నారాయణ,మంత్రి కామెంట్స్….
తాడికొండ, కంతేరు, మోతడక, కొప్పురావూరు గ్రామాల మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే ట్రాక్ వెళ్తుంది.
- ల్యాండ్ అక్విజిషన్‌కు వెళ్ళాలా పూలింగ్ కు వెళ్లాలా అనే దానిపై రైతుల అభిప్రాయాలు తీసుకున్నాం.
- గ్రామ సభలో మెజారిటీ రైతులు ల్యాండ్ పూలింగ్‌కు అంగీకారం తెలిపారు.
- 50 ఎకరాల భూమికి రైతులు ఇప్పటికే పత్రాలు సమర్పించారు.
- రైతుల సందేహాలన్నింటికీ ప్రభుత్వం సమాధానం ఇచ్చింది: మంత్రి నారాయణ
- రైతులకు అనువైన చోటే రిటర్న్ ప్లాట్లు ఇస్తాం: మంత్రి
- రెండు, మూడు లేఅవుట్ డిజైన్లు చూపించి రైతుల అభిప్రాయం మేరకు ప్లాట్లు కేటాయిస్తాం.
- 2027 మార్చి నాటికి 350 కి.మీ ట్రంక్ రోడ్లు పూర్తి: మంత్రి నారాయణ
- 2027 చివరి నాటికి అమరావతి లేఅవుట్లు పూర్తి చేస్తాం
- ఈ నెల 25న ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రభుత్వానికి అప్పగిస్తాం.
- వచ్చే నెల 15న ఎమ్మెల్సీ క్వార్టర్స్,
- సెప్టెంబర్ మొదటి వారంలో మంత్రుల నివాసాలు అప్పగిస్తాం.
- ప్రతి 15 రోజులకు సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తున్నారు: మంత్రి
- అమరావతి పనులపై ప్రతిరోజూ నేను సమీక్ష చేస్తున్నా: మంత్రి నారాయణ
- ల్యాండ్ పూలింగ్ వేగంగా పూర్తైతే ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే ట్రాక్ పనులు వెంటనే ప్రారంభిస్తాం.
- రైల్వే శాఖ పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది: మంత్రి నారాయణ
- ఇన్నర్ రింగ్ రోడ్ వెంట సర్వీస్ రోడ్లు కూడా ఏర్పాటు చేస్తాం
- రైతులు త్వరగా భూములు ఇస్తే త్వరగా ప్లాట్లు కేటాయిస్తాం: మంత్రి నారాయణ
- అమరావతి అభివృద్ధిలో రైతుల సహకారం కీలకం: మంత్రి నారాయణ
- ల్యాండ్ పూలింగ్‌కు సహకరించిన రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మంత్రి నారాయణ.

















































