జర్నలిస్టుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం
* పల్నాడు జిల్లా ప్రథమ మహాసభ ఘనంగా నిర్వహణ
రాజధాని వార్తలు, నరసరావుపేట, అక్టోబర్ 11:
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (APWJF) , ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (APBJA) ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా ప్రథమ మహాసభ నరసరావుపేటలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) హాల్‌లో అత్యంత వైభవంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నరసరావుపేట పార్లమెంటు సభ్యులు (ఎంపీ) శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు జర్నలిస్టుల సమస్యలపై విలువైన దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ, జర్నలిస్టుల సంక్షేమం ,వారి న్యాయమైన సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. ప్రెస్ క్లబ్‌కు స్థల కేటాయింపు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్ తదితర డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే, జర్నలిస్టు సంఘాలు స్వీయ పర్యవేక్షణ (సెల్ఫ్ ఆడిటింగ్) చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. బాధ్యతాయుతంగా, నిబద్ధతతో పనిచేసే జర్నలిస్టులను యూనియన్లు ప్రోత్సహించాలని, వృత్తి విలువలు ,నైతిక ప్రమాణాలను కాపాడుకోవాలని, ఏ రంగంలోనైనా తప్పులను ప్రోత్సహించడం సరైన పద్ధతి కాదని ఆయన పేర్కొన్నారు.
మరో ముఖ్య అతిధి ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జి.వి. ఆంజనేయులు మాట్లాడుతూ, వార్తల సేకరణ కోసం నిరంతరం శ్రమించే, ప్రజా కార్యక్రమాలకు హాజరయ్యే జర్నలిస్టులకు ప్రమాద బీమా సౌకర్యం ఉండాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ,పెన్షన్లు అందేలా మద్దతుగా నిలుస్తానని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు.
స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అర్హులైన వారికి పెన్షన్లు అందేలా సహకరిస్తానని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో APWJF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. అంజనేయులు మాట్లాడుతూ నేడు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలను ప్రస్తావించారు. వర్కింగ్ జర్నలిస్ట్స్ యాక్ట్, వేజెస్ బోర్డ్ యాక్ట్ అనే రెండు కీలక చట్టాలు రద్దు కావడంతో జర్నలిజం ప్రమాదంలో పడిందని తెలిపారు. డిజిటల్ వ్యక్తిగత గోప్యత, రక్షణ పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, 2023 (DPDP Act), సమాచార హక్కు చట్టం (RTI Act, 2005) యొక్క అసలు స్ఫూర్తిని దెబ్బతీస్తోందని పేర్కొన్నారు.
జర్నలిస్టులు, మీడియా సంస్థలు , మీడియా యజమానుల సమస్యలను అధ్యయనం చేసి అందరి ప్రయోజనాలను పరిరక్షించేలా నియమ నిబంధనలను రూపొందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా లేక స్వతంత్రంగా ఒక ‘మీడియా కమిషన్’ను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తద్వారా రాజకీయ నాయకులు, పరిశ్రమలపై తప్పుడు కథనాలను ప్రసారం చేసేవారిని అరికట్టవచ్చని, ఇది మీడియా సంస్థలకు, విలేఖరులకు, ప్రజా ప్రతినిధులకు ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు.
ఈ వేదికలో ఆంధ్రప్రదేశ్ మధ్య తరహా, చిన్న దినపత్రికలు, పీరియాడికల్స్ పాత్రికేయుల సంఘం (ఏపీ ఎం యస్ డి పి జె ఎ ) అధ్యక్షులు పి. హుస్సేన్ ఖాన్, మధ్య, చిన్నతరహా పత్రికల సంక్షేమం, అభివృద్ధి కోసం రూపొందించిన సమగ్ర 10-డిమాండ్లను ప్రస్తావించారు. అసోసియేషన్ లోగోను ఆవిష్కరించారు.
ప్రధాన డిమాండ్లు
1. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు: మధ్య తరహా, చిన్న దినపత్రికలు , ఇతర పత్రికల ప్రయోజనాలను పరిరక్షించడానికి, మౌలిక వసతులు ,కార్యకలాపాల విస్తరణకు ఆర్థిక రుణ సహాయం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలి.
2. ప్రభుత్వ ప్రకటనలలో వాటా:ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చిన హామీ మేరకు, ప్రభుత్వ ప్రకటనలలో 30% వాటాను మధ్య తరహా, చిన్న దినపత్రికలు ,ఇతర పత్రికలకు కేటాయించడాన్ని తప్పనిసరి చేయాలి.
3. ఆన్‌లైన్ బిల్లుల సమర్పణ: బిల్లులు ఆలస్యం కాకుండా, ప్రచురణకర్తల సమయం ,శ్రమ ఆదా అయ్యేలా జాతీయ స్థాయి సీబీసీ విధానానికి అనుగుణంగా ఆన్‌లైన్ బిల్లు సమర్పణ వ్యవస్థను ప్రవేశపెట్టాలి.
4. ఆన్‌లైన్ ప్రచురణ తనిఖీ: ప్రస్తుతం ఐ & పి ఆర్ అనుసరిస్తున్న విధానానికి బదులుగా, ప్రచురించిన పత్రికలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసే జాతీయ స్థాయి పి ఆర్ జి ఐ విధానాన్ని అమలు చేయాలి.
5. రేడు సార్లు ఎంపానెల్‌మెంట్: పత్రికల ఎంపానెల్‌మెంట్ ప్రక్రియను ఏడాదికి రెండుసార్లు తప్పనిసరిగా నిర్వహించాలి
ఇందులో మాస, పక్ష , వార పత్రికలను, కూడా చేర్చాలి.
6. తగిన మీడియా ప్రాతినిధ్యం: ముఖ్యమైన రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు వీఐపీ ల పర్యటనల కవరేజీలో మధ్య తరహా , చిన్న పత్రికలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి.
7. సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్లు: మధ్య తరహా, చిన్న దినపత్రికలు పీరియాడికల్స్‌లో (వార, పక్ష, మాస పత్రికలు) సేవలందించిన సీనియర్ పాత్రికేయులకు పెన్షన్లు మంజూరు చేయాలి.
8. ప్రమాద బీమా సౌకర్యం: ఈ ప్రచురణలలో పనిచేస్తున్న పాత్రికేయులందరికీ సమగ్ర ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి.
9. నైపుణాభివృద్ధి & శిక్షణ: మారుతున్న మీడియా రంగానికి అనుగుణంగా చిన్న పత్రికల జర్నలిస్టులు తమ్మును తాము మలుచుకునేలా తగిన శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలి.
10. సి ఆర్ మీడియా అకాడమీలో ప్రాతినిధ్యం:పాత్రికేయుల కోసం పునశ్చరణ కోర్సులు నిర్వహించే మీడియా అకాడమీ పాలక మండలిలో ఏపీ ఎం యస్ డి పి జె ఏ కి అధికారిక ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతున్నాము.
ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి ప్రభుత్వం ఒక నిర్దిష్ట ప్రణాళికను రూపొందించి, సంబంధిత అధికారులతో తక్షణమే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సంఘం తరపున విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ మీడియం అండ్ స్మాల్ డైలీ పిరియాడికల్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యదర్శి కలిమిశ్రీ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలపై పోరాటం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఫెడరేషన్ పోరాట ఫలితంగానే ఫెడరేషన్ డిమాండ్స్ డే సందర్భంగా గుర్తించిన 11 సమస్యల్లో ఇప్పటికి దాదాపు 6 సమస్యలను పరిష్కరించుకోగలిగామన్నారు… రాష్ట్ర నాయకత్వం స్ఫూర్తితో పల్నాడు జిల్లా నాయకులు స్థానికంగా ఉన్న అనేక సమస్యలపై పోరాటం చేసి ఫలితాలు సాధిస్తున్నారన్నారు.. ఈరోజు ఎన్నికైన కొత్త నాయకత్వం అదే స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు.
ఈ మహాసభ సందర్భంగా పల్నాడు జిల్లా APWJF నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. పల్నాడు జిల్లా అధ్యక్షులుగా పచ్చవ బుజ్జిబాబు, కార్యదర్శులుగా ఆచంట కృష్ణ కుమార్ తదితర సభ్యులు ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమంలో నరసరావుపేట పార్లమెంటు సభ్యులు (ఎంపీ) లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ జి.వి. ఆంజనేయులు, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు, APWJF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. అంజనేయులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ఎన్. ప్రసాద్, ఎస్.బి. నాదన్, ఏపీ ఎం యస్ డి పి జె ఎ అధ్యక్షుడు పి. హుస్సేన్ ఖాన్, కార్యదర్శి కలిమిశ్రీ, APWJF వ్యవస్థాపక సభ్యులు ఎ. కొండబాబు, మహిళా నాయకురాలు బి. సుధా కిరణ్ తదితర ప్రముఖులు పల్నాడు జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన వందలాది మంది జర్నలిస్టులు పాల్గొన్నారు.
Committed to Journalists’ Welfare and Protection of Their Rights
- * Palnadu District’s First General Body Meeting Held Grandly
- Committed to Journalists’ Welfare and Protection of Their Rights
- * Palnadu District’s First General Body Meeting Held Grandly
Rajadhani News, Narasaraopet, October 11:
The first general body meeting of the Palnadu District unit was held with great grandeur at the Indian Medical Association (IMA) Hall in Narasaraopet, under the aegis of the Andhra Pradesh Working Journalists Federation (APWJF) and the Andhra Pradesh Broadcast Journalists Association (APBJA).
Narasaraopet Member of Parliament (MP) Lavu Sri Krishna Devarayalu attended the event as the chief guest and offered valuable guidance regarding the issues faced by journalists. Speaking at the meeting, MP Lavu Sri Krishna Devarayalu affirmed his unwavering support for the welfare of journalists and the resolution of their legitimate grievances. He assured the gathering that he would sincerely strive to bring demands—such as land allocation for a local press club, housing sites for journalists, and pension provisions—to the government’s attention and work towards their resolution.
He also suggested that journalists’ associations should engage in self-auditing. He emphasized that unions should encourage journalists who work with responsibility and commitment and uphold professional values and ethical standards, noting that condoning wrongdoing in any field is not the right approach.
Another chief guest Mr. G.V. Anjaneyulu who is a Government Chief Whip emphasized the importance of providing accident insurance coverage for journalists, who work tirelessly to gather news and attend public events. He assured his support in ensuring that eligible journalists receive housing plots and pensions, promising to bring this matter to the Chief Minister’s attention for resolution.
Local MLA Dr. Chadalavada Aravinda Babu pledged his cooperation regarding the establishment of a press club and the provision of housing plots and pensions to eligible journalists. He lauded the commendable work being done by the local journalists who are bringing people’s problems to the forefront and to help resolve.
Addressing the gathering, APWJF State General Secretary G. Anjaneyulu highlighted several critical issues currently facing journalists. He stated that the profession of journalism is in jeopardy following the repeal of two key laws: the Working Journalists Act and the Wages Board Act. He further noted that the Digital Personal Data Protection Act, 2023 (DPDP Act)—introduced by the Central Government in the name of digital privacy and protection—is undermining the true spirit of the Right to Information Act (RTI Act, 2005).
He demanded that the Central and State governments—either jointly or independently—establish a ‘Media Commission’ to study the issues faced by journalists, media organizations, and media owners, people, politicians. This commission should formulate regulations that safeguard the interests of all stakeholders. He stated that this measure would help curb the dissemination of false narratives there by benefiting media organizations, journalists, public representatives, and the general public alike.
Speaking on this platform, P. Hussain Khan, President of the Andhra Pradesh Medium and Small Daily Newspapers and Periodicals Journalists’ Association (APMSDPJA), highlighted a comprehensive set of ten demands aimed at the welfare and development of medium and small-scale newspapers after inaugurating association logo.
Key Demands:
1. Establishment of a Special Corporation: The state government should establish a dedicated corporation to safeguard the interests of medium and small daily newspapers and other periodicals, and to provide financial loan assistance for infrastructure development and the expansion of operations.
2. Share in Government Advertisements: In accordance with the earlier assurance given by Chief Minister Nara Chandrababu Naidu, it should be made mandatory to allocate a 30% share of government advertisements to medium and small daily newspapers and other periodicals.
3. Online Bill Submission: An online bill submission system—aligned with the national-level CBC policy—should be introduced to prevent delays in payment processing and to save the publishers’ time and effort.
4. Online Publication Verification: Instead of the current procedure followed by the I&PR Department, a national-level PRGI-style system should be implemented, wherein published newspapers are uploaded online for verification.
5. Biannual Empanelment: The empanelment process for newspapers must be conducted twice a year; this should also include monthly, fortnightly, and weekly publications.
6. Adequate Media Representation: Appropriate representation must be provided to medium and small newspapers in the coverage of significant state-level events and VIP tours.
7. Pensions for Senior Journalists: Pensions should be sanctioned for senior journalists who have served in medium and small daily newspapers and periodicals (weeklies, fortnightlies, and monthlies).
8. Accident Insurance Coverage: Comprehensive accident insurance coverage must be provided to all journalists working for these publications.
9. Skill Development & Training: Suitable training programs should be organized to enable journalists from small newspapers to adapt to the evolving media landscape.
10. Representation in the Media Academy: We request official representation for APMSDPJA on the governing council of the Media Academy, which conducts refresher courses for journalists.
On behalf of the association, a request was made for the government to formulate a concrete plan to address all these issues and to immediately convene a meeting with the concerned officials.
Speaking on the occasion, Kalimishri, Secretary of the Andhra Pradesh Medium and Small Daily Periodicals Journalists Association, stated that the Andhra Pradesh Working Journalists Federation plays a pivotal role in fighting for the issues faced by journalists across the state. He stated that, as a result of the Federation’s struggles, they have successfully resolved nearly six of the eleven issues identified during ‘Federation Demands Day.’ He noted that, inspired by the state leadership, Palnadu district leaders are fighting for and achieving results on various local issues, and urged the newly elected leadership to move forward with that same spirit.
During this general body meeting, the new executive committee for the Palnadu district APWJF was elected unanimously. Pachava Bujji Babu was elected as the Palnadu District President, and Achanta Krishna Kumar was elected as Secretary, along with other members.
Prominent figures who participated in the event included Narasaraopet MP Lavu Sri Krishna Devarayalu, Government Chief Whip G.V. Anjaneyulu, Narasaraopet MLA Dr. Chadalavada Aravinda Babu, APWJF State General Secretary G. Anjaneyulu, State Vice-Presidents B.N. Prasad and S.B. Nadan, APMSDPJA President P. Hussain Khan, Secretary Kalimisri, APWJF founding member A. Kondababu, and women’s leader B. Sudha Kiran, alongside hundreds of journalists from across the Palnadu district.












































































































