సి.ఆర్. మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీ ఆలపాటి సురేశ్ కుమార్ తో మర్యాద పూర్వక భేటీ:
బాధ్యతల స్వీకరణ అనంతరం సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ తేళ్ల కస్తూరి అకాడమీ చైర్మన్ శ్రీ ఆలపాటి సురేశ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా అకాడమీ చేపట్టిన గ్రామీణ విలేఖరుల శిక్షణా తరగతులు గురించి చర్చించారు. అకాడమీ కార్యక్రమాలను విజయవంతం చేసేలా ఉద్యోగుల సమన్వయ పరిచి కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అకాడమీ మేనేజర్ శ్రీ ఎం. భాస్కర నారాయణ,డి.పి .ఓ శ్రీ ఎం. లోవరాజు, చైర్మన్ పి .ఎస్ శ్రీనివాస జీవన్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.











































