అమరావతి
ఉండవల్లి గుహల వద్ద రామ్ దేవ్ బాబా నిర్వహించిన యోగాసాధన కార్యక్రమాన్ని తిలకించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
యోగాంధ్ర లోగో ఉన్న షర్ట్ ధరించిన సీఎం చంద్రబాబు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…
• రామ్ దేవ్ బాబాతో నాకు 30 ఏళ్ల నుంచి పరిచయం ఉంది.
• రామ్ దేవ్ బాబా యోగాను ప్రజల్లోకి తీసుకెళ్లారు.
• వేలాది మంది స్వచ్ఛంధంగా వచ్చి రామ్ దేవ్ బాబా దగ్గర యోగాలో శిక్షణ తీసుకుంటారు.
• యోగాను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన రామ్ దేవ్ బాబాకు దేశ ప్రజల తరపున కృతజ్ఞతలు.
• ఉండవల్లి గుహల వద్ద యోగాసాధన చేయడం విశేషం.
• 6-7 శతాబ్దాలకు చెందిన ఉండవల్లి గుహలకు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉంది.
• పద్మనాభ స్వామి ఈ ఉండవల్లి గుహల్లో కొలువై ఉన్నాడు.
• దేవతల రాజధాని అమరావతి స్పూర్తితో ప్రజా రాజధానిని నిర్మిస్తున్నాం.
• రాజధానికి భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు.
• నెట్ జీరో విధానంలో కాలుష్య రహిత రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతున్నాం.
• నేను 30 ఏళ్ల నుంచి టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నాను… రామ్ దేవ్ బాబా యోగాను ప్రమోట్ చేస్తున్నారు.
• టెక్నాలజీ వితవుట్ అడిక్షన్ అనే విధానంలో వెళ్లాలి… దీనికి ఆధ్యాత్మిక, యోగా వంటివి ఉపకరిస్తాయి.
• ప్రధాని మోదీ యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారు… 190 దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి.
• యోగాతో శరీరం, మెదడు అనుసంధానం అవుతాయి.
• మన విలువలను కాపాడుకోవాలి.. భావితరాలకు అందించాలి.
• అమరావతి, విజయవాడల్లోని వివిధ ప్రాంతాల్లో యోగాభ్యాసం చేస్తూ.. మీడియా ద్వారా ప్రచారం చేయడానికి సంకల్పించిన రామ్ దేవ్ బాబాకు ధన్యవాదాలు.
• ఏపీని దేశానికి ఆథ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని బాబాను కోరుతున్నాను.
• రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
• ప్రకృతి వ్యవసాయాన్ని ప్రొత్సహిస్తున్నాం.. 20 లక్షల రైతులు ప్రకృతి వ్యవసాయంలోకి వస్తున్నారు.
• రసాయన రహిత పంటలను ప్రజలకు అందించే లక్ష్యంతో పని చేస్తున్నాం.
• ఆధ్యాత్మికతో వికసిత్ భారత్ సాధించాలని ప్రధాని ప్రయత్నిస్తున్నారు.. ఆయనకు సహకరిద్దాం.
• యోగా సాధన కోసం ఉద్యమ స్పూర్తితో పని చేయాలి.
• ప్రస్తుత తరానికి యోగాసాధనను అలవాటు చేస్తే.. అద్భుతమైన భవిష్యత్తును వారికి అందించినట్టు అవుతుంది.
• ప్రజా రోగ్యం కోసం సంజీవని ప్రాజెక్టును అమలు చేస్తున్నాం.
• సంజీవనిలో భాగంగా యోగాసాధన, ప్రాణామయం వంటివి కూడా చేరుస్తున్నాం.
• సంజీవని కార్యక్రమంలో రోగ చికిత్స కంటే.. రోగ నివారణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం.
రామ్ దేవ్ బాబా శిక్షణలో జరుగుతున్న యోగాసాధన కార్యక్రమాన్ని తిలకించిన సీఎం చంద్రబాబు.
వివిధ రకాల యోగా ప్రక్రియలను సీఎం చంద్రబాబుకు వివరించిన రామ్ దేవ్ బాబా.
సీఎం చంద్రబాబు ఎదుట చక్రాసనం, వృశ్చికాసనం, మయూరాసనం, హనుమానాసన్, రాజ్ కపోతాసన్, పవర్ యోగా వంటి ప్రక్రియలను ప్రదర్శించిన రామ్ దేవ్ బాబా.
ఈ వయస్సులో కూడా చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారన్న రామ్ దేవ్ బాబా.
సీఎం చంద్రబాబు అభివృద్ధి, విజన్ కలిగిన ముఖ్యమంత్రి అంటూ బాబా రామ్ దేవ్ కితాబు.
ప్రధాని వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్న బాబా రామ్ దేవ్.
ఈ సందర్భంగా రామ్ దేవ్ బాబా మాట్లాడుతూ…
• యోగా మన దేశానికి గర్వకారణం.
• సీఎం చంద్రబాబు నన్ను ముఖ్య అతిధిగా రమ్మన్నారు.. కానీ నేను యోగా అతిథిగా వచ్చాను.
• చంద్రబాబు తరహాలో ప్రతి ముఖ్యమంత్రి పని చేస్తే వికసిత్ భారత్ 2047 లక్ష్యం ముందుగానే సాకారం అవుతుంది.
• దేవతల రాజధాని అమరావతి.. ఇప్పుడు యోగ రాజధాని అయింది.
• రాజధానిని పచ్చదనంతో విలసిల్లేలా చేస్తున్నారు.. స్విట్జర్లాండ్ వంటి అందాలు అమరావతిలో ఉన్నాయి.
• ఉండవల్లి గుహల్లో కొలువు ఉన్న అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్నాను.
• ఇక్కడి అరటి, మామిడి పండ్లు చాలా రుచిగా ఉన్నాయి.
• ప్రకృతి వ్యవసాయానికి సీఎం చంద్రబాబు ప్రొత్సహిస్తున్నారు.
• సీఎం చంద్రబాబు ప్రకృతి ప్రేమికుడు, సాంస్కృతిక ప్రేమికుడు, యోగ ప్రేమికుడు సర్వజన ప్రేమికుడు.
• ఏక్ భారత్… శ్రేష్ట్ భారత్ అనే నినాదంతో ప్రధాని పని చేస్తున్నారు.. దానికి చంద్రబాబు సహకరిస్తున్నారు.
• ఆత్మనిర్భర్ భారత్ కోసం కృషి చేస్తూ.. భారత దేశాన్ని విశ్వగురుగా నిలిపేందుకు ప్రధాని చేస్తున్న కృషికి చంద్రబాబు తోడయ్యారు.
• చంద్రబాబు యోగి, కర్మయోగి.










































