రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్..
విట్ ఏపీ యూనివర్సిటీ – ఏపీ చెస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్..
జూన్ 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు చెస్ టోర్నమెంట్…
అంతర్జాతీయ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ ను విట్ అమరావతి క్యాంపస్ లో ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా…
విట్ ఏపీ – ఏపీ చెస్ అసోసియేష్ సంయుక్తంగా టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయం.
అమరావతి దేశ విదేశాల చెస్ మేధావుల కలయికకు వేదికగా నిలుస్తోంది..
ఇది కేవలం క్రీడా పోటీ కాదు.. క్రమశిక్షణ, మేధస్సు, ప్రతిభకు వేడుక…
చెస్ భారతదేశంలో పుట్టి ప్రపంచాన్ని చుట్టివచ్చి మళ్లీ అమరావతిలో అంతర్జాతీయ స్థాయిలో వెలుగొందుతోంది
‘స్వర్ణాంధ్ర-2047’, ‘వికసిత్ భారత్’ లక్ష్యాలకు చెస్ ప్రతీకగా నిలుస్తోంది..
అమరావతిలో తొలి ఫిడే (FIDE) చెస్ ఈవెంట్ నిర్వహణ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న భారతదేశానికి నిదర్శనం..
ఈ టోర్నమెంట్‌లో భవిష్యత్ గ్రాండ్‌మాస్టర్లు, ప్రపంచ ఛాంపియన్లు కనిపిస్తున్నారని డీజీపీ వ్యాఖ్య..
ఆంధ్రప్రదేశ్‌లో చెస్‌కు అనుకూలమైన ఎకోసిస్టమ్‌ను నిర్మించి భవిష్యత్ ఛాంపియన్లకు కేంద్రంగా తీర్చిదిద్దాలి…
అమరావతి కేవలం పరిపాలనా రాజధాని కాదు.. భవిష్యత్తు జ్ఞాననగరం..
రానున్న సంవత్సరాల్లో అమరావతి ప్రపంచ స్థాయి నాలెడ్జ్ సిటీగా రూపుదిద్దుకుంటుంది..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ను బ్రాండ్‌గా తీర్చిదిద్దినట్లే.. అమరావతిని ‘క్వాంటమ్ వ్యాలీ’గా అభివృద్ధి చేస్తున్నారు..
డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.











































