సెమీకండక్టర్ నిపుణులతో భవిష్యత్తును తీర్చిదిద్దే సువర్ణావకాశం
- * భారతదేశానికి 2030 నాటికి 3 3 లక్షల మందికి పైగా మంది సెమీకండక్టర్ నిపుణులు అవసరం
ప్రపంచ సాంకేతిక రంగంలో సెమీకండక్టర్లు (చిప్స్) నేడు గుండెకాయలా మారాయి. స్మార్ట్ఫోన్లు, కార్లు, కంప్యూటర్ల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), అంతరిక్ష పరిశోధనల వరకు ప్రతి దానికీ చిప్స్ అత్యవసరం. ఈ నేపథ్యంలో గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా భారత్ వేగంగా రూపాంతరం చెందుతోంది. అయితే, ఈ మహోద్యమం విజయవంతం కావాలంటే కేవలం పరిశ్రమల స్థాపనే సరిపోదు, వాటిని నడిపించే మానవ వనరులు అత్యంత కీలకం. ఈ తరుణంలోనే భారత్‌కు 2030 నాటికి దాదాపు 3 లక్షల మంది సెమీకండక్టర్ నిపుణులు అవసరమన్న అంచనా తెరపైకి వచ్చింది. ఇది దేశం ఎదురుచూస్తున్న ఒక గొప్ప ఆర్థిక ప్రగతికి అతిపెద్ద సవాలుగా, అదే సమయంలో సరికొత్త అవకాశంగా నిలుస్తోంది.
భారత్ వైపు గ్లోబల్ చూపు:
గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఇండియా సెమీకండక్టర్ మిషన్’ (ISM) అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. గుజరాత్, అసోం, ఒడిశా తదితర రాష్ట్రాల్లో భారీ ఎలక్ట్రానిక్స్ తయారీ ,ఫ్యాబ్రికేషన్ యూనిట్ల (Fabs) ఏర్పాటుకు గ్లోబల్ దిగ్గజ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. చిప్ డిజైన్ రంగంలో ఇప్పటికే భారత్ ప్రపంచంలోని ప్రతిభావంతులకు వేదికగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న ప్రముఖ సెమీకండక్టర్ ఇంజనీర్లలో గణనీయమైన శాతం మంది మన దేశానికి చెందినవారే కావడం గమనార్హం. ఇప్పుడు ఈ డిజైన్ నైపుణ్యాన్ని మ్యానుఫ్యాక్చరింగ్, అసబ్లీ, టెస్టింగ్ (ATMP) రంగాలకు కూడా విస్తరించాల్సిన సమయం ఆసన్నమైంది.
నిపుణుల కొరత – అధిగమించాల్సిన సవాళ్లు:
2030 నాటికి 3 లక్షల మంది శిక్షణ పొందిన నిపుణులు కావాలనే లక్ష్యం సాధారణమైనది కాదు. సెమీకండక్టర్ తయారీ అనేది అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. నానోమీటర్ స్థాయిలో జరిగే ఈ తయారీకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, మెటీరియల్ సైన్స్, కెమికల్ ఇంజనీరింగ్ వంటి విభిన్న రంగాల్లో ప్రత్యేక నైపుణ్యాలు కావాలి.
ప్రస్తుతం మన దేశంలోని సాంప్రదాయ విద్యా విధానం కేవలం సాఫ్ట్వేర్, సాధారణ ఐటీ రంగాలపైనే ఎక్కువ దృష్టి పెడుతోంది. సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్‌కు అవసరమైన ‘క్లీన్‌రూమ్’ అనుభవం, అత్యాధునిక హార్డ్‌వేర్ పరిశోధనలపై తగినన్ని వనరులు, లాబొరేటరీ సౌకర్యాలు మన విశ్వవిద్యాలయాల్లో పరిమితంగానే ఉన్నాయి. ఈ అంతరాన్ని పూడ్చకపోతే భారీగా వస్తున్న పెట్టుబడులకు తగిన మానవ వనరులు లభించక ఇబ్బంది పడే ప్రమాదం ఉంది.
ప్రభుత్వ, విద్యాసంస్థల, పరిశ్రమల సమన్వయం:
ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. దేశంలోని ఎంపిక చేసిన ఐఐటీలు (IITs) ,ఇతర ప్రముఖ విద్యాసంస్థలలో ప్రత్యేక కోర్సులు, చిప్ డిజైన్ కోర్సులను ప్రవేశపెట్టారు. అయితే ఇది సరిపోదు. ఐటీఐలు, పాలిటెక్నిక్ స్థాయి నుంచే సాంకేతిక శిక్షణ ప్రారంభం కావాలి. పరిశ్రమలు (Industries) ,విద్యాసంస్థలు (Academia) చేతులు కలపాలి. విద్యార్థులకు కేవలం సిద్ధాంతపరమైన (Theoretical) విద్యే కాకుండా, ఫ్యాబ్రికేషన్ యూనిట్లలో నేరుగా ఆచరణాత్మక (Hands-on) శిక్షణ లభించేలా ‘ఇంటర్న్‌షిప్’ కార్యక్రమాలను విస్తృతం చేయాలి. గ్లోబల్ సెమీకండక్టర్ దిగ్గజాలతో భాగస్వామ్యం కుదుర్చుకుని, మన సిబ్బందికి అత్యాధునిక నైపుణ్యాలపై శిక్షణ ఇప్పించాలి.
మహిళా సాధికారత – అదనపు బలం:
సెమీకండక్టర్ రంగంలో మహిళా నిపుణుల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా దేశంలోని అపారమైన మానవ వనరులను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవచ్చు. ఇంజనీరింగ్ పట్టభద్రులవుతున్న మహిళలను ఈ రంగం వైపు ఆకర్షించేందుకు ప్రత్యేక ఫెలోషిప్‌లు, ప్రోత్సాహకాలు అందించాలి.
వచ్చే దశాబ్దంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే రంగాలలో సెమీకండక్టర్ పరిశ్రమ అగ్రగామిగా ఉండనుంది. చైనా ప్లస్ వన్ (China Plus One) వ్యూహం నేపథ్యంలో ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. ఈ చారిత్రక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే 3 లక్షల మందికి పైగా నైపుణ్యం గల నిపుణులను తీర్చిదిద్దడమే మన తక్షణ కర్తవ్యం. సకాలంలో సరైన విద్యాసంస్కరణలు చేపట్టి, యువతకు సరైన శిక్షణనిస్తే.. భారత్ కేవలం చిప్స్ వినియోగదారుడిగా మాత్రమే కాకుండా, ప్రపంచానికి చిప్స్ అందించే ప్రధాన ‘సెమీకండక్టర్ సూపర్‌పవర్’గా అవతరించడం తథ్యం.
Shaping the Future with Semiconductor Experts
- * India will require over 300,000 semiconductor professionals by 2030
Rajadhani Vartalu: In the global technology landscape, semiconductors (chips) have become the heartbeat of modern innovation. They are essential for everything—from smartphones, automobiles, and computers to artificial intelligence (AI) and space exploration. Against this backdrop, India is rapidly transforming into a global semiconductor hub. However, the success of this grand initiative depends not merely on establishing industrial facilities, but crucially on the human capital required to drive them. It is estimated that by 2030, India will need approximately 300,000 semiconductor professionals. This presents both a significant challenge and a remarkable new opportunity for the nation’s anticipated economic progress.
Global Focus on India:
The ‘India Semiconductor Mission’ (ISM), launched by the Central Government over the past few years, is yielding impressive results. Global industry giants are coming forward to establish large-scale electronics manufacturing and fabrication units (Fabs) in states such as Gujarat, Assam, and Odisha, with investments worth thousands of crores. Furthermore, India has already established itself as a global hub for talent in the field of chip design. It is noteworthy that a significant percentage of the world’s leading semiconductor engineers hail from our country. The time has now come to extend this design expertise into the realms of manufacturing, assembly, and testing (ATMP).
Shortage of Experts – Challenges to Overcome:
The goal of having 300,000 trained professionals by 2030 is no small undertaking. Semiconductor manufacturing is an incredibly complex process; it takes place at the nanometer scale and requires specialized skills across diverse fields, including physics, chemistry, electronics, materials science, and chemical engineering.
Currently, our country’s traditional education system focuses primarily on software and general IT sectors. Our universities often lack the necessary resources and laboratory facilities—such as ‘cleanroom’ environments and infrastructure for cutting-edge hardware research—that are essential for semiconductor fabrication. If this gap is not bridged, there is a risk that we may struggle to provide the human capital required to support the massive investments flowing into the sector.
Coordination Among Government, Academia, and Industry:
To achieve this objective, the government has already initiated several measures. Specialized courses, including those focused on chip design, have been introduced at select IITs and other premier educational institutions across the country. However, this is not enough. Technical training must begin as early as the ITI and polytechnic levels. Industries and academia need to join hands. Beyond mere theoretical education, internship programs should be expanded to provide students with direct, hands-on training within fabrication units. Furthermore, by forging partnerships with global semiconductor giants, we can ensure our workforce receives training in cutting-edge skills.
Women’s Empowerment – An Added Strength:
Increasing the participation of female professionals in the semiconductor sector will allow us to fully harness the nation’s vast human resources. Special fellowships and incentives should be offered to attract female engineering graduates to this field.
The semiconductor industry is set to be at the forefront of the global economy over the next decade. In the context of the ‘China Plus One’ strategy, the world is looking toward India. To capitalize on this historic opportunity, our immediate priority must be to develop a skilled workforce of over 300,000 professionals. By implementing the right educational reforms in a timely manner and providing appropriate training to our youth, India is certain to evolve from a mere consumer of chips into a major ‘semiconductor superpower’—a global supplier of chips.






















































