అమ్మ చేతి చాయ్ ఆరోగ్యం, ఆశీర్వాదం కూడా!
-
సంఘటనల్ని పదునైన వార్తలుగా మార్చే ఇంధనం- చాయ్
-
అరకు కాఫీ లాగా అరకు ఆర్గానిక్ చాయ్ కి ప్రాచుర్యం కల్పించాలి
-
‘చాయ్’ పుస్తకావిష్కరణలో సీనియర్ జర్నలిస్టుల ఆకాంక్ష
-
సూర్యోదయానికి ముందే అమ్మ చేత్తో ఇచ్చే చాయ్ ఆ రోజంతటినీ శక్తివంతం చేసే కొత్త ఉత్సాహపు ఆశీర్వాదం అని అన్నారు కామ్రేడ్ జి.ఆర్. కె. – పోలవరపు సాంస్కృతిక సమితి వ్యవస్థాపకులు గోళ్ళ నారాయణరావు.
స్థానిక గవర్నరు పేటలో గల నవరంగ్ టీ స్టాల్లో బుధవారం డా. ఘంటా విజయ్ కుమార్ రాసిన ‘చాయ్’ మల్టీకలర్ చిరు పుస్తక ఆవిష్కరణ మల్లెతీగ సాహిత్యసేవాసంస్థ నిర్వహణలో జరిగింది. పుస్తకాన్ని ఆవిష్కరించిన నారాయణరావు మాట్లాడుతూ- అరకు కాఫీకి అంతర్జాతీయ ప్రాచుర్యం కల్పించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అరకులో తయారయ్యే ఆర్గానిక్ టీకి కూడా ప్రాచుర్యం కల్పించాలని కోరారు. ఆవిష్కరణలో పాల్గొన్న మల్లెతీగ కలిమిశ్రీ – రాజ్యాంగ రూపశిల్పి డా. బి.ఆర్. అంబేడ్కర్ చాయ్‌ని చురుకైన, మెరుగైన ఆలోచనలకు ఇంధనంగా ఉపయోగించుకున్నారని అన్నారు. ఏపీయుడబ్ల్యుజే రాష్ట్ర ఉపాధ్యక్షులు చావా రవి – జరిగిన, జరుగుతున్న, జరగబోయే సంఘటనల్ని పదునైన, వేగవంతమైన వార్తలుగా మార్చే వేడి వేడి పానీయం చాయ్ అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ ఫోరం గౌరవాధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ అన్నవరపు బ్రహ్మయ్య – ఉదయాన్నే చాయ్ తో జర్నీ మొదలైతే ఆ రోజంతా ఎంతో ఉల్లాసంగా గడిచిపోతుందన్నారు. ఏపీ మీడియం స్మాల్ డైలీ & పీరియాడికల్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు, రాజధాని వార్తలు ఎడిటర్ పి. హుస్సేన్ ఖాన్ – ఆర్గానిక్ చాయ్ లో వున్న కొన్ని పదార్థాలు శక్తిని, ఆరోగ్యాన్ని ఇస్తాయన్నారు. సీనియర్ జర్నలిస్ట్ మట్టా ప్రభాత్ కుమార్, స్టేట్ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్ కార్యదర్శి వై. డి. ఆనంద్- సెగలు కక్కే చాయ్ తాగి తీసిన ఛాయాచిత్రం బెస్ట్ ఫొటోగా వస్తుందన్నారు.
పుస్తక రచయిత డా. ఘంటా విజయ్ కుమార్ – చాయ్ పుస్తకాన్ని విజయవాడలో ప్రసిద్ధ నవరంగ్ టీ స్టాల్లో ఆవిష్కరించాలన్న వినూత్న ఆలోచన చేసిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. తొలి కాపీని గోళ్ళ నారాయణరావు రచయిత దగర కొనుగోలు చేశారు.
Tea made by mom is both a source of well-being and a blessing!
- Tea serves as the fuel that transforms events into sharp, incisive news.
- Just like Araku coffee, Araku’s organic tea should also be promoted and popularized.
- — Sentiments expressed by senior journalists at the launch of the mini book ‘Chai’ (Tea).




















































