మొక్కలు నాటకుండా నరికివేత
– బూడిద రవాణా కోసం ఎన్టీటీపీఎస్ అధికారుల నిర్వాకం
ఇబ్రహీంపట్నం: కాలుష్య కోరాల్లో విలవిల్లాడుతున్న ఇబ్రహీంపట్నంలో పచ్చదనం పెంపొందించకుండా నరికేస్తున్నారు ఎన్టీటీపీఎస్ అధికారులు.
ఇబ్రహీంపట్నం ఖిల్లా రోడ్డులో బూడిద రవాణా లారీలకు అడ్డు వస్తుందనే నెపంతో 40 సంవత్సరాల పురాతన చెట్టును నరికేశారు అధికారులు. దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పచ్చదనం పెంపొందించకుండా చెట్లు నరికివేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.