సివిల్ సర్వెంట్స్ రూల్ ఆఫ్ లాకు లోబడి సమర్ధవంత సేవలు అందించేలా కృషి చేయాలి:సిఎస్
అమరావతి, ఏప్రిల్ 21:
సివిల్ సర్వెంట్స్ రూల్ ఆఫ్ లాకు లోబడి తన విధులను సమర్ధవంతంగా సేవలు అందించేందుకు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ స్పష్టం చేశారు.మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో 18వ సివిల్ సర్వీసెస్ దినోత్సవ వేడుకలు జరిగాయి.ఈకార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈఏడాది వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047 సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్ ఫర్ లాస్ట్ మైల్ డెలివరి అనే నినాదంతో ఈ వేడుకను నిర్వహించారు.2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యానికి అనుగుణంగా,ప్రభుత్వ పథకాలు సమాజంలోని దిగువ అంచున ఉన్న ప్రతి వ్యక్తికీ చేరాలనే సంకల్పాన్ని ఈ థీమ్ ప్రతిబింబిస్తోంది.ఈసంద్భంగా సిఎస్ మాట్లాడుతూ 1947 ఏప్రిల్ 21న భారత తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూతనంగా నియమితులైన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ, సివిల్ సర్వెంట్లను “భారతదేశ ఉక్కు చట్రం”గా అభివర్ణించారు.ఆ చారిత్రక ఘట్టానికి గుర్తుగా ప్రతిఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు.భారతదేశ పరిపాలన వ్యవస్థకు సివిల్ సర్వెంట్లు వెన్నెముక వంటివారని వీరి అంకితభావాన్ని,నిరంతర కృషిని గౌరవిస్తూ ప్రతి ఏడాది ఏప్రిల్ 21న ‘జాతీయ పౌర సేవల దినోత్సవం’ (National Civil Services Day) నిర్వహిస్తున్నారని దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే అధికారులను ప్రోత్సహించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశమని సిఎస్ సాయి ప్రసాద్ చెప్పారు.
సివిల్ సర్వెంట్ గా రూల్ ఆఫ్ లా కు లోబడి మన విధులను సమర్ధవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని సిఎస్ సాయి ప్రసాద్ పునరుద్ఘాటించారు.సమాజంలోని ప్రతి వ్యక్తి సౌకర్యవంతంగా ఉండాలని కోరుకుంటాడని అందుకై మనపై అనేక ఆశలు పెట్టుకుంటారని పేర్కొన్నారు.సివిల్ సర్వెంట్ గా ఎల్లప్పుడూ ఆదర్శవంతంగా ఉండాలని అదే సమయంలో తన పని తీరును మెరుగుపర్చుకునేందుకు నిరంతరం విజ్ణానాన్ని,ఆధునిక సాంకేతికతను అలవర్చుకోవాలని సూచించారు.అదే విధంగా ఆలోచనలు మానసిక స్థితిని ఎల్లప్డుడూ సక్రమంగా ఉంచుకోవాలని సూచించారు.సవిల్ సర్వెంట్ గా విధి నిర్వహణలో టఫ్ గా ఉండాలి అదే సమయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సిఎస్ స్పష్టం చేశారు.ప్రొసీజర్,బిజినెస్ రూల్స్,సాంప్రదాయాలను పాటిస్తూనే సమస్యల పరిష్కారాల మార్గాలను కనుగొనాలని సూచించారు.ప్రజా సేవ కోసం వచ్చాం అందుకోసమే పని చేయాలని ప్రజా హితానికి వ్యతిరేకంగా ఎంతమాత్రం పని చేయరాదని సివిల్ సర్వెంట్లకు మరీ ముఖ్యంగా యువ సివిల్ సర్వెంట్స్ కు సిఎస్ సాయి ప్రసాద్ స్పష్టం చేశారు.
ఈకార్యక్రమానికి స్వాగతం పలికిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ మాట్లాడుతూ ఈఏడాది వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047 సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్ ఫర్ లాస్ట్ మైల్ డెలివరి అనే నినాదంతో సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సమాజాభివృద్ధిలో సివిల్ సర్వెంట్స్ పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.సివిల్ సర్వెంట్స్ వారి పనితీరును మెరుగుపర్చుకునేందుకు ప్రతి సాంకేతికతను ఉపయోగించు కోవాలి సూచించారు. ఎపి సివిల్ సర్వెట్స్ అంటే దేశంలో ఒక మంచి గుర్తింపు ఉందని దానిని నిలుపుకొనేందుకు వీలుగా ప్రతి సివిల్ సర్వెంట్ మరింత సమర్థవంతంగా పని చేయాల్సిన ఆవశ్యకత ఉందని సూచించారు.
ఇంకా ఈకార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఆర్పి సిసోడియా, సునీత,యం.టి. కృష్ణబాబు,ముఖ్య కార్యదర్శులు జె.శ్యామల రావు, వినయ్ చంద్, ఎన్.యువరాజ్, హరి జవహర్ లాల్,సియం కార్యదర్శులు ప్రద్యుమ్న,కార్తికేయ మిశ్ర తదితర ఉన్నతాధికారులు మాట్లాడారు.
అనంతరం సిఎస్ సాయి ప్రసాద్ కార్యక్రమంలో పాల్గొన్నఅందరితో వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా దేశ సమగ్రత, స్వేచ్ఛను కాపాడుతానని, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పధకాల ఫలాలు చిట్ట చివరి వ్యక్తి వరకూ సక్రమంగా అందేలా పారదర్శకంగా,నిష్పక్షపాతంగా చిత్త శుద్ధి అంకిత భావంతో పని చేస్తానని సివిల్ సర్వీసెస్ రీడిడికేషన్ ప్రతిజ్ణ చేయించారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు,వివిధ శాఖాధిపతులు,ఇతర అధికారులు,ఉద్యోగులు పాల్గొన్నారు.
















































