వీధి రౌడీలా వ్యవహరిస్తున్న పులివెందుల ఎమ్మెల్యే జగన్
- * తీవ్రంగా మండిపడ్డ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు
- జగన్ మాట్లాడిన తీరు అత్యంత హేయం, వీధి రౌడీ భాషను తలపించింది.
- సొంత గడ్డ పులివెందులలోనే వైఎస్సార్సీపీ పతనం సంపూర్ణమైంది.
- మేనమామ కాదు.. కంసమామలా వ్యవహరించిన చరిత్ర జగన్‌ది.
- 2029లో వైసీపీకి శాశ్వత రాజకీయ సమాధి తప్పదు.
అమరావతి:
పులివెందుల పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు అత్యంత హేయంగా ఉందని, ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష కాదని టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడిన మాటలు పూర్తిగా వీధి రౌడీ భాషను తలపించాయని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
అధోగతి పాలైన పాలన – ప్రజల నుంచి తిరస్కరణ:
2019లో “ఒక్క అవకాశం” అంటూ అధికారంలోకి వచ్చిన జగన్, ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని విధ్వంసకర పాలనతో సర్వనాశనం చేశారని యరపతినేని విమర్శించారు. ఆ పాలన, ఆయన వాడిన భాషను చూసే 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తోకతో పాటు కుర్చీ కూడా మడతపెట్టి ఇంటికి పంపించారన్నారు. ప్రజలు కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే పరిమితం చేసినా ఆయనలో అహం తగ్గలేదని, ఇంకా అదే విద్వేషం, అదే విధ్వంసకర మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. చొక్కాలు మడిచి బజార్లోకి రండి, తిరగబడండి అంటూ మాట్లాడటం ఆయన పగటి కలలకు నిదర్శనమని, తీవ్ర నిరాశలో మునిగిపోయిన శ్రేణులను బుజ్జగించడానికే ఈ ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు.
కంచుకోటలోనే కనుమరుగవుతున్న వైసీపీ:
రాష్ట్రంలో వైఎస్సార్సీపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో జగన్‌కు బాగా తెలుసని యరపతినేని పేర్కొన్నారు. తన కంచుకోట అనుకునే రాయలసీమలోనే కాదు, సొంత నియోజకవర్గమైన పులివెందులలో కూడా పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రారంభమైన జగన్ పతనం, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికలతో సంపూర్ణమైందని స్పష్టం చేశారు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పులివెందులలో కూడా ఎన్డీయే కూటమి ఏకపక్ష విజయం సాధించి వైఎస్సార్సీపీని తుడిచిపెట్టేసిందని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు నామినేషన్లు కూడా వేయనీయకుండా అరాచకాలు సృష్టించిన జగన్‌కు, ఇప్పుడు ప్రజలే సరైన గుణపాఠం చెబుతున్నారని అన్నారు.
మేనమామ కాదు.. కంసమామ:
సొంత చెల్లెలు వైఎస్ షర్మిల కుమార్తె వివాహానికి జగన్ వ్యవహరించిన తీరు ఆయన రాక్షస మనస్తత్వానికి నిదర్శనమని యరపతినేని మండిపడ్డారు. మేనకోడలి పెళ్లి ఏర్పాట్లు పూర్తియిన తర్వాత అడ్డంకులు సృష్టించడం సిగ్గుచేటని, ఆయన అసలు మేనమామనా లేక కంసమామనా అనేది ప్రజలు ఆలోచించాలని కోరారు. సొంత కుటుంబంలోని మహిళలకే గౌరవం ఇవ్వని వ్యక్తి, రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలపై చూపేది ముమ్మాటికీ కపట ప్రేమేనని విమర్శించారు.
కూటమి పాలనలో శరవేగంగా అభివృద్ధి:
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, మంత్రి నారా లోకేష్ చొరవతో ఐటీ పరిశ్రమలు, పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. గతంలో ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ నేతల తీరు మారలేదని, నోళ్లు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. 2029 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి శాశ్వత రాజకీయ సమాధి కట్టడం ఖాయమని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 100 శాతం స్ట్రైక్ రేట్‌తో క్లీన్ స్వీప్ చేస్తుందని యరపతినేని ధీమా వ్యక్తం చేశారు.
Pulivendula MLA Jagan Behaves Like a Street Thug
- * Strong condemnation from MLA Yarapatineni Srinivasa Rao
- The manner in which Jagan spoke is utterly despicable; it was reminiscent of the language used by street thugs.
- The downfall of the YSRCP is now complete, even in its own stronghold of Pulivendula.
- Jagan has a history of acting not like a maternal uncle, but like ‘Kamsa’ (a malevolent, tyrannical uncle from mythology).
- In 2029, the YSRCP will inevitably face its permanent political burial.
Amaravati:
TDP MLA Yarapatineni Srinivasa Rao has expressed strong indignation over the conduct and language of former Chief Minister and current Pulivendula MLA, Y.S. Jagan Mohan Reddy, during his visit to Pulivendula. He remarked that the way Jagan spoke was absolutely disgraceful—far from the language expected of a former Chief Minister—and likened his words to the crude, aggressive speech of a street thug. He made these comments during a press conference held at the Telugu Desam Party’s central office.
A Disastrous Administration – Rejected by the People:
Yarapatineni criticized Jagan, who came to power in 2019 asking for “just one chance,” for devastating the state with five years of destructive governance. He stated that it was precisely this style of governance—and the language he employed—that led the people of the state to decisively oust him in the 2024 elections, effectively sending him packing. He further slammed Jagan for failing to shed his arrogance, noting that even though the public has now reduced him to the status of a mere MLA for Pulivendula, he continues to harbor the same hatred and persist with the same destructive rhetoric. He mocked Jagan’s call to “roll up your sleeves and take to the streets to fight back,” describing it as a mere daydream—a boastful attempt to pacify a party cadre deeply mired in frustration and despair.
YSRCP fading away even in its own stronghold:
Yarapatineni stated that Jagan is well aware of the dire state of the YSRCP in the state. He noted that the party’s position has completely collapsed—not just across Rayalaseema, which Jagan considers his stronghold, but even in his own constituency, Pulivendula. He asserted that the decline, which began during the 2024 general elections, has now reached its completion with the recent local body by-elections. He pointed out that the NDA alliance secured a one-sided victory in the Mandal and Zilla Parishad elections in Pulivendula, effectively wiping out the YSRCP. He added that the people are now teaching a fitting lesson to Jagan—a man who, while in power, had orchestrated atrocities by preventing others from even filing their nomination papers.
Not a maternal uncle, but a ‘Kamsa-mama’ (a malevolent uncle):
Yarapatineni lashed out at Jagan for his conduct regarding the wedding of his own sister Y.S. Sharmila’s daughter, calling it a testament to his monstrous mindset. He remarked that it is shameful for Jagan to have created obstacles after all the wedding preparations for his niece were already complete, and urged the public to consider whether he is truly a maternal uncle or, rather, a ‘Kamsa-mama’—a reference to the tyrannical uncle from mythology who sought to destroy his own kin. He criticized the individual, stating that someone who fails to show respect to the women in his own family cannot possibly harbor genuine affection for the women of the state—any such display is nothing more than hypocritical pretense.
Rapid development under the alliance government:
He noted that the state is surging ahead on a path of development under the capable leadership of Chief Minister Nara Chandrababu Naidu, with IT industries and investments pouring in thanks to the proactive efforts of Minister Nara Lokesh. He warned that YSRCP leaders have failed to change their ways despite being taught a lesson by the public in the past, and cautioned that they will face severe consequences if they do not learn to keep their language in check. Yarapatineni expressed confidence that the YSRCP will be permanently consigned to political oblivion in the 2029 elections, and predicted that the NDA alliance will achieve a clean sweep in the local body elections with a 100 percent strike rate.
























































