సాంస్కృతిక ప్రాభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు 2026
* అమరావతిలో ఈవెంట్ బ్రోచర్‌ను ఆవిష్కరించిన పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్
ఏపీ సచివాలయం/అమరావతి/విజయవాడ:
ప్రస్తుత సాహితీ, సాంస్కృతిక ,కళా రంగాల నేపథ్యంలో, మన సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ‘జాతీయ సాంస్కృతిక ఉత్సవం’ (National Cultural Festival) నిర్వహించడం ఎంతో అవసరమని పర్యాటక ,సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.
శుక్రవారం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని తన కార్యాలయంలో, నిర్వాహకులతో కలిసి ‘జాతీయ సాంస్కృతిక ఉత్సవం 2026’కు సంబంధించిన బ్రోచర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ‘మల్లెతీగ’ సాహిత్య సేవా సంస్థ ,ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరగనున్నాయి.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, డిసెంబర్ 12, 13 తేదీలలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్న ఈ ఉత్సవాలు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి కవులు, కళాకారులు, కార్టూనిస్టులు ,ఛాయాచిత్రకారులను ఒకచోట చేర్చి, నగరానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తాయని అన్నారు. కథలు, కవిత్వం, కార్టూన్లు ,ఛాయాచిత్రాల విభాగాల్లో నిర్వహించిన పోటీలలో విజేతగా నిలిచిన రచనలు/కళాఖండాలతో ఒక ప్రత్యేక సంచికను ప్రచురించడం ఒక చారిత్రాత్మక మైలురాయి అని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జరుగుతున్న ఈ భారీ జాతీయ స్థాయి సాంస్కృతిక ఉత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. గత కొన్నేళ్లుగా ఇటువంటి సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను నిరంతరాయంగా నిర్వహిస్తున్న ‘మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ’ నిర్వాహకులను ,సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కళాభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మల్లెతీగ కలిమిశ్రీ, ఉత్సవాల సాంస్కృతిక విభాగం ఇన్ఛార్జ్ వై.డి. ఆనంద్, రాష్ట్ర కన్వీనర్ పి. హుస్సేన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
National Cultural Festival 2026 – Showcasing Cultural Splendor to the World
* Minister for Tourism and Culture minister Kandula Durgesh, unveils the event brochure in Amaravati
AP Secretariat/Amaravati/Vijayawada:
Minister for Tourism and Culture, Kandula Durgesh, stated that organizing a ‘National Cultural Festival’—one that showcases our cultural splendor to the world—is essential for the current landscape of literature, culture, and the arts.
On Friday, at his office in the Andhra Pradesh Secretariat, the Minister—alongside the organizers—unveiled the brochure for the ‘National Cultural Festival 2026,’ an event being held under the joint auspices of the ‘Malle Teega’ Literary Service Organization and the NTR District administration.
Speaking on the occasion, the Minister noted that the festival, set to take place on December 12th and 13th at the Tummalapalli Kalakshetram in Vijayawada, will bring a new vibrancy to the city by hosting poets, artists, cartoonists, and photographers from various states across the country. He highlighted that the publication of a special edition—featuring the winning entries from the competitions held in the categories of short stories, poetry, cartoons, and photography—marks a historic milestone.
He further emphasized that everyone should participate in this large-scale, national-level cultural festival taking place here in Vijayawada, Andhra Pradesh. Special appreciation was extended to the organizers and members of the ‘Malletheega Sahitya Seva Samstha’ (Malletheega Literary Service Organization) for consistently conducting such literary and cultural programs over the years. An appeal was made to art enthusiasts and the general public to participate in large numbers and ensure the grand success of this event.
Those who participated in this program included Malletheega Kalimishri, Y.D. Anand (in-charge of the cultural wing for the festivities), and P. Hussain Khan (State convener for the festivities).






















































