Insurance of MDU vehicles are born by Govt.
Operators Khushi with the assurance of Minister Karumuri..
Tanuku, April 1: Interruption of door-to-door ration supply has been removed… MDU operators have happily returned to their duties with the assurance given by the state Civil Supplies Minister Karumuri Venkata Nageswara Rao. A dispute arose between banks and operators regarding the insurance of MDU vehicles.. Minister Karumuri spoke to Chief Minister YS Jagan. Solved.. Minister Karumuri, who is in Tanuka, called the MDU operators to him on Saturday and gave them a clear assurance from the government.
The problem arose when the Bank of Baroda went against the government’s instructions regarding the premium related to vehicle insurance… As the bank was deducting the premium cash from the salaries of the operators, they all got into trouble. The operators brought the problems to the attention of Minister Karumuri Chief Minister YS Jagan Mohan Reddy.. Chief Minister Jagan Mohan Reddy responded positively saying that the government will bear the premium amount… He ordered the concerned authorities to include this item in the Vahanamitra scheme… Under the Vahanamitra scheme, MDU vehicle premium will be paid for the financial year 2022-23. Also, the premium for the year 2021 will be given to the operators…With the minister’s assurance, the operators have become participants in the ration distribution from Saturday as usual.
– Office of State Civil Supplies Minister Karumuri Venkata Nageswara Rao
ఎండియు వాహనాల బీమా ప్రభుత్వమే భరిస్తుంది…
మంత్రి కారుమూరి హామీతో ఆపరేటర్లు ఖుషి..
తణుకు, ఏప్రిల్ 1: ఇంటింటికి రేషన్ సరఫరాకు అంతరాయం తొలగింది…ఎండియు ఆపరేటర్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఇచ్చిన హామీతో వారంతా ఖుషీగా వారి విధుల్లోకి చేరిపోయారు.ఎండియు వాహనాల బీమాకు సంబంధించి బ్యాంకులు , ఆపరేటర్లకు మధ్య వివాదం తలెత్తింది..దీనిని మంత్రి కారుమూరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో మాట్లాడి పరిష్కరించారు.. తణుకలో ఉన్న మంత్రి కారుమూరి శనివారం నాడు ఎండియు ఆపరేటర్లను తన వద్దకు పిలిపించుకుని వారికి ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇచ్చారు.
వాహన బీమాకు సంబంధించిన ప్రీమియం విషయంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రభుత్వ సూచనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో సమస్య తలెత్తింది… ప్రీమియం నగదును ఆపరేటర్ల వేతనాల్లో నుంచి బ్యాంకు మినహాయించు కోవడంతో వారంతా ఇబ్బందులకు గురయ్యారు. ఆపరేటర్లు ఇబ్బందులను మంత్రి కారుమూరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు..దీనిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి జగన్ ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని… వాహనమిత్ర పథకంలో ఈ అంశాన్ని చేర్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు…వాహనమిత్ర పథకం కింద 2022 -23 ఆర్ధిక సంవత్సరానికి ఎండియు వాహన ప్రీమియంను చెల్లించనున్నారు. అలాగే 2021 సంవత్సరానికి సంబంధించిన ప్రీమియంను ఆపరేటర్లకు ఇవ్వనున్నారు…మంత్రి హామీతో ఆపరేటర్లు యధావిధిగా శనివారం నుంచే రేషన్ పంపిణీలో భాగస్వామ్యులు అయ్యారు.
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కార్యాలయం