రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటన..
కొండవీటి వాగు, పాలవాగు ప్రవాహ మార్గాలను, పెనుమాక రిజర్వాయర్ ను పరిశీలించిన మంత్రి నారాయణ.
రాజధాని రోడ్డుల నిర్మాణం జరుగుతున్న ప్రాంతలలో వాగుల ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు..
నిర్మాణం జరుగుతున్న వంతెనల క్రింది భాగంలో మట్టి పూడిక తీతలు త్వరగా తొలగించాలనీ ఆదేశాలు…
జగన్ పై మంత్రి నారాయణ ఫైర్
*నారాయణ,మంత్రి*
రైతులకు ప్లాట్లు కేటాయించలేదు అని వైసీపీ అబద్ధపు ప్రచారం చేస్తుంది.
ల్యాండ్ ఇచ్చిన ప్రతి రైతుకు ప్లాట్స్ ఇచ్చాము.
జగన్ అమరావతిపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు.
జగన్ ఏసీ రూముల్లో కూర్చుంటే అమరావతి లో అభివృద్ధి ఏమి కనిపిస్తుంది…బయటకి వచ్చి చూస్తే తెలుస్తుంది.
ఇక జగన్ అనే మావిగన్ ఎక్కడ ఉంది.
చంద్రబాబు కి విజన్ ఉంటే….జగన్ కి ఏమి లేదు.
టెండర్ ల ప్రకారం అమరావతి లో అభివృద్ధి జరుగుతుంది.
రైతుల దగ్గర బలవంతంగా భూములు ఇంతవరకు తీసుకోలేదు.
అమరావతి 2028 ఆగస్ట్ నాటికి 1st fhase సిద్ధం అవుతుంది.
వర్షాకాలం వస్తుంది కాబట్టి కొండవీటి వాగు,పాలవాగు పనులు పరిశీలించడం జరిగింది.
వర్షా కాలంలో ఎటువంటి ఇబ్బంది రాకూడదు అని అధికారులను ఆదేశించాను.
69 బ్రిడ్జ్ ల దగ్గర వేగంగా పనులు జరుగుతున్నాయి.
రానున్న నాలుగు నెలలు వర్షాలు ఉంటాయి కాబట్టి ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నాం











































