అమరావతి
ఆక్వా రైతుల సమస్యకు పరిష్కారం చూపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
• ముఖ్యమంత్రి నిర్దేశించడంతో ఆక్వా ఫీడ్ ధర కేజీకి రూ.4 తగ్గించేందుకు అంగీకరించిన తయారీదారులు
• కేజీకి ప్రస్తుతమున్న రూ.112 నుంచి రూ.108కి తగ్గనున్న ఫీడ్ ధరలు…
• ముఖ్యమంత్రి నిర్ణయంతో సంతోషం వ్యక్తం చేసిన చేపలు, రొయ్యల సాగు రైతులు
• ధరల స్థిరీకరణలో భాగంగా ఆక్వా రైతులు, తయారీదారులతో కమిటీ వేయాలని సీఎం ఆదేశం
• 20 రోజుల్లోగా కమిటీ నివేదిక ఇవాలని స్పష్టం చేసిన సీఎం, అనంతరం ధరపై తుది నిర్ణయం
• ముఖ్యమంత్రితో సమావేశంలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు, ఉన్నతాధికారులు, ఆక్వారైతులు, ఫీడ్ తయారీదారులు
• ఆక్వాసాగుకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే ఇవ్వడంపై ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన రైతులు
• గోదావరి జిల్లాలకే పరిమితమైన ఆక్వాసాగును శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకు తీర ప్రాంతం పొడవునా విస్తరించేలా చేసిన ఘనత సీఎం చంద్రబాబుదే అంటూ పేర్కొన్న రైతులు
• గత ప్రభుత్వ హయాంలో ఫీడ్ ధరలు ఆరు సార్లు పెంచారని, అయినా నాటి ప్రభుత్వం ధర తగ్గింపుపై చొరవ తీసుకోలేదని ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపిన ఆక్వా రైతులు
• ఆక్వా రైతులు ఎప్పుడూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించలేదని, ఇటీవల కొందరు రైతుల ముసుగులో రాజకీయం చేశారని సీఎంకు వివరించిన ఆక్వా రైతులు
• 2019లో కేజీ ఫీడ్ ధర రూ.87.80 ఉంటే గత ప్రభుత్వం దిగిపోయేనాటికి రూ.107.80కి చేరిందని వివరించిన రైతులు
• కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫీడ్ ధర రూ.5.80 తగ్గించిందన్న రైతులు
• రైతులు ఉత్పత్తి వ్యయం తగ్గించుకుని మరింత లాభాలు సాధించేలా చూడాలనీ సీఎం సూచన
• లక్షలాది మంది ఆధారపడిన ఆక్వారంగాన్ని పరిరక్షించే బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉందన్న సీఎం











































