విఐటి – ఏపి విశ్వవిద్యాలయంలో కంపేరిటివ్ లా పై అంతర్జాతీయ సదస్సు
అమరావతి: విఐటి – ఏపి విశ్వవిద్యాలయంలో విఐటి – ఏపి స్కూల్ ఆఫ్ లా (VSL), బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ, రామయ్య స్కూల్ ఆఫ్ లా సంయుక్త ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ కంపారిటివ్ లా: ఎక్స్‌ప్లోరింగ్ కన్వర్జెన్స్, డైవర్జెన్స్ మరియు లిమినల్ స్పేసెస్ అనే మూడురోజుల అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సు ఫిబ్రవరి 15 న ప్రారంభమయ్యి ఫిబ్రవరి 17 న ముగుస్తుంది.
ఈ సదస్సులో అంతర్జాతీయ వాణిజ్య వివాదాల పరిష్కారంలో సాంకేతికత మరియు ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ వినియోగం: అవకాశాలు మరియు సవాళ్లు,” మరియు “భారతదేశంలో తులనాత్మక ప్రజా చట్టం మరియు అభ్యాసాలు” వంటి అంశాలపై చర్చిస్తారు.
మొదటిరోజు ముఖ్య అతిధిగా జస్టిస్ రవీంద్ర భట్ (సుప్రీంకోర్టు న్యాయమూర్తి (రిటైర్డ్)) హాజరై సదస్సును ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తులనాత్మక చట్టం (కంపేరిటివ్ లా ) యొక్క ప్రాముఖ్యతను మరియు న్యాయ వ్యవస్థలో దాని ప్రాముఖ్యతను తెలియచేసారు. అంతర్జాతీయవాదం, ఆర్థిక ప్రపంచీకరణ మరియు ప్రజాస్వామ్యీకరణ యొక్క ప్రస్తుత యుగంలో దాని కీలక పాత్రను తెలియచేస్తూ, వివిధ దేశాల న్యాయ వ్యవస్థల మధ్య వ్యత్యాసాలు మరియు సారూప్యతలను అధ్యయనం చేసే తులనాత్మక చట్టాన్ని ఆయన వివరించారు.
విఐటి – ఏపి విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ డా|| కోటా రెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయం సాధిస్తున్న అనేక విజయాలయను తెలియచేసారు. అంతే కాకుండా విద్యార్థులను న్యాయ రంగంలో రాణించేలా కృషి చేయాలని తెలియచేసారు.
విఐటి – ఏపి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా|| జగదీష్ చంద్ర ముదిగంటి మాట్లాడుతూ విఐటి – ఏపి విశ్వవిద్యాలయం అందిస్తున్న ప్రఖ్యాత ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌లతో పాటు నాన్-ఇంజనీరింగ్ కోర్సుల వివరాలను తెలియచేసారు. క్యాంపస్‌లో విద్యార్థులకు అందిస్తున్న అత్యున్నతమైన మౌలిక సదుపాయాలు మరియు సౌకర్యాలను వినియోగించుకొని ప్రతి విద్యార్థి అభివృద్ధి చెందాలని తెలియచేసారు.
విఐటి – ఏపి విశ్వవిద్యాలయ స్కూల్ ఆఫ్ లా (VSL) డీన్ డా|| బెనర్జీ చక్కా మాట్లాడుతూ, ఈ సదస్సు మేధోపరమైన సంభాషణను పెంపొందించడం, విద్యాపరమైన మార్పిడిని ప్రోత్సహించడం మరియు పరిశోధన మరియు తులనాత్మక న్యాయ పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి దోహదపడుతుందని అన్నారు. ఈ సదస్సులో పాల్గొనేవారు రాజ్యాంగ చట్టం, పరిపాలనా చట్టం, పౌర చట్టం, వాణిజ్య చట్టం మరియు క్రిమినల్ చట్టంతో సహా తులనాత్మక చట్టంలోని వివిధ శాఖలను గురించి క్షుణంగా తెలుసుకుంటారని తెలియచేసారు .
ఉమామహేష్ సత్యనారాయణ (ప్రిన్సిపాల్, రామయ్య కాలేజ్ ఆఫ్ లా బెంగళూరు) ప్రొఫెసర్ గాంధీ (విఐటి-చెన్నై), ప్రొఫెసర్ మరియు డైరెక్టర్ డాక్టర్ అలెగ్జాండ్రా కావోస్కీ (బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయంలోని గ్లోబల్ ఎంగేజ్‌మెంట్స్) కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సదస్సులో భారతదేశం మరియు విదేశాలలోని ప్రసిద్ధ న్యాయ పాఠశాలల లోని న్యాయ విద్యార్థులు నుండి 120 కంటే ఎక్కువ పరిశోధనా పత్రాలు శ్వీకరించబడ్డాయి అందులో మూడు రోజుల చర్చలలో 80 పరిశోధనా పత్రాలను ఎంపికచేశారు. ఈ సదస్సులో విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్లు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
VIT-AP University School of Law (VSL), VIT-AP University and Birmingham School of Law, University of Birmingham, Jointly Organize International Conference on Comparative Law: Exploring Convergences, Divergences, and Liminal Spaces at VIT-AP Campus. This Conference is also co-Sponsored by M.S. Ramaiah College of Law, Bengaluru.
Amaravati, Andhra Pradesh 16th Feb 2024; – The 3-day International Conference on Comparative Law, titled “A Story of Convergences, Divergences, and Exploitation of Liminal Spaces,” commenced at 5:00 pm on 15th February, at the VIT-AP campus and will continue until 17th February 2024. The event is co-sponsored by Ramaiah College of Law, Bengaluru.
The conference encompasses diverse topics, with discussions on themes such as the “Use of Technology and AI in the Resolution of International Commercial Disputes: Opportunities and Challenges,” and “Comparative Public Law and Practices in India.”
During the inaugural session, Justice Ravindra Bhat, Hon’ble Judge Supreme Court of India (Retd), attended as the chief guest for the conference emphasized the significance of Comparative Law and its importance in the legal system. He described Comparative Law as the study of differences and similarities among the legal systems of different countries, highlighting its crucial role in the current era of internationalism, economic globalization and democratization.
Dr. S. V. Kota Reddy, Vice-Chancellor, VIT-AP University in his presidential address underscored the academic excellence of VIT-AP University and encouraged students to excel in the field of law.
Dr. Jagadish Chandra Mudiganti Registrar VIT-AP highlighted the array of non-engineering courses introduced by VIT-AP, in addition to its renowned engineering programs. He also emphasized the superior infrastructure and facilities provided to students on the campus.
Dr. Benarji Chakka, Dean, Professor of Law, VIT-AP School of Law (VSL), VIT-AP University said the conference aims to foster intellectual discourse, promote academic exchange, and contribute to the advancement of comparative law knowledge in research and teaching. Participants will delve into various branches of comparative law, including constitutional law, administrative law, civil law, commercial law, and criminal law
Prof. Umamahesh Satyanarayana, Principal, Ramaiah College of Law Bangalore. Professor Gandhi from VIT Chennai, Dr. Aleksandra Cavoski, Professor and Director of Global Engagements, Birmingham University, Birmingham, UK were also present on the occasion and addressed the students and participants.
The conference was witnessed participants from reputed law school in India and abroad and more than 120 research papers were received and 80 research papers were presented in the three day deliberations. Students, Research Scholars and faculty and staff members were participated in the three day conference.