– / యూదుల అసలు చరిత్ర / –
అసలు యూదులు ఎవరు? ఆ జాతి వాస్తవికత ఏమిటి? ఇశ్రాయేల్ అనే దేశం ఎప్పుడైనా ఉందా? పాలస్తీనా యూదుల స్వంత భూభాగమా? ఒకప్పుడు వారిని పాలస్తీనా నుండి తరిమికొట్టింది ముస్లిములా? వగైరా ప్రశ్నలకు సమాధానమే ఈ వ్యాసం.
“ఇశ్రాయేల్” అనేది నిజానికి అది ఒక దేశం పేరో, ప్రాంతం పేరో కాదు. కానీ బైబిల్, ఖురాన్ గ్రంథాల ప్రకారం ప్రవక్త యాకోబుకు దేవుడు ఇచ్చిన బిరుదు “ఇశ్రాయేల్” అన్నది. అతని వంశావళిలో పుట్టిన యూద ప్రజలు ఇశ్రాయేలీయులని పిలువబడ్డారు.
ఇంకాస్త వెనక్కి వెళితే ప్రవక్త అబ్రహాంకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు ఇష్మాయేల్, రెండవ కొడుకు ఇస్సాక్. వీరిలో ఇష్మాయేల్ కు పుట్టిన సంతానమే ఇష్మాయేలీయులు వీరంతా అరేబియా ప్రాంతంలో స్థిరపడిన అరబ్బులు. ప్రవక్త ఇస్సాక్ కుమారుడు యాకోబు. యాకోబుకు మొత్తం 12 మంది సంతానం. ఆ పన్నెండుగురు సంతానమే ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలుగా ఏర్పడ్డారు. ఈ పన్నెండు తెగలకు సంబంధించిన ప్రజలే “ఇశ్రాయేలీయులు” అంటే. ఈ పన్నెండు తెగల్లో ఒక తెగపేరు యూదా. క్రీస్తు పూర్వం 2 వ శతాబ్దంలో ఆ తెగ పేరు మీద ఏర్పడ్డ యూదా రాజ్యాన్ని బట్టి “యూదులు” అని పిలుబడ్డారు.
అయితే యాకోబు పన్నెండుగురు సంతానంలో యేసేపు (యూసుఫ్) ఈజిప్ట్ కు రాజుగా ఉన్న కాలంలోనే అప్పటివరకూ కనాన్ లో నివాసముండే ఇశ్రాయేలూ సంతతివారి వలసలు ప్రారంభమై వారు ఈజిప్ట్ లో స్థిరపడటం మొదలెట్టారు. ఆ విధంగా కొంతకాలానికి వారి ప్రాబల్యం తగ్గి వారంతా ఈజిప్ట్ పాలకుల దాస్యంలోకి వెళ్లిపోయారు. అలా కొన్ని వందల సంవత్సరాలు వారంతా ఈజిప్ట్ ఫరో రాజుల దాస్యంలో ఉండిపోయారు. ఆ తరువాత దేవుడైన యెహోవా, మోషేను ప్రవక్తగా ఎన్నుకుని ఈజిప్ట్ రాజుల దాస్యంలో మగ్గుతున్న యూదులను విడిపించుకుని రావలసిందిగా మోషేకు ఆజ్ఞాపించటం జరిగింది.
అప్పటికే యూదులు ఈజిప్ట్ ఫరో రాజుల పాలనలో తీవ్రమైన హింసలకు గురయ్యేవారు. వారు ఇశ్రాయేలీయుల కుమారులను చంపి వారి కూతుళ్లను బ్రతకనిచ్చేవారు. అలాంటి ఘోర హింసలు సాగుతున్న నేపథ్యంలో మోషే ఫరో రాజులను ఎదిరించి వారి దాస్యం నుండి యూదులను విడిపించి కాపాడటం జరుగుతుంది. ఈజిప్టు దాస్యం నుండి విడిపించబడిన యూదులు మోషే నాయకత్వంలో మొట్టమొదట యర్ర సముద్రం మీదుగా సీనాయి ద్వీపకల్పానికి చేరుకోవటం జరుగుతుంది. సీనాయి ద్వీపకల్పం అరేబియా దేశ ఉత్తర పడమరలకు ఒక మూలన ఉన్న ప్రదేశం. ‘సీనాయి’ అరేబియాలోనే ఉన్నట్లు బైబిల్ చెబుతుంది –“అరేబియా దేశములో ఉన్న సీనాయి కొండయే” – (గలతీ 4:25). ఈ సీనాయి పర్వత శ్రేణులు అరబ్బీలో “తూర్” ప్రాంతంగా పేర్కొనబడింది. ఈ తూర్ ప్రాంతం హెబ్రూ భాషలో “హోరేబు కొండ” అని పిలబడినట్లు బైబిల్లో చూడగలం.
ఆ విధంగా ఈజిప్ట్ వారి దాస్యం నుండి విడిపించబడిన యూదులు సీనాయి ద్వీపకల్పానికి చేరుకున్న తరువాత పాలస్తీనా భూభాగంలో అప్పటికే నివశిస్తున్న అమాలేకీయులనే జాతిని తొలగించి ఆ భూభాగంలో యూదులను నివసించాల్సిందిగా ఆజ్ఞాపించటం జరుగుతుంది. ఆ విధంగా యూదులకు పాలస్తీనా బహుమతిగా ఇవ్వబడిన ప్రదేశం. తప్పితే పాలస్తీనా ప్రాంతం మొదటి నుండీ యూదుల ప్రత్యేక స్వంత భూభాగం ఏమీ కాదు.
పాలస్తీనాలో ఉన్న జెరూసలేం (యెరుషలేమ్) పట్టణంలోనే ప్రవక్త దావీదు కుమారుడు రాజైన సోలోమన్ కు “దేవుని మందిరం” కట్టాల్సిందిగా ఆజ్ఞాపించటం జరిగింది.
ఆ విధంగా ప్రవక్త మరియు రాజైన సోలోమన్ ద్వారా 950 BC లో కట్టబడిన ఆలయమే బైబిల్లో ‘సోలోమన్ టెంపుల్’ అని అరబ్బీలో “బైతుల్ మక్దిస్”, “మస్జిదే-అక్సా” అని పిలువబడింది.
అయితే 587 BC లో రాజైన నెబుకద్నేజర్ ఆధ్వర్యంలో బాబిలోనియన్ల ద్వారా యూదులపై జరిగిన దాడిలో జెరూసలేం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఆ దాడిలోనే సోలోమన్ మందిరం కూల్చబడింది. ఎందరో యూదులు దారుణంగా చంపబడ్డారు. పాలస్తీనా బాబిలోనియన్ల చేతిలోకి వెళ్లిపోయింది. యూదులు బాబిలోనియన్ల దాస్యంలోకి వెళ్ళిపోయారు. ఆ తరువాత తిరిగి 515 BC లో అదే స్థలంలో మిగిలి ఉన్న శిధిలాలపై తిరిగి సోలోమన్ మందిరాన్ని పునః స్థాపించటం జరిగింది. ఇకపోతే యూదులపై అంత పెద్ద శిక్ష వచ్చిపడటానికి కారణం…
యూదులపై దేవుడు ఎంతో కారుణ్యం చూపినప్పటికీ వారిలోని దుర్మార్గత మరియు తలబిరుసుతనమే! బైబిల్లో సైతం యూదులు “అవిధేయులు” “లోబడనోల్లని ప్రజలు” “మెడ వంచని జనాంగము” “తిరుగుబాటు చేయు ప్రజలు” “నరహంతకులు” అని పిలవబడటాన్ని బట్టి వారి దుర్మార్గత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. మోషే నుండి యేసు వరకు మధ్యలో తమను సంస్కరించటానికి వచ్చిన వేల మంది ప్రవక్తలను అతి దారుణంగా రాళ్లతో కొట్టి, శిలువ ఎక్కించి చంపేసేవారు. ఆ విధంగా వారి దుర్మార్గాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయి. చివర్లో వారివద్దకు పంపబడిన ప్రవక్త యేసు (ఈసా (అలై) ను కూడా చంపటానికి అనేక కుట్రలు పన్నారు. అయితే అప్పటికే యెరుషలేము రోమీయుల చేతుల్లోకి వెళ్లిపోతుంది. 63 BCE నుండి 324 CE వరకు జెరుసలెం రోమా ప్రభుత్వం క్రిందే పాలించబడేది. యూదులు ఆ సమయంలో రోమా ప్రభుత్వ సహాయంతోనే యేసును చంపటానికి కుట్రలు పన్నుతారు. అయితే యూదుల కుట్రల నుండి దేవుడు యేసును కాపాడుకుంటాడు.
ఫలితంగా యూదులు, యేసు నోట శపించబడతారు. యెరుషలేము పూర్తిగా నాశనం చెయ్యబడుతుందని, ఒకప్పుడు యూదులకు ఇవ్వబడిన ‘ఎన్నుకోబడిన దేవుని ప్రజలు’ అన్న గొప్ప స్థానం వారి నుండి కొట్టివేయబడుతుందని అది వేరే ప్రజలకు ఇవ్వబడుతుందని యేసు చెప్పిన భవిష్యవాణి (మత్తయి 21:37-46) ప్రకారమే 70 AD లో రోమన్ రాజైన ‘టైటాస్’ చేసిన దాడిలో జెరూసలేం తిరిగి దారుణంగా ధ్వంసం చెయ్యబడింది. రెండవసారి కట్టబడిన సోలోమన్ మందిరం పూర్తిగా ధ్వంసం చెయ్యబడింది. లక్షల కొద్దీ యూదులు చంపబడతారు. పాలస్తీనా భూభాగంలో నివశిస్తున్న మొత్తం యూదులు వెళ్లగొట్టబడతారు.
ఆ విధంగా ఒకప్పుడు వారికి ఇవ్వబడిన పాలస్తీనా భూభాగం నుండి వెళ్లగొట్టబడిన యూదులు అనేక దేశాల్లో చెదిరిపోయి ప్రపంచదేశాల్లో రెండు వేల సం.ల వరకు నిలువనీడ లేకుండా అయిపోయారు. ముఖ్యంగా 1099 నుండి 1260 వరకు సాగిన క్రుసేడ్లలో లక్షల కొద్దీ యూదులు చంపబడ్డారు. తమ నాయకుడైన యేసును యూదులు సిలివ వేసి చంపారన్న ఆక్రోశంతో కాథలిక్ క్రైస్తవులు సాగించిందే క్రుసేడ్ దాడులు.
యేసు అనంతరం దాదాపు 600 సం.ల తరువాత అరేబియాలో ప్రవక్త ముహమ్మద్ (స) ఆగమనం జరుగుతుంది. అప్పటికే అరేబియాలో యూదుల తెగలు నివసిస్తూ ఉండేవి. అయితే అరేబియన్ల కంటే ముందుగా ముహమ్మద్(స) ప్రవక్త అని కనిపెట్టింది యూదులే. కారణం అప్పటికే వారి తౌరాత్, ఇంజీల్ గ్రంథాల్లో ఒక ‘విశ్వ ప్రవక్త’ రాబోతున్నాడనే శుభవార్తలు రాయబడి ఉన్నాయి.
ప్రవక్త ముహమ్మద్ (స) మొదలెట్టిన సంస్కరణోధ్యమం ప్రపంచమంతా వేగంగా వ్యాపించింది. ఇస్లాం అరేబియాలో అధికారంలోకి వచ్చింది. రెండవ ఖలీఫా ఉమర్ బిన్ ఖత్తాబ్ (రజి) కాలంలో యెరుషలేము లో ఉన్న ‘మస్జిదే-అక్సా’ తిరిగి కట్టబడింది. జెరూసలేములో తిరిగి దైవారాధన ప్రారంభమయ్యింది. తరువాత 685 AD లో ఖలీఫా అబ్దుల్ మాలిక్ ఇబ్నె మర్వాన్’ ద్వారా “మస్జిదే-అస్ సఖ్రా” నిర్మించబడింది. అదే “డోమ్ ఆఫ్ రాక్” పేరుతో ప్రసిద్ధిగాంచింది.
తరువాతి కాలాల్లో అనేకదేశాల్లో చెదరగొట్టబడిన యూదులు జర్మనీలో హిట్లర్ ఆద్వర్యంలో నాజీల చేతుల్లో విపరీతమైన హింసలకు గురయ్యారు. హిట్లర్ అయితే 60 లక్షల మంది యూదులను అతిదారుణంగా చంపేశాడు. ఇదంతా వారు ప్రదర్శించిన తలబిరుసుతనానికి ఫలితం. దేవుని ఆజ్ఞలు మాటిమాటికి మీరి, అనేకమంది దైవ ప్రవక్తలను అన్యాయంగా చంపేసిన దాని పర్యావసానం.
ఇక ఆధునిక చరిత్రను విషయానికొస్తే 1517 నుండి 1917 వరకూ ఒట్టోమన్ రాజ్యాధికారంలో ఉన్న పాలస్తీనా ప్రాంతం 1918 లో మొదటి ప్రపంచ యుద్ధం తరువాత బ్రిటిష్ అధికారంలోకి వెళ్లిపోయింది. ఆ తరువాత బ్రిటిష్, అమెరికా సహాయంతో యూదులు పాలస్తీనాను ఆక్రమించుకోవటం మొదలెట్టారు. తమకు నిలువ నీడ కూడా లేదని చెప్పి పాలస్తీనా ముస్లిములను బ్రతిమాలుకుని నివాసాలు ఏర్పచుకోవటం మొదలెట్టారు. అలా పాలస్తీనాలో యూదులు ‘సెటిలర్స్’గా స్థానం సంపాదించారు. పాలస్తీనాలో స్థలాలు కొనటం ప్రారంభించారు. 1945 లో రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం ప్రపంచంలో చెదిరిపోయున్న యూదులు క్రమంగా పాలస్తీనాలో పోగవటం ప్రారంభించారు. 1947 కు ముందు ప్రపంచ పటంలో “ఇశ్రాయేల్” అనే దేశమే లేదు. తిన్నింటివాసాలు లెక్కపెట్టే అలవాటున్న యూదులు తమకు ఆశ్రయం కల్పించిన పాలస్తీనా భూభాగాన్నే ఆక్రమించుకుని అక్కడి ముస్లిములను తన్ని తరిమేసి, తమకు అడ్డొచ్చిన పాలస్తీనియన్లను చంపి క్రమక్రమంగా “ఇశ్రాయీల్” దేశాన్ని నిర్మించుకోవటం మొదలెట్టారు.
ఈనాడు ఇశ్రాయేల్ పేరుతో కనపడుతున్నది ఒకప్పటి పాలస్తీనా దేశం. ఇశ్రాయేల్ దేశం అన్నది అసలు చరిత్రలో ఎప్పుడూ లేదు. అది కేవలం యూదులు పాలస్తీనియన్లను తన్ని తరిమేసి నిర్మించుకున్న దేశం మాత్రమే. తమ దేశాన్ని కాపాడుకోవాలన్న ఆక్రోశంతో పాలస్తీనా ఇశ్రాయేల్ తో పోరాడుతూనే ఉంది. ఆ క్రమంలో పాలస్తీనాను రక్షించుకోవాలన్న లక్ష్యంతో ఏర్పడిందే ‘హమాస్’ అనే గ్రూప్. అది ఇశ్రాయేల్ పై దాడికి దిగినప్పుడల్లా ఇశ్రాయేల్ అదే అదనుగా.. దానిని ఇస్లామిక్ టెర్రరిజంగా చిత్రీకరించి పాలస్తీనా, గాజాలపై బాంబుల వర్షం కురిపించి వేలకొద్దీ పాలస్తీనియన్లను చంపి, క్రమంగా పాలస్తీనాను ఆక్రమించుకుంటుంది.
కానీ భారతదేశంలో కొందరు క్రైస్తవులు మటుకు ఇవేమీ తెలుసుకోకుండా గుడ్డిగా ఇశ్రాయేల్ తిరిగి స్థాపించబడాలని వారికోసం ప్రార్ధనలు చేస్తుంటారు. ఇప్పుడు ఇశ్రాయేల్ టార్గెట్ జెరూసలేం ను కైవసం చేసుకోవటం. చేసుకుని తిరిగి మస్జిదే-అక్సా ప్రాంతంలో సోలోమన్ మందిరం నిర్మిస్తే తమను పాలించే రాజు అక్కడ అవతరిస్తాడన్నది వారి గుడ్డి నమ్మకం. ఈ లక్ష్యం కోసం మస్జిదే అక్సా కు ఆనుకుని ఉన్న ‘వైలింగ్ వాల్’ దగ్గర ఇప్పటికీ యూదులు ఏడుస్తూ తోరా చదువుతూ ప్రార్ధనలు చేస్తుంటారు.
Md Nooruddin