రభుత్వ పాలన వికాసం వైపు దూసుకెళుతోందని రాష్ట్ర ప్రజలు గ్రహించారు, నమ్ముతున్నారు. ఈ నమ్మకాన్ని జగన్ ఎన్ని కుయుక్తులు పన్నినా దెబ్బతీయలేరు.
It is certain that even those 11 seats will be lost due to the ‘Mavigan’ factor…
– Minister Kolusu Parthasarathy
With YCP President, Pulivendula MLA, and former CM Jagan Mohan Reddy announcing that he would head into the 2029 elections with the ‘Mavigan’ agenda, it is certain that the state will finally be rid of the ‘curse of the number 11’ that has plagued it. Despite plummeting from 151 seats to just 11 after ruining the state with his “three capitals” rhetoric between 2019 and 2024, Jagan Mohan Reddy has failed to learn his lesson. He has implicitly signaled that if he regains power in 2029, he will once again toy with the future of the state capital, mock the sacrifices made by farmers, and inevitably use JCBs to demolish all the infrastructure developed in the capital so far. The people of the state have already taught a lesson to Jagan for playing games with Amaravati—the capital of five crore Andhras, which was inaugurated with sacred water and soil from numerous holy sites; if he does not change his ways now, he will certainly be reduced from 11 seats to just one.
By speaking of the capital in terms of the Machilipatnam, Vijayawada, and Guntur regions, Jagan Mohan Reddy has once again made it clear that he lacks even a basic understanding of the actual geographical extent of the capital region. In reality, the capital region is currently centered across the Machilipatnam, Vijayawada, and Guntur parliamentary constituencies. It is nothing short of sheer foolishness for Jagan to speak of “Mavigan” without even a basic understanding of the issue. It has become evident that, despite Amaravati gaining legal sanctity and the official gazette notification being issued, Jagan is hell-bent on destroying it. “Mavigan” is certain to rust and crumble—not by the 2029 general elections, but under the impact of the upcoming local body elections.
Going back on his word and making a complete U-turn (a 360-degree flip) is second nature to Jagan Mohan Reddy. By the time the 2029 elections arrive, he will likely abandon the “Mavigan” proposal and come up with yet another one to completely mislead the people of the state. First, he declared Amaravati as the capital; then, he proposed three capitals; now, he speaks of “Mavigan”; people are left wondering what kind of “gun” he might introduce next.
Jagan Mohan Reddy’s attempts to sabotage the dream capital of five crore Andhras by injecting caste-based politics into the issue are a testament to his low-level political tactics. Anyone who dares to meddle with or attempt to ruin Amaravati—the capital of the gods—will inevitably face the consequences. The rapid pace of capital construction work is giving Jagan sleepless nights. It is pathetic to hear him make grandiose, hollow boasts about coming to power in 2029 and demolishing Amaravati with “Mavigan.” Far from returning to power, it would be an achievement for him just to retain his current 11 seats without losing them. The people of the state realize and believe that Jagan Mohan Reddy’s administration was destructive, whereas the alliance government’s rule is racing towards progress. No matter what devious schemes Jagan devises, he cannot undermine this belief.
















































