కొండెపి
బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు నిర్ణయంపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
పార్టీ పరంగా బీసీలకు న్యాయం చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి
నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి
* సామాజికంగా, ఆర్ధికంగా రాజకీయంగా బీసీలను అభివృద్ధి చేసింది టీడీపీనే
* బీసీలు టీడీపీ వెన్నంటే ఉంటారు.
* మేం తెచ్చిన 34 శాతం రిజర్వేషన్లను గత పాలకులు అమలు చేయలేదు.
* గత ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి కుదించడం వల్ల ఎంతో మంది అవకాశాలు కొల్పోయారు.
* కూటమి అధికారంలోకి వచ్చాక బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పెంచాం.
* కానీ గొడ్డలి పార్టీ కోర్టుకు వెళ్లి రిజర్వేషన్లు అమలు కానీయకుండా అడ్డుకుంది.
* హైకోర్టు, సుప్రీం కోర్టులో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది.
* బీసీలకు రిజర్వేషన్లు అమలు కాకూడదన్నది గొడ్డలి పార్టీ కుట్ర. అందుకే కేసులు వేసింది.
* వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగాలని కోరుకుంటాం.
* బీసీలకు న్యాయం జరక్కూడదు, రిజర్వేషన్లు రాకూడదు, బాగుపడకూడదనే ఉద్దేశ్యంతో గొడ్డలి పార్టీ నేతలు అడ్డం పడ్డారు.
సుప్రీం కోర్టు ఈ రిజర్వేషన్ల అమలు జీవోను కొట్టివేసింది. అయినా మేం పార్టీ పరంగా బీసీలకు న్యాయం చేస్తాం
పార్టీ పరంగా బీసీలకు 34 శాతం సీట్లు ఇస్తాం
స్థానిక ఎన్నికలను కూడా అడ్డుకోవాలని గొడ్డలి పార్టీ ఆలోచన చేసింది
సర్ పేరిట ఎన్నికలు జరక్కుండా ప్రయత్నం చేసేలా కోర్టులకు ఎక్కారు













































