సింగపూర్ లో కొనసాగుతున్న ఏపీ మంత్రుల పర్యటన
సింగపూర్ విదేశీ వ్యవహారాలు,వాణిజ్య,పరిశ్రమల శాఖ మంత్రి గన్ సియో హువాంగ్ (Gan Siow Huang) తో భేటీ అయిన మంత్రులు
సింగపూర్ లోని భారత్ హై కమిషనర్ సమక్షంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న మంత్రులు నారాయణ,బీసీ జనార్దన్ రెడ్డి,అనిత,అచ్చెన్నాయుడు,సత్య కుమార్,అనగాని సత్య ప్రసాద్
భారత్–సింగపూర్ మధ్య ఉన్న దీర్ఘకాలిక స్నేహ సంబంధాలు,ఆర్థిక భాగస్వామ్యం,పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించిన ఇరు దేశాల నేతలు.
ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణ, మౌలిక వసతులు, లాజిస్టిక్స్, పునరుత్పాదక శక్తి రంగాల్లో సహకారం పై చర్చ
స్మార్ట్ సిటీస్, అర్బన్ ప్లానింగ్,వ్యర్థాల నిర్వహణలో సింగపూర్ నైపుణ్య వినియోగం, నైపుణ్యాభివృద్ధి, వృత్తిపరమైన విద్య, & శిక్షణ కార్యక్రమాలు, ఫిన్‌టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీ రంగాల్లో భాగస్వామ్యం వంటి అంశాలపై విస్తృత స్థాయిలో జరిగిన చర్చలు
సింగపూర్‌లోని ఆధునిక పరిపాలన విధానాలు, నగరాభివృద్ధి నమూనాలు, & సుస్థిర అభివృద్ధి అంశాలపై శిక్షణ ఇవ్వనున్న ఆ దేశ ప్రభుత్వం
ఈ సమావేశం పూర్తి సానుకూల వాతావరణంలో జరగడంతో… భవిష్యత్తులో భారత్–సింగపూర్ మధ్య సంబంధాలు మరింత బలపడతాయని విశ్వాసం వ్యక్తం చేసిన ఇరు దేశాల నేతలు.
సింగపూర్/ అమరావతి
21.04.26.
సింగపూర్ లో మంత్రుల బృందం పర్యటన
* సింగపూర్‌లో ఒక వారపు శిక్షణ కార్యక్రమంలో భాగంగా నేడు ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు
* సింగపూర్‌లోని అవర్ టాంపినీస్ హబ్ (Our Tampines Hub) లో ఉన్న ఫెస్టివ్ ఆర్ట్స్ థియేటర్ (Festive Arts Theatre) ను సందర్శించిన మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత





























































