అమరావతి
చదువులకు మరింత ఊతమిస్తూ..
వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా
అక్టోబర్- డిసెంబర్, 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,132 జంటలకు వైఎస్సార్ కళ్యాణమస్తు”, “వైఎస్సార్ షాదీ తోఫా” క్రింద రూ.78.53 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడే (20.02.2024) సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి..
పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి, వారి వివాహాన్ని గౌరవ ప్రదంగా జరిపించే తమ సామాజిక బాధ్యత నిర్వర్తించేందుకు అండగా నిలుస్తూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు “వైఎస్సార్ కళ్యాణమస్తు” ద్వారా, మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు “వైఎస్సార్ షాదీ తోఫా” ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్న జగనన్న ప్రభుత్వం..
పిల్లలు పెద్ద చదువులు చదవాలన్న తపనతో…
వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫాలకు పదవ తరగతి ఉత్తీర్ణత, వధువుకు కనీస వయోపరిమితి 18 ఏళ్ళుగా వరునికి 21 ఏళ్ళుగా నిర్ధేశించిన జగనన్న ప్రభుత్వం…చిన్నారులు పదో తరగతికి వచ్చే సరికి వారికి 15 ఏళ్ళ వయసు వస్తుంది, మన ప్రభుత్వం 1 వ తరగతి నుండి అప్పటికే ఏటా అందిస్తున్న రూ. 15,000 జగనన్న అమ్మ ఒడి సాయం ఇంటర్ వరకూ కూడా ఇస్తుండటంతో వారికి 17 ఏళ్ళ వయస్సు వచ్చే సరికి వారి ఇంటర్ చదువు కూడా పూర్తవుతుంది.
కళ్యాణమస్తు, షాదీ తోఫాలలో వధువుకు 18 ఏళ్ళు, వరునికి 21 ఏళ్ళ వయో పరిమితి ఉండటం, మన ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్, జగనన్న వసతి దీవెన ద్వారా ఏటా రూ. 20,000 వరకు ఆర్ధిక సాయం ఎలాగూ అందిస్తుండడంతో పాటు కళ్యాణమస్తు, షాదీ తోఫా ప్రోత్సాహకాలు కూడా ఉండడంతో వారు గ్రాడ్యుయేషన్ లో చేరుతారు, పూర్తి చేస్తారన్న నమ్మకంతో పాటు బాల్య వివాహాలకు కూడా అడ్డుకట్ట వేయడం జరుగుతుందన్న తపన, తాపత్రయంతో పనిచేస్తున్న జగనన్న ప్రభుత్వం
వైఎస్సార్ కళ్యాణమస్తు/ వైఎస్సార్ షాదీ తోఫా …ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం పూర్తయిన వెంటనే చెల్లిస్తూ, ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి క్రింద ఇప్పటి వరకు 56,194 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 427.27 కోట్లు జమ చేసిన జగనన్న ప్రభుత్వం..
గత పాలనలో 17,709 మంది అర్హులకు రూ. 68.68 కోట్ల లబ్ధి ఇవ్వకుండా వదిలేసిన వైనం
మరి జగనన్న ప్రభుత్వం వివిధ కేటగిరీలలో ఆర్థిక సాయాన్ని దాదాపు రెండింతలు పెంచి అందిస్తోంది..
ఎస్సీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 40,000 జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,00,000
ఎస్సీ (కులాంతర వివాహం) గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 75,000 జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,20,000
ఎస్టీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 50,000 జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,00,000
ఎస్టీ (కులాంతర వివాహం) గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 75,000 జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,20,000
బీసీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 35,000 జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 50,000
బీసీ (కులాంతర వివాహం) గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 50,000 జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 75,000
మైనార్టీలు, దూదేకులు, నూర్ బాషా గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 50,000 జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,00,000
విభిన్న ప్రతిభావంతులు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 1,00,000 జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,50,000
భవన, ఇతర నిర్మాణ కార్మికులు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 20,000 జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 40,000
జమ చేసిన తేదీ (10.02.2023) లబ్ధిదారులు 4,536, అందించిన మొత్తం రూ. కోట్లలో 38.18 (వివాహం జరిగిన త్రైమాసికం అక్టోబర్ – డిసెంబర్ 2022)
జమ చేసిన తేదీ (05.05.2023) లబ్ధిదారులు 12,132, అందించిన మొత్తం రూ. కోట్లలో 87.32 (వివాహం జరిగిన త్రైమాసికం జనవరి-మార్చి 2023)
జమ చేసిన తేదీ (09.08.2023) లబ్ధిదారులు 18,883, అందించిన మొత్తం రూ. కోట్లలో 141.60 (వివాహం జరిగిన త్రైమాసికం ఏప్రిల్-జూన్ 2023)
జమ చేసిన తేదీ (23.11.2023) లబ్ధిదారులు 10,511, అందించిన మొత్తం రూ. కోట్లలో 81.64 (వివాహం జరిగిన త్రైమాసికం జులై-సెప్టెంబర్ 2023)
జమ చేసిన తేదీ (20.02.2024) లబ్ధిదారులు 10,132, అందించిన మొత్తం రూ. కోట్లలో 78.53 (వివాహం జరిగిన త్రైమాసికం అక్టోబర్-డిసెంబర్ 2023)
మొత్తం లబ్ధిదారులు 56,194 అందించిన మొత్తం రూ. కోట్లలో 427.27