నిడమర్రులో గ్రామసభ నిర్వహించిన APCRDA…
ప్రజారాజధాని అమరావతి నగర నిర్మాణం నిమిత్తం భూసేకరణ కార్యకలాపాలకై నిడమర్రు గ్రామంలో APCRDA ఆధ్వర్యంలో గ్రామసభ జరిగింది. గ్రామసభకు అడిషనల్ కమిషనర్లు ఏ.భార్గవతేజ ఐఏఎస్ గారు, కొల్లాబత్తుల కార్తీక్ ఐఏఎస్ గారు హాజరయ్యారు.
రాజధాని నగరంలో నిర్మిస్తున్న రహదారులు, LPS జోన్లు, తదితర అభివృద్ధి ప్రాజెక్టుల నిమిత్తం భూసమీకరణ(ల్యాండ్ పూలింగ్- LPS) చేపట్టామని.. సమీకరణకు కొందరు రైతులు, భూయజమానులు ముందుకు రానందున..రైతులతో పలుమార్లు చర్చించిన అనంతరం నిర్ణీత విధానంలో మాత్రమే ఇటీవల భూసేకరణ ప్రక్రియకై నోటిఫికేషన్ విడుదల చేశామని భార్గవ తేజ గారు గ్రామస్తులకు వివరించారు. భూసమీకరణలో పాల్గొనేందుకు రైతులకు ఇప్పటికీ అవకాశం ఉందని, ఇటీవల విడుదల చేసిన భూసేకరణ ప్రకటనలో పేర్లు ఉన్నప్పటికీ సంబంధిత రైతులు నిర్ణీత గడువులోపు భూసమీకరణలో పాల్గొనేందుకు అవకాశముందని భార్గవ తేజ గారు గ్రామసభలో స్పష్టం చేశారు.
నిడమర్రు గ్రామానికి సంబంధించి 22ఏ భూములను ఆ జాబితా నుంచి తొలగించాలని పలువురు గ్రామస్తులు కోరారు. 22ఏ భూములపై గ్రామస్తుల ఫిర్యాదును పరిశీలించాలని తహసీల్దారుకు అడిషనల్ కమిషనర్ గారు ఆదేశాలిచ్చారు. మట్టి అక్రమ రవాణాను నియత్రించేందుకు చెక్ పోస్టులను పెట్టడం జరిగిందని అడిషనల్ కమిషనర్ గారు గ్రామస్తులకు తెలియజేశారు. రాజధాని నిర్మాణ పనుల నిమిత్తం గ్రామంలో సంచరిస్తున్న వాహనాలను గ్రామం వెలుపల నుంచి పంపే ఏర్పాట్లు చేయాలని గ్రామస్తులు చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తామని అడిషనల్ కమిషనర్ గారు వెల్లడించారు. రాజధాని రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్ల లే అవుట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు.
రాజధాని అమరావతి గ్రామాలలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నామని అడిషనల్ కమిషనర్ గారు పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నందున, రాజధాని గ్రామాల రైతులు APCRDA అధికారులకు సహకరించాలన్నారు. అలాగే రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులు స్థానికంగా అందుబాటులో ఉండే కాంపిటెంట్ అథారిటీ కార్యాలయాలలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలన్నారు. గ్రామసభలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జి. భద్రు, ఎల్. మధుసూదన్, గ్రీవెన్స్ రిడ్రెస్సల్ మేనేజ్‌మెంట్(GRM) నోడల్ అధికారి పి.జయశ్రీ, APCRDAలోని వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
APCRDA Conducts Gram Sabha in Nidamarru…
A Gram Sabha was conducted by APCRDA in Nidamarru village as part of the land acquisition process for the development of People’s Capital Amaravati. The Gram Sabha was attended by APCRDA Additional Commissioners A. Bhargava Teja, IAS, and Kollabathula Karthik, IAS.
Addressing the villagers, Additional Commissioner A. Bhargava Teja stated that land pooling (LPS) had been undertaken for the construction of roads, development of LPS zones, and other infrastructure projects in the Capital City. He explained that while a majority of landowners had voluntarily participated in the Land Pooling Scheme, some farmers and landowners had not come forward. After holding several rounds of discussions with the concerned landowners, APCRDA had recently issued a notification for land acquisition strictly in accordance with the prescribed procedures. He further clarified that farmers still have an opportunity to participate in the Land Pooling Scheme and that even those whose names appear in the recently issued land acquisition notification may opt for land pooling within the stipulated timeframe.
Several villagers requested the removal of lands classified under Section 22-A from the notified list. Responding to their concerns, the Additional Commissioner directed the Tahsildar to examine the grievances relating to the 22-A lands. He also informed the villagers that check posts had been established to prevent the illegal transportation of soil. Villagers further requested that vehicles engaged in Capital City construction activities be diverted through routes outside the village limits to minimize inconvenience to residents. The Additional Commissioner assured them that the matter would be examined. He also informed the gathering that development works in the returnable plot layouts allotted to Capital Region farmers are currently in progress.
The Additional Commissioner stated that APCRDA has prepared and is implementing plans for the development of civic infrastructure in the Capital Region villages. As construction activities under the Amaravati development project are progressing rapidly, he urged farmers and residents of the Capital Region villages to extend their cooperation to APCRDA. He also advised farmers who have been allotted returnable plots to complete the registration process at the respective Competent Authority offices established for this purpose.
The Gram Sabha was attended by Special Deputy Collectors G. Bhadru and L. Madhusudan, GRM Nodal Officer P. Jayashree, and officials from various departments of APCRDA.


















































